Balineni Srinivasa Reddy: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే తెలియని వారుండరు. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉంటూ ఆ పార్టీ వ్యవహారాలన్ని చక్కబెడుతూ ఉండేవారు. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో అయితే ప్రజలు ముద్దుగా వాసన్న అని పిలుచుకుంటారు. గత ఐదు పర్యాయాలుగా ఒంగోలు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో బాలినేనిపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేయడం సంచలన రేపింది. ఈ క్రమంలోనే ఆయన అక్రమంగా కోట్లు సంపాదించారని.. ఆస్తులు కూడబెట్టారని.. పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
పూర్తిగా చదవండి..సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు: బాలినేని
మాజీ మంత్రి, ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారా? సీఎం జగన్కు దగ్గరి బంధువైన ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ వార్తలపై బాలినేని ఎలా స్పందించారు?

Translate this News:











