ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించామన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు. సీఎం అనారోగ్యంగా ఉంటే ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్(KTR), హరీష్ రావు (Harish Rao) చేస్తున్నారన్నారు. ఇంతకన్నా కుటుంబ పాలన కు ఉదాహరణ ఏమి కావాలని ప్రశ్నించారు. బావ బావమరిదులు రాష్ట్రాన్ని సగం సగం పంచుకున్నట్లు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్లో కాన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వంద శాతం లబ్దిదారులకు చేరాయన్నారు. టైం ప్రకారం డెలివరీ చేస్తుంది మోడీ సర్కార్ మాత్రమేన్నారు. మోదీ పథకాలు అమలు, కేసీఆర్ పథకాల అమలు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్..
Telangana BJP: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్: మురళీధర్ రావు
ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించామన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు.

Translate this News:











