‘బీజేపీతో పొత్తు లేదు.. పొత్తు విషయానికొస్తే అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ లేదు.. ఎన్నికలు వచ్చినప్పుడే నిర్ణయిస్తాం.. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ లేదు.. ఇదే మా స్టాండ్.. అయితే ఇకపై అన్నామలై మా నేతలను విమర్శిస్తే అన్నామలై తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో కమలం పార్టీ కంగుతిన్నది.
పూర్తిగా చదవండి..Breaking: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్.. పొత్తు లేదు పొమన్న అన్నాడీఎంకే!
తమిళ ప్రజలకు పార్టీల కంటే భాషాభిమానం ఎక్కువ. ప్రాంతియ అభిమానం ఎక్కువ.. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపణ అవ్వగా మరోసారి అదే ప్రూవ్ అయ్యింది. తమిళనాడులో అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి అన్నాడీఎంకే గట్టి షాక్ ఇచ్చింది. జయలలిత, పెరియర్, అన్నాదురైపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే మండిపడింది. ప్రస్తుతానికి పొత్తు లేదని.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచిస్తామని తేల్చిచెప్పింది.

Translate this News:











