నందమూరి బాలకృష్ణ(Nandamoori Bala krishna) అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత ఈ ఏడాది ప్రారంభంలో, సంక్రాంతి బరిలోకి వీర సింహా రెడ్డి అంటూ గర్జించాడు. యావరేజ్ టాక్‌తోనే మంచి వసూళ్లు సాధించాడు. ఈ రెండు సినిమాలు కూడా వంద కోట్ల గ్రాస్‌ను టచ్ చేశాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. యాభై కోట్ల షేర్, వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. యావరేజ్ టాక్‌తో మొదలైన ఈ మూవీ మౌత్ టాక్‌తో మెల్లిమెల్లిగా దసరా సెలవుల్లో దుమ్ములేపేసింది.
మాములుగా ఉందదు మరి:
భగవంత్ కేసరి సినిమా ఈ ఆరు రోజుల్లో నైజాం ఏరియాలో 13.98కోట్లు, సీడెడ్‌లో 11.95 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.95కోట్లు, గుంటూరులో 5.18కోట్లు, నెల్లూరులో 1.85కోట్లు, ఈస్ట్‌లో 2.46కోట్లు, వెస్ట్‌లో 2.28కోట్లు, కర్ణాటకలో 3.9కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 50లక్షలు, ఓవర్సీస్లో 6.5కోట్లు ఇలా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 55 కోట్ల షేర్.. 104 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి.
BalaKrishna: దుమ్ములేపేశాడుగా.. బాలయ్య బాబు సినిమా కలెక్షన్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే భయ్యా!
ఈ దసరా విన్నర్‌గా నందమూరి బాలకృష్ణ నిలిచాడు. బాలయ్యబాబు నటించిన భగవంత్ కేసరి బాక్స్ఆఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 55 కోట్ల షేర్.. 104 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.

Translate this News:











