Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో పోటీదారులుగా ఎంపికైన సభ్యులు కెప్టెన్సీ ప్రక్రియలో పాల్గొన్నారు. శోభ, గౌతమ్, అర్జున్, సందీప్, ప్రియాంక, ఐదుగురిలో ఇంటి సభ్యుల నుంచి ఎక్కువ మద్దతు లభించిన వాళ్ళు కెప్టెన్ గా ఎంపికవుతారని బిగ్ బాస్ తెలిపారు. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య చాలా వాదనలు జరిగాయి. శోభ (Shobha), యావర్ (Yawar) ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. సహనం కోల్పోయిన శోభ.. యావర్ ను పిచ్చోడా అనడంతో.. ఆయన రెచ్చిపోయి కోపాన్ని తట్టుకోలేక చేతిలో ఉన్న మిర్చీ దండను విసిరికొట్టాడు. ఇక వీళ్లిద్దరూ ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకోవడంతో ఇతర ఇంటి సభ్యులు వీళ్ళ గొడవను ఆపడానికి ప్రయత్నించారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: బలంతో పాటు బలగం కూడా ఉండాలి.. సందీప్ కు అర్జున్ కౌంటర్..!
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్సీ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. రేసు నుంచి తొలగిపోయిన శోభ, సహనం కోల్పోయి యావర్ పై అరిచేసింది. చివరికి ఇంటి సభ్యుల నిర్ణయంతో గౌతమ్ తదుపరి కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

Translate this News:













