Telangana BJP MLA List: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. తొలి విడతగా 52 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. సెకండ్ లిస్ట్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేసింది బీజేపీ అధిష్టానం. వరుస సమావేశాలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల కమిటీ. శనివారం జరిగిన సమావేశంలో ఫస్ట్ లిస్ట్‌ను ఫైనల్ చేసింది. వాస్తవానికి శనివారమే ఈ లిస్ట్ విడుదల అవుతుందని అనుకున్నప్పటికీ.. పలు కారణాల చేత పార్టీ ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయలేదు. ఇవాళ లిస్ట్ విడుదల కావడంతో సీట్ కన్ఫామ్ అయిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..BJP MLA Candidates: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల.. కేసీఆర్ పై పోటీ చేసేది ఎవరంటే..
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. తొలి విడతగా 52 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో చాలా వరకు బలమైన అభ్యర్థులే ఉండటం విశేషం.

Translate this News:











