Deepthi Case: అక్కను చంపిన చెల్లి.. దీప్తి కేసును తేల్చిన పోలీసులు
Deepthi Case – మర్డర్ చేసింది…
కోరుట్ల దీప్తిది మర్డర్ అని తేల్చే చెప్పారు పోలీసులు. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లేటప్పుడు దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టి వెళ్లిపోయినట్టు ఒప్పుకున్న సోదరి చందన. బాయ్ ఫ్రెండ్, ఆమె తల్లి, మరో బంధువు, కారు డ్రైవర్‌తో కలిసి చందనే మర్డర్ చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది చందన. సీనియర్ అయిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. మతాతంతర వివాహం కావడంతో ససేమిరా అన్నారు తల్లిదండ్రులు, అక్క దీప్తి. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని సమయంలో అక్క దీప్తితో నాల్గురోజుల క్రితం ఇంట్లో చందన గొడవపడింది. ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసి వెళ్లిపోయినట్టుగా ప్రాథమిక సమచారం. దీంతోనే శ్వాసడక దీప్తి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి మృతి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగు బృందాలుగా ఏర్పడి దీప్తి కేసును దర్యాప్తు చేశారు పోలీసులు. కీలకంగా భావిస్తున్న సోదరి చందన, స్నేహితుడును పోలీసులు అదుపులోకి తీసుకుని విషయాన్ని లాగేశారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్, చందన వాయిస్ మెసేజ్, ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఈ కేసుకు బలమైన ఆధారలు లభించాయి.
నిజాలు ఒప్పుకున్న చెల్లి చందన
జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన దీప్తి కేసులో మిస్టరీ వీడింది. కీలకంగా భావిస్తున్న సోదరి చందన, స్నేహితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీప్తి మద్యం సేవించిన టైంతో తన సోదరి దీప్తిని చంపిదని వెల్లడించారు.
అయితే దీప్తి విషయంలో చందన చెప్పిన విషయాలన్నీ అబద్ధాలే. పక్క ప్లాన్ తోటే ఆమె నలుగురితో కలిసి ఈ హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి వడిగట్టింది చందన. చేయాల్సిన పని అంతా చేసి నేనేమీ చేయలేనంటూ నాటకాలు మొదలుపెట్టింది. చివరకు అన్ని విషయాలను పోలీసులకు వివరించింది.
Also Read: రేవంత్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ వార్
KHAMMAM POLITICS : తుమ్మలకు, నాకు బీఆర్ఎస్ లో అవమానాలే మిగిలాయి.. పదికి పది సీట్లు సాధించి బుద్ధిచెబుతాం: పొంగులేటి
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పొంగులేటి స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న ఇద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ తుమ్మల సేవలను కొనియాడారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం చిత్తశుద్ధితో తుమ్మల పని చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన తలపండిన నేత, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సీఏం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి” అన్న చందంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉన్నవారిని పొమ్మనకుండా పొగబెడుతున్నారని ధ్వజమెత్తారు. తనను అవమానించినట్టే.. తుమ్మలను కూడా అనేక అవమానాలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కుమిలి కుమిలి పోయాం.. కనీసం అపాయింట్మెంట్ కూడా దొరక్క అవమానపడ్డాం. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో ఘన విజయం సాధించి బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతాం” అని హెచ్చరించారు పొంగులేటి.
తుమ్మల రాక కోసం కాంగ్రెస్ ఎదురుచూపు
తుమ్మల రాక కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోందని అన్నారు పొంగులేటి. ఇవి ఒక్కళ్లే స్వయంగా తీసుకునే నిర్ణయాలు కావని, అనుచరుల అభిప్రాయం మేరకే తుది నిర్ణయం ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అనుచరులు, మద్దతుతారులతో చర్చించి కాంగ్రెస్ లో పార్టీలో చేరానని అన్నారు. తుమ్మల కూడా ఆయన అనుచరులతో మాట్లాడి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని.. 10కి 10 సీట్లు సాధిస్తుందని అన్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించానని అన్నారు.
తుమ్మల ఇంట అభిమానుల సందడి
పార్టీ మార్పు ప్రచారం సందర్భంగా తుమ్మల ఇంటి దగ్గర అనుచరులు, కార్యకర్తల సందడి ఎక్కువైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తన చిరకాల మిత్రులు పొంగులేటి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ జీవితం ప్రజలు ఇచ్చిందని, అంది వచ్చిన అవకాశాలతో వచ్చిన అభివృద్ధి చేస్తానని అన్నారు. ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖలో నూటికి నూరుశాతం పనిచేశానని అన్నారు. సీతారామ నీళ్లు జిల్లాలోకి తీసుకొచ్చి మీ అందరి కాళ్ళు కడిగి రాజకీయాలకు స్వస్తి పలకాలని ఉందని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అభీష్టం మేరకే ఉంటుందని తుమ్మల వ్యాఖ్యానించారు.

Jagittala: కోరుట్ల దీప్తి కేసులో మరో ట్విస్ట్.. చెల్లెలి ఆడియో కలకలం
దీప్తి ఒంటిపై గాయాలు..
జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో మరణించిన దీప్తి కేసులో మిస్టరీ వీడలేదు. కీలకంగా భావిస్తున్న చెల్లెలు చందన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీప్తి మృతితో తనకు సంబంధం లేదన్న చెల్లెలి ఆడియో కలకలం రేపుతోంది. ఎవరో బాయ్ ఫ్రెండ్ ఆక్కకు ఫోన్ చేశాడని తమ్ముడికి చందన వివరించింది. డబ్బులు, బంగారం మాయం కావటం.. దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. అనుమానస్పదంగా మృతి చెందినా.. దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా దీప్తి టీషర్ట్ కింద శరీరం కాస్త కమిలిన గాయాలు, చెంపపై గీసుకుపోయినట్లుగా ఓ చిన్న గాయం ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు దీప్తి చేతులు కట్టేసినట్లుగా మణికట్టు వద్ద గాయం ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ చేయి విరిగి ఉంటే పక్కాగా దీప్తి హత్యకు గురైందన్న అంశానికి మరింత బలం చేకూరేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చందన పోలీసుల అదుపులో ఉన్నట్లు ఊహాగానాలపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
దీప్తిది హత్యా? ఆత్మహత్యా?
కీలకంగా భావిస్తున్న చెల్లెలు చందన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చందన.. తమ్ముడు సాయికి పంపినట్టుగా భావిస్తున్న ఓ ఆడియోలో సాయి.. “నేను చందు అక్కను’.. అసలు నిజం ఏంటంటే..? దీప్తి అక్క, నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాం..!! కానీ.. నేను తాగలేదు.. అక్కనే తాగింది. నేను ‘మా ఫ్రెండ్ చేత రెండు మందు బాటిళ్లు’ తెప్పించినట్లు నేను ఒప్పుకుంటా.. కానీ నేను తాగలేదని చందు చెప్పింది. అక్క తాగి తన బాయ్ ఫ్రెండ్‌ను పిలుస్తా అంటే నేను ఒప్పు కోలేదు. అయినా పిలుస్తాను అనడంతో ఒప్పుకున్నా అని చందు ఫోన్లో సాయికి వివరించింది. ఇంట్లోంచి నేను వెళ్లిపోవాలని అనుకున్నది నిజమే కానీ అక్కకు చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా. ‘మీరు అందరూ నన్ను వెయిట్ ఉన్నావని అంటుంటే బయటకు వెళ్లి ఒంటరిగా ఉండాలని అనుకున్నా.. నాకు బయట ఎక్కడా డబ్బులు లేవు అందుకే డబ్బులు తీసుకున్నా” అని ఉంది.
నేను బ్రీజర్ తాగాను..:
“నేను అక్కను ఏమీ చేయలేదే డాడీ’.. ప్లీజే..నమ్మండి నన్ను. అక్క తాగుదాం అంటేనే నా ఫ్రెండ్‌కు చెప్పి రెండు బాటిల్స్ తెప్పించాను. నేను బ్రీజర్ తాగాను. అక్క ఓడ్కా తాగింది. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు” అంటూ ప్రాధేయపడుతూ తమ్ముడికి పంపినట్టుగా ఉన్న వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది. దీప్తి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు వివరాలను సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉందని, దీప్తిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం పూర్తి విచారణ తర్వాత తెలుస్తుందని సీఐ పేర్కొన్నారు.
Rangareddy: శంషాబాద్‌లో విషాదం..సెఫ్టిక్ ట్యాంక్‌లో పడి బాబు మృతి
ప్రాణం తీసిన డ్రైనేజీ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహం వేడుకకు వచ్చి ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయిన అభిజిత్‌రెడ్డి అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన బాలుడు ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయాడు. ఏవరు గమనించకపోవడంతో ఊపిరి ఆడక మరణించాడు. బాబు కనిపించడం లేదంటూ తండ్రి శ్రీకాంత్ రెడ్డి వెతికినా..ప్రయోజనం లేకుండా పోయింది. సాయంత్రం వరకు బాబు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి శ్రీకాంత్ రెడ్డి. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యం
సాయంత్రానికి అదే ఫంక్షన్ హాల్లోని సెప్టిక్ ట్యాంక్‌లో బాలుడి మృతదేహం కనిపించటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదశాత్తు బాలుడు అందులో పడి చనిపోగా మృతదేహాన్ని బయటకు తీశారు. మై ఫెయిర్ ఫంక్షన్ హాల్లో ఈ ఘటన జరగింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటున్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పంక్షన్ హాల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనా స్థలానికి చేరుకోక ముందే బాలుడి మృతదేహాన్ని ఎలా ఉస్మానియా మార్చురీకి తరలిస్తారని పోలీసులతో బాలుడి కుటుంబ సభ్యుల వాగ్వాదం దిగారు. దీంతో పలువురు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.
Bhatti: కాంగ్రెస్ 78 సీట్లతో గెలవడం ఖాయం: భట్టి ధీమా
ఒక్కసారి మాట ఇచ్చిందంటే…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగకముందుకే కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలపై భట్టి జోస్యం చెప్పేశారు. నేడు తిరుమలకు వెళ్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 74 నుంచి 78 సీట్లతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్లు కేటాయింపు ఉంటుందని భట్టి వివరించారు. అంతేకాకుండా ఆచరణకు సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ ఎప్పుడు ఇవ్వదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తుందని ఆయన తెలిపారు.
టికెట్లపై నేతల్లో ఆందోళన
అంతేకాకుండా కాంగ్రెస్ నేతలకు మరోవైపు ఇప్పుడు ఉదయపూర్ టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో రెండు టికెట్లు పొందాలనుకునే నేతలందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న వారికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. దేశమంతటా ఇంప్లిమెంట్ చేస్తామని గతంలో కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రకటించారు. అయితే కుటుంబంలో టికెట్లు ఏమవుతాయని అభిప్రాయం అందరి నేతలు అంతర్గతంగా మదనపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలకు ఏ విధంగా వెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ కసరాత్తు చేస్తోంది. అంతేకాకుండా స్థానిక పరిస్థితుల ఆధారంగా పార్టీకి టికెట్లు కేటాయించాలని అధిష్టానం భావిస్తోంది. ఇక దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిందే.
నిధులు ఆవిరైపోయాయి
ఈ సందర్భంగా భట్టికి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై భట్టి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని గెలిచే ప్రక్రియ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కొనసాగింది. ఈ ప్రభంజనం దేశమంతా కొనసాగుతుందని భట్టి దీనిపైన కామెంట్ చేశారు. 70 ఏళ్ల పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత కూడా అప్పు రూ. 69 వేల కోట్లు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.ఐదు లక్షల కోట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అప్పు ఉన్నా ఎలాంటి ఆస్తులు సంపాదించలేకపోయిందని మండిపడ్డారు. ఏ విధంగా అయినా నిధులు కోసం అయితే రాష్ట్రానికి తెచ్చుకున్నామో.. ఆ నిధులు ఆవిరైపోయాయని అన్నారు. బాధ్యత గల పదవిలో ఉంటూ ప్రజా నాయకులుగా కొనసాగుతూ ఒకరిని చంపేస్తా అనడం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం స్పందించి క్రిమినల్ కేసులు చేయాలని భట్టి డిమాండ్ చేశారు.











