Balakrishna: అఖండ సినిమా నుంచి మొదలైన బాలయ్య క్రేజ్ అన్ స్టాపబుల్ గా కొనసాగుతూనే ఉంది. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన భగవంత్ కేసరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలయ్యకు కెరియర్ లో మరో విజయాన్ని అందించింది. భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు బాలయ్య. అంతే కాదు బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ నెంబర్ 1 రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. కెరియర్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకు సిద్ధమయ్యారు.
పూర్తిగా చదవండి..Balakrishna Next Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్.. నెక్స్ట్ మూవీ గురించి తెలిస్తే పూనకాలే..!
వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ల తర్వాత మరో సంచలన సినిమాకు బాలయ్య సైన్ చేశారు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. ఈ సినిమాలో బాలయ్య పార్ట్ ను కేవలం 28 రోజుల్లో షూట్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. ఎన్నికల నాటికి విడుదల చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Translate this News:















