మోదీ సభలు సక్సెస్ అవ్వడంతో కాంగ్రెస్- బీఅర్ఎస్ నేతలు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. కంత్రి రామరావు, హరస్మెంట్ హరీష్రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిందే కల్వకుంట్ల కంత్రి కుటుంబం కోసం అన్నట్టు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర వాఖ్యలు చేశారు. ఎంతో మంది అమాయక యువతను దుబాయ్ పేరుతో దొంగ పాస్ పోర్టులు ఇచ్చి మోసం చేసిన ఘనుడు సీఎం అని డీకే అరుణ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అటువంటి కుటుంబానికి ఇన్ని వేల కోట్లు ఎక్కడివి..? అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చీకటి ఒప్పందం: డీకే అరుణ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తెలంగాణ బండారం బయటపెడితే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారని ఆమె ఫైరయ్యారు. ప్రధానిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.

Translate this News:











