Bengaluru bus stand Theft: దొంగలు.. ఇళ్లలో పడి నగదు, ఆభరణాలను దోచుకెళ్లడం(Robbery) చూశాం.. రోడ్డు వెంట వెళ్తుంటే చైనా స్నాచింగ్‌కు పాల్పడటం చూశాం.. బంగారు దుకాణంలో దోపిడీ చూశాం.. బ్యాంకులను కొల్లగొట్టిన తీరునూ చూశాం.. కానీ, ఈ దొంగలు మాత్రం మహా కంచుల్లా ఉన్నారండోయ్. మునుపు ఎవరూ చేయని విధంగా చోరీ చేసి.. యావత్ దేశాన్నే తమవైపు తిప్పుకున్నారు. అవును, కర్నాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఈ దొంగలు విచిత్రమైన చోరీ చేశారు. ప్రజల ఇళ్లలో పడితే పట్టుకుంటున్నారని అనుకున్నారో ఏమో గానీ.. పబ్లిక్ ప్లేసులోనే దర్జాగా చోరీ చేసుకెళ్లారు. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్లో ఏర్పాటు చేసిన రూ. 10 లక్షల విలువైన స్టెయిన్ లెస్ స్టీల్ బస్ షెల్టర్‌ను మాయం చేశారు చోర కళా వల్లభులు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగితే.. బిల్డర్ ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మరి ఈ నెల రోజుల గ్యాప్ ఎందుకు తీసుకున్నారనేది కూడా ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
పూర్తిగా చదవండి..Bizarre: ఓరి మీ దుంపతెగ.. బస్ షెల్టర్‌ను కూడా ఎత్తుకెళ్లిపోయారుగా.. ఎక్కడంటే..
మునుపు ఎవరూ చేయని విధంగా చోరీ చేసి.. యావత్ దేశాన్నే తమవైపు తిప్పుకున్నారు. అవును, కర్నాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఈ దొంగలు విచిత్రమైన చోరీ చేశారు. ప్రజల ఇళ్లలో పడితే పట్టుకుంటున్నారని అనుకున్నారో ఏమో గానీ.. పబ్లిక్ ప్లేసులోనే దర్జాగా చోరీ చేసుకెళ్లారు. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్లో ఏర్పాటు చేసిన రూ. 10 లక్షల విలువైన స్టెయిన్ లెస్ స్టీల్ బస్ షెల్టర్‌ను మాయం చేశారు చోర కళా వల్లభులు.

Translate this News:











