చంద్రబాబు తరుఫున సీనియర్ న్యాయవాదులు ముగ్గురు వాదిస్తున్నారు. వారిలో సిద్ధార్ధ్ లూథ్రా మొదటివారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈయన మొదట నుంచి బాబు తరుఫున వాదిస్తున్నారు. ఈరోజు బాబు పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీని తర్వాత సిద్ధార్ధ్ చేసిన ట్వీట్ చాలా వైరల్ అవుతోంది. ప్రతీరాత్రి తెల్లవారుతుంది. ప్రతీ ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు పిటిషన్ కొట్టివేయడాన్ని ఉదాహరణగా చూపిస్తూ లూథ్రా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు బెయిల్ రాకపోతే రేపు వస్తుంది అని చెబుతున్నట్లు అనిపిస్తోంది. దీనిబట్టి చంద్రబాబు కేసును సిద్ధార్ధ్ లూథ్రా అంత తేలికగా వదిలేయడం లేదని…దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్స్ బలంగా వేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా మరో ట్వీట్
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. బాబు వేసిన పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

Translate this News:











