ఒకసారి చేస్తే పొరపాటు.. రెండు సార్లు తప్పు.. మూడో సారి చేస్తే నేరం.. పదేపదే అదే చేస్తే ఘోరం..! అవే ఘోరాలు అదేపనిగా జరిగితే వందలాది బతుకులు బూడిదవుతాయి.. వేలాది జీవితాలు చికట్లో మగ్గిపోతాయి. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలకైనా, రైళ్ల ప్రమాదాలకైనా ప్రధాన కారణం ఒక్కట్టే. అదే నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యం, ఏం జరుగుతుందిలేనన్న అలసత్వం. గత జూన్లో జరిగిన బాలాసోర్ రైళ్ల ప్రమాదానికైనా, నిన్న జరిగిన విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్కైనా, ఈ మధ్యలో జరిగిన బీహార్ ఘటనకైనా మూలం నిర్లక్ష్యమే. సాంకేతిక లోపాలు, టెక్నాలజీ ఒక సాకు మాత్రమే. ఘటన జరిగిన అధికారులు వందల కారణాలు చెప్పవచ్చు.. కానీ చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేరు కదా..! యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కానీ.. జరిగిపోయిన తర్వాత కారణాలు చెప్పడం కాదు. 1981లో జరిగిన భాగమతి రివర్ ట్రైన్ ప్రమాదం నుంచి విజయనగరం ప్రమాదం వరుకు ఇండియాల్లో వందల్లో రైళ్ల ప్రమాదాలు జరిగాయి. పదేపదే అవే ఘటనలు జరుగుతున్నా.. ఇప్పటికీ పాత సాకులే చెబుతుండడం బాధాకరం!
పూర్తిగా చదవండి..Train Accidents: 5 నెలలు.. 3 ఘోర రైళ్ల ప్రమాదాలు.. కారణం మాత్రం ఒక్కటే!
నిర్లక్ష్యానికి వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జూన్లో జరిగిన ఒడిశా రైళ్ల ప్రమాదం నుంచి నిన్న జరిగిన విజయనగరం రెండు రైళ్ల ఢీకొన్న ప్రమాదం వరకు అడుగుఅడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ అక్టోబర్ 11న జరిగిన బీహార్ ట్రైన్ యాక్సిడెంట్లోనూ రైల్వే ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఉందని తేలింది. ఒడిశా ఘటనలో 296మంది, బీహార్ ఘటనలో నలుగురు, విజయనగరం ఘటనలో ఇప్పటివరకు 14మంది ప్రాణాలు విడిచారు.

Translate this News:














