బీసీ బంధు కింద కుల వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న లక్ష రూపాయల సహాయం దేశానికే ఆదర్శమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో పర్యటించిన ఆయన.. లబ్దిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే.. నిరుపేదల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్ పాలనలో జుక్కల్ నియోజకవర్గంలో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యమైనందుకు తాను గర్వ పడుతున్నానన్నారు.
పూర్తిగా చదవండి..MLA Hanmant Shinde: బీసీబంధు దేశానికే ఆదర్శం
బీసీబంధు లబ్దిదారులకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కుల వృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను ఈ నేల బిడ్డెనే అన్న ఎమ్మెల్యే ఈ నేలమీదకు పరాయి వ్యక్తిని రానివ్వొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











