వేములవాడ బీజేపీ (BJP) టికెట్ తనకే దక్కుతుందని తుల ఉమ (Thula Uma) ధీమా వ్యక్తం చేస్తారు. వాస్తవానికి ఫస్ట్ లిస్ట్ లోనే తన పేరు రావాల్సి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన తనకు టికెట్ కోసం పోరాడే పరిస్థితి వస్తుందని భావించడం లేదన్నారు. తనకు టికెట్ రావాలని వేములవాడ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. తనకు బీజేపీ టికెట్ ఇస్తే ప్రజలే ఖర్చు పెట్టుకుని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీసీ మహిళ అయిన తనకు హైకమాండ్ తప్పకుండా అవకాశం కల్పిస్తుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలతో సంబంధాలు లేవన్నారు.
ఇది కూడా చదవండి: TS BJP: తెలంగాణ బీజేపీలో కొత్త చిచ్చు.. ఈటల సీరియస్, కొండా అలక.. అసలేమైందంటే?
TS BJP: వేములవాడ టికెట్ నాదే.. బండి సంజయ్ అడ్డం పడుతుండు: తుల ఉమ సంచలన ఇంటర్వ్యూ
బీసీ మహిళనైన తనకే వేములవాడ బీజేపీ టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బండి సంజయ్ తనకు సోదరుడితో సమానమని.. ఆయన తన టికెట్ కు ఎందుకు అడ్డుపతున్నాడో అర్థం కావడం లేదన్నారు.

Translate this News:











