BJP Leader Moluguri Bikshapathi: బిజెపి కార్యకర్తలు భగభగ మండే సూర్యులు ఆని, వారిని ఎదిరించే దమ్ము ధైర్యం బిఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) చల్లా ధర్మరెడ్డికి లేదని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల పట్టణంలోని బిజెపి(BJP) కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు మొలుగూరి బిక్షపతి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీ కార్యాలయానికి 2013లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిలాపాలకం వేస్తే నిర్మించేందుకు 10 సంవత్సరాల కాలం పడుతుందా అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: ఈసారి ఓడించకుంటే రాజకీయ సన్యాసమే.. ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్..
బిజెపి కార్యకర్తలు భగభగ మండే సూర్యుడు లాంటి వాళ్ళని అలాంటి వారి జోలికొస్తే చల్ల ధర్మారెడ్డిని మసి చేస్తారని మొలుగూరి భిక్షపతి హెచ్చరించారు. పరకాల నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ధర్మారెడ్డిని తరుముతున్నారని అన్నారు. పరకాలలో చల్ల ధర్మారెడ్డిని ఓడించకుంటే రాజకీయ సైన్యం తీసుకుంటాను సవాల్ విసిరారు.

Translate this News:











