
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బిగ్బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది కోర్టు. వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాల్ చేస్తూ 2018లో హైకోర్టును ఆశ్రయించారు జలగం వెంకట్రావు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు నివేదిక సమర్పించారని చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న జలగం వెంకట్రావు సమగ్ర విచారణ తర్వాత వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది హైకోర్టు. సమీప అభ్యర్ధి జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది కోర్టు. ఎన్నికల కమీషన్‌కు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా విధించారు. 2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదని హైకోర్టు తీర్పు చెప్పింది.
పూర్తిగా చదవండి..











