Bandi Sanjay Comments on BRS: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో(Lok Sabha) మాట్లాడిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత పేరు ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ అంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, ఇక్కడి కాంగీ, తెలంగాణ కేడీ అవిశ్వాసం ఎందుకు పెట్టారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందన్నారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆస్తులు 400 రెట్లు పెరిగాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రజలను పీక్కుతింటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1400మంది చనిపోయారన్నారు. బీఆర్ఎస్కు తెలిసింది ఏంటంటే రాత్రంతా తాగడం, ఉదయం పడుకోవడం, ఎవరినీ కలవకపోవడమని బండి ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay : బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రాష్ట్ర సమితి: బండి సంజయ్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు నాశనమవుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు.

Translate this News:











