BhavyaSri Incident: భవ్య శ్రీ మృతికి కారుకులైన నలుగురు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని బలిజ, బీసీ నేతలతో కలిసి వడ్డెర సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై నిర్లక్ష్యం చేసి సమయాన్ని వృధా చేస్తున్న పెనుమూరు ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని వడ్డెర కుల నేతలతో కలిసి రాయల్ పీపుల్స్ ఫ్రెంట్ వ్యవస్థాపకులు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్, బీసీ నేతలు బూసగాని లక్ష్మయ్య యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య , తురక అమర్నాథ్, మల్ల కుప్పం శేఖర్ తదితరులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఈనెల 17వ తేదీన ఆదివారం సాయంత్రం భవ్య శ్రీ మిస్సయిందని వెంటనే పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు సమాచారం ఇచ్చిన నిర్లక్ష్య ధోరణితో పోలీసులు స్పందించకపోవడం వలనే భవ్య హత్యకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కూడా నిజాన్ని ఎందుకు బయటకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ హస్తం ఉందా, లేదా సొమ్ముకు అమ్ముడుపోయారా అనే అనుమానం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు లో న్యాయం జరిగేంత వరకు తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కోరారు. మహిళా కమిషన్ ఏమైందని, పద్మజ మేడం ఎక్కడికెళ్ళిందని, పరామర్శించడానికి రాకపోవడంలో ఆంతర్యం ఏమిటని అనుమానాన్ని వ్యక్తం చేశారు. భవ్య అత్యాచార హత్య సంఘటనపై ఈరోజు సోమవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. భవ్య కేసు ను తీవ్రంగా పరిగణిస్తూ దిశా చట్టం మాదిరి భవ్య చట్టాన్ని తేవాలన్నారు. పేద వర్గాలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు? భవ్య కేసు పై ఎస్పీ తో పాటు సి.బి.ఐ కూడా విచారణ చేపట్టాలని కోరారు.
అయితే, భవ్యశ్రీకి నలుగురు అబ్బాయిలు ప్రపోజ్ చేయగా.. వారికి నో చెప్పిందని ఒక ప్రచారం జరుగుతోంది. వారే ఇంతటి కిరాతకానికి పాల్పడినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. తమను కాదన్నందుకు ఆగ్రహంతోనే.. పక్కా ప్లాన్ ప్రకారం భవ్య శ్రీని కిడ్నాప్ చేసి, ఇంతటి దారుణానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. భవ్యశ్రీ పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ.. ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితి ఉంది.
Also Read: మిస్టరీగా భవ్యశ్రీ మృతి.. చంపింది ఆ ముగ్గురేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెరు?
[vuukle]












