గణేశ్ నవరాత్రులు అనగానే తెలుగు రాష్ట్రాల్లోని భక్తుల్లో రెండు ఆసక్తికర ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అందులో మొదటిది.. ఈ సారి ఖైరతాబాద్ గణేశుడి (Khirathabad Ganesh) ఎత్తు ఎంత?, రెండవది బాలానగర్ గణేశుడి లడ్డూ (Balapur Ganesh Laddu Price) ధర ఈ సారి ఎంత?. ఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు బాలాపూర్ లడ్డూ వేలం జరగనుంది. దీంతో ఈ సారి ధర ఎంత పలకవచ్చనే అన్న అంశంపై భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక్కడి లడ్డూను వేలంలో సొంతం చేసుకున్న వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు సైతం వేలంలో పాల్గొనడానికి అత్యంత ఆసక్తి చూపుతుంటారు. ఈ వేలాన్ని చూడడానికి కూడా భక్తులు సైతం భారీగా తరలి వస్తుంటారు. గతేడాది అత్యధికంగా రూ.24.60 లక్షల రికార్డు ధర పలకడంతో ఈ సారి అంతకు మించి పలికే అవకాశం ఉంది. ఈ సారి బాలాపూర్ లడ్డూ ధర రూ.30 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?
Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ లడ్డూకు భలే డిమాండ్.. గత తొమ్మిదేళ్లుగా పలికిన ధరల వివరాలివే!
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం రేపు జరగనుంది. గతేడాది అత్యధికంగా రూ.24.60 లక్షల రికార్డు ధర పలకడంతో ఈ సారి అంతకు మించి పలికే అవకాశం ఉంది. ఈ సారి రూ.30 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Translate this News:











