Telangana BJP: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ స్పీడ్ పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ దుమ్ము రేపుతున్నాయి. తాజాగా కల్వకుర్తి పట్టణలో బీజేపీ(BJP) విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న డీకే అరుణ(DK Aruna).. సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌పై, అటు కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిజెపి మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు డీకే అరుణ. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి వెళ్లారని.. ముందు మీ ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టి కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యే లు బిఆర్ఎస్ లోకి వెళ్లరని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
పూర్తిగా చదవండి..Telangana Elections: వాళ్లిద్దరి ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా పోటీ.. హాట్ కామెంట్స్ చేసిన డీకే అరుణ
కేసీఆర్, కేటీఆర్ నిండు ఆశీర్వాదంతోనే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డికి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆచారి బలం తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం పంచుకోవాలనే ఓట్లు చీల్చాలనే దురుద్దేశంతో ఎమ్మెల్సీ కసిరెడ్డికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు డీకే అరుణ.

Translate this News:











