ప్రధానమంత్రి రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ అభివ్రుద్ది కోసం రూ.20 వేల కోట్లకుపైగా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. దీంతోపాటు 9 ఏళ్లలో తెలంగాణ కోసం రూ.9 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తూ అనేక అభివ్రుద్ది, సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్నారన్నారు. యావత్ ప్రపంచం మోదీ పట్ల సానుకూలతతో ఉందన్న బండి సంజయ్…ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు తలెత్తుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల్లో మోదీకి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని బండి ఆరోపించారు. ప్రధాని గౌరవాన్ని తగ్గించేలా చిల్లరగా మాట్లాడుతున్నారంటూ బండి ఫైర్ అయ్యారు. తెలంగాణపట్ల మోదీ విషయం చిమ్ముతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ముఖ్యంగా ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) నిలువెల్లా విషం నింపుకున్నడని…. మోదీపై విషం చిమ్ముతున్నాడని.. తెలంగాణలో అభివ్రుద్ది పనులకు నిధులు కేటాయిస్తే కూడా విషం చిమ్మడం అవుతుందా? అంటూ ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ మిస్సింగ్.. ఏ క్షణమైనా బీఆర్ఎస్ చీలే ప్రమాదం: బండి సంజయ్ సంచలన వాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోదీ బయటపెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందన్నారు. తన సడ్డకుడి కొడుకును కేసీఆర్ తన ఇంటికి కూడా రానీయడం లేదన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే… డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. బుధవారం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.

Translate this News:











