చంద్రబాబును కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ భార్య బ్రహ్మణీ తాడేపల్లిలోని సీట్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే నారా లోకేష్, చంద్రబాబు భార్య భువనేశ్వరీతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ పోలీసులు చంద్రబాబును చూసేందుకు కుటుంబ సభ్యులను, బంధువులను మాత్రమే లోనికి అనుమతించారు. దీంతో తాము కూడా చంద్రబాబును చూస్తామని, తమ నాయకున్ని చూసేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు. కాని పోలీస్ అధికారులు వారి మాటలను పట్టించుకోలేదు. వారిని సీట్ కార్యాలయంలోకి అనుమతించలేదు. మరోవైపు చంద్రబాబును సీట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్కు సంబంధించి దాదాపు 25 ప్రశ్నలను సీట్ అధికారులు చంద్రబాబు ముందు ఉంచినట్లు సమాచారం. కాగా చంద్రబాబు నాయుడు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారా లేదా అనేది సందిగ్ధంగా మారింది.
పూర్తిగా చదవండి..Chandrababu arrested: సిట్ కార్యాలయానికి చేరుకున్న బాలకృష్ణ, బ్రాహ్మణీ..
చంద్రబాబును కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ భార్య బ్రహ్మణీ తాడేపల్లిలోని సీట్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే నారా లోకేష్, చంద్రబాబు భార్య భువనేశ్వరీతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.

Translate this News:











