సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 169వ సినిమా జైలర్ బంపర్ హిట్టు కొట్టింది. రజనీకి ఇది గ్రేట్ కంబ్యాక్. దీంతో 72 ఏళ్ళ రజనీ రెట్టించిన ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రజనీ కెరీర్ 170వ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. టి.జి. జ్ఞానవేల్ దీనిని డైరక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదు. కానీ మరో రెండు రోజుల్లో ఇది సెట్స్ మీదకు వెళ్ళనుంది. మరోవైపు తలైవర్ 170 గా పిలుచుకుంటున్న ఈ సినిమా కాన్వాస్ అనుకున్నదానికంటే పెద్దదవుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటూ తెలుగు, మలయాళ పెద్ద పెద్ద నటులు కూడా యాక్ట్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..rajinikanth new movie:ఇంతమంది నటులా వామ్మో….ఆసక్తి రేపుతున్న తలైవా 170 మూవీ
జైలర్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా తన 170వ సినిమా గురించి కన్ఫామ్ చేశారు కూడా. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా ఒక సామాజిక సందేశంతో కూడిన భారీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ గురించి వస్తున్న అప్డేట్లు సినీ ప్రియులకు ఆసక్తికరంగా మారాయి.

Translate this News:











