Chandrababu Gets Interim Bail: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు (Chandrababu Naidu) నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు (High Court) ఈరోజు తీర్పు చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 24న బాబు తిరిగి సరండర్ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబుకు బెయిల్..కండిషన్లు ఇవే
ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. స్కిల్ స్కామ్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. బాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు.

Translate this News:











