Amit Shah Telangana Tour: కేంద్ర మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule 2023) విడుదల తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారి వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఆయన ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రాత్రి 7:40 గంటలకు ఐటీసీ కాకతీయలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. 6.20 నుంచి 7.20 గంటల వరకు అమిత్ షా రాష్ట్రంలోని మేధావులతో భేటీకానున్నారు అమిత్ షా.
పూర్తిగా చదవండి..Telangana BJP-Amit Shah: రేపు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కేంద్ర హోం మంత్రి రేపు తెలంగాణకు తొలిసారిగా రానున్నారు. ఆదిలాబాద్ లో జరగనున్న పార్టీ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యనేతలతో ఆయన సమావేశమవుతారు.

Translate this News:











