Group Politics in BJP: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకుంటున్న బీజేపీ చేస్తున్న పొరపాట్లే ఆ పార్టీ ఎదగకపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుందా..? ఎలాంటి వ్యక్తి వచ్చినా కళ్లు మూసుకుని కండువా కప్పేసే స్థాయి నుంచి.. పార్టీలో చేరతామంటే వద్దని బ్రేకులు వేయడమే కాదు.. పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాయకులకు నో జాయినింగ్ అని చెబుతుండడంతో తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మినహిస్తే బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువనే విషయం బహిరంగ రహస్యమే. అలాంటి పార్టీకి చేరికలు ప్లస్ అవుతాయే తప్ప మైనస్ కావు. కాని ఇటీవల కాలంలో ఇద్దరు వ్యక్తులు పార్టీలోకి చేరకుండా బీజేపీ బ్రేకులు వేయడం సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురిచేస్తోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి.. కిషన్‌రెడ్డి(Kishan reddy)కి ఆ బాధ్యతలు అప్పగించాక పార్టీలో చేరికల విషయంలో కొంత డైలామా నెలకొందనే వాదన వినిపిస్తోంది. బండి సంజయ్‌తో పాటు.. మరికొందరు నేతలు తీసుకొస్తున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడానికి కండీషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..BJP Politics: వ్యూహామా.. తప్పిదమా..? బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్!
బీజేపీలోకి కృష్ణ యాదవ్ చేరిక వాయిదా పడింది. చీకోటి ప్రవీణ్‌కు కూడా మరోరోజు జాయినింగ్ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్ సిటీతో పాటు కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మినహయిస్తే బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువ ఉంది. బండి సంజయ్‌తో పాటు మరికొందరు నేతలు తీసుకొస్తున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడానికి కండీషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ తెలంగాణ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్ చీకోటి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Translate this News:











