World Cup 2023: భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ (BCCI) తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని.. యధాప్రకారం మ్యాచులు జరుగుతాయని స్పష్టంచేసింది. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చడం కుదరదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా (Rajiv Shukla) స్పష్టంచేశారు. ప్రపంచకప్(World Cup 2023)లో హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచులకు తానే బాధ్యతలు నిర్వహిస్తున్నానని శుక్లా తెలిపారు. సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చడం అంత సులువు కాదన్నారు. షెడ్యూల్‌ను మార్చే నిర్ణయంపై బీసీసీఐ మాత్రమే కాదు ఆయా జట్లతోపాటు ఐసీసీ కూడా స్పందించాల్సి ఉంటుందని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..World Cup 2023: హెచ్‌సీఏకు బీసీసీఐ ఝలక్.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు
భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని.. యధాప్రకారం మ్యాచులు జరుగుతాయని స్పష్టంచేసింది.

Translate this News:











