Kishan Reddy: విమోచన దినోత్సవం జరపకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారు: కిషన్‌రెడ్డి
Kishan Reddy Press Meet
ప్రజల దృష్టిని మళ్లించేందుకు..
సీఎం కేసీఆర్ (CM KCR) విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవం జరపాలని గతంలో కాంగ్రెస్‌ను నిలదీసిన కేసీఆర్.. నేడు ఎందుకు విమోచన దినోత్సవం (Telangana Liberation Day) వేడుకలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఅర్ఎస్ (BRS) ప్రయత్నం చేస్తోందన్నారు. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసింది. అమిత్ షా (Amit Shah) పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం బీఅర్ఎస్, కాంగ్రెస్ చేస్తోందన్నారు.
విమోచన దినోత్సవ వేడుకలను పక్కదారి
సెప్టెంబరు 17 సాయంత్రం రాష్ట్రపతి భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయిని తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం మన్నారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతోందన్నారు. మీరు మీటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు.. కానీ అదే రోజు ఎందుకు పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ మజ్లిస్ తో కుమ్మకై విమోచన దినోత్సవ వేడుకలను పక్కదారి పట్టిస్తున్నాయని కేంద్రమంత్రి విమర్శలు చేశారు. గత ఏడాది కేంద్ర అధీనంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా డుమ్మా కొట్టిన కేసీఆర్..ఈ ఏడాది కూడా కేసీఆర్‌కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తాం అన్నారు. సీఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలన్నారు.
మెడికల్ కాలేజీ పేరుతో..
బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ దేశానికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వలే తెలంగాణకు విమోచన దినోత్సవం అంతే ముఖ్యం అన్నారు. అసదుద్దీన్ ఎక్కడ అలుగుతాడు అనే విమోచన దినోత్సవం కాంగ్రెస్, బీఅర్ఎస్ జరపటం లేదు.కాంగ్రెస్ మీటింగ్ మరే ఏ తేదీలో అయిన జరపవచ్చు. అదే రోజు జరపాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలో ప్రారంభోత్సవం పేరుతో రాజకీయ సభకు సీఎం కేసీఆర్ తెరలేపని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు.
Also Read: కేసీఆర్‌పై తమిళిసై సంచలన వ్యాఖ్యలు..!
Cinema: భారతీయుడు వచ్చేస్తున్నాడు
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండ్ డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. రెండు దశాబ్దాల నాటి బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. ఐకానిక్ ‘సేనాపతి’ పాత్ర మరోసారి ఇండియన్-2 రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ దాదాపు లాక్ అయింది.

గతంలో ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే రెండు పార్ట్‌ల రిలీజ్‌ని కాన్సిల్ చేసిన టీమ్, ఇప్పుడు ఒక భాగంగానే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా ఇండియన్-2 సినిమాకు విడుదల తేదీ ఖరారు చేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా, 2024 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అవుతుంది.

కమల్ హాసన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది ఇండియన్-2. ఇందులో కమల్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో రకుల్ ప్రీత్ కనిపించనుంది. బాబీ సింహా, సముద్రఖని, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పార్ట్-1లో తండ్రికొడుకులుగా నటించాడు కమల్. పార్ట్-2లో మాత్రం సినిమా మొత్తం సేనాపతి పాత్ర చుట్టూ తిరుగుతుంది.

ఇదే తొలిసారి.
ఇండియన్-2కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. 2 దశాబ్దాల తర్వాత ఓ సినిమాకు సీక్వెల్ రావడం ఇదే తొలిసారి. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ మూవీ తర్వాత శంకర్, తన సినిమాను తానే రీమేక్ చేయబోతున్నాడు. అదే అపరిచితుడు. హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమా రీమేక్‌ను స్టార్ట్ చేస్తాడు శంకర్.
Multispecialty Hospital: ఫుడ్ పైప్ మూసుకుపోయి ఆహారం మింగలేకపోతున్నారా.? ఈ కారణాలలో ఒకటి ఇదే..!!
మింగడం అసాధ్యం
అచలాసియా కార్డియా అని పిలువబడే ఈ వ్యాధిలో.. అన్నవాహిక యొక్క కండరాలు అన్నవాహిక నుంచి కడుపుకు ఆహారాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా అన్నవాహిక వద్దే ఆహారం మూసుకుపోతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, అది మింగడం అసాధ్యం. ఇది ఆహారం లేదా పానీయం గొంతులో చిక్కుకుపోయిన అనుభూతి, గుండెల్లో మంట, ఛాతీ నొప్పి, దగ్గు, ఆహారం ఊపిరితిత్తులలోకి చేరడం, బరువు తగ్గడం మరియు వాంతులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఏ వయస్సు వారికైనా వస్తుందని డాక్టర్ రాజేష్ తెలియజేశారు.
మెరుగైన ఫలితాలు
అచలాసియా కార్డియాకు అనేక శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, అన్నవాహిక చివర కండరాలను సరిచేయడానికి నోటి గుండా ఎండోస్కోపిక్ పరికరాన్ని పంపే పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ “POEM” యొక్క ఇటీవలి అభివృద్ధి సురక్షితమైన మరియు ఖచ్చితమైన ప్రక్రియ డా. భట్టిని. రాజేష్ ఉద్ఘాటించారు. మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి కోత మరియు కుట్లు అవసరం లేదని తెలియజేయబడింది.
పరికరాలు ఉంటే.. చికిత్సలు విజయవంతం
9 ఏళ్ల నుంచి 72 ఏళ్ల మధ్య వయసున్న 100 మందికి పీవోఈఎం చికిత్సను విజయవంతంగా అంధించిన ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజేష్‌ను ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సన్మానించారు. పోతినేని రమేష్ బాబు అభినందించారు. నైపుణ్యం, అనుభవం, నాణ్యమైన అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నప్పుడే ఇలాంటి చికిత్సలు విజయవంతంగా నిర్వహించవచ్చని ఈ నెల 9న దేశవ్యాప్తంగా 8 మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రూప్ క్వాలిటీ హెడ్ డాక్టర్ సౌజన్య, అనస్థీషియాలజిస్ట్, డాక్టర్ చెరుకూరి పద్మజ పాల్గొన్నారు.
Prakasam: సైరా నరసింహారెడ్డికి.. ప్రకాశం జిల్లాకి ఉన్న సంబంధం ఇదే..!!
సత్యాలు వెలికి తీత
ఉరి కొయ్యలనే ఉయ్యాలగా మలుచుకున్న ఉయ్యాలవాడ గురించి గిద్దలూరు ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన చరిత్ర సత్యాలను వెలికి తీసింది.1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.1946 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1947 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది.
దీపం వెలుగుతో పాలనా
పాలనా పరంగా నరసింహారెడ్డి ఒకనాడు ప్రస్తుత గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడే కొద్దిసేపు సేద తీరాడు. నరసింహారెడ్డి నరసింహస్వామి కలలోకి రావడంతో పక్కనే ఉన్న 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నరసింహస్వామి ఆలయం నిర్మించారు. అప్పటి నుండి నిత్యం దూప, దీప నైవద్యాల కోసం పూజారిని నియమించాడు ఉయ్యాలవాడ. కొత్తకోట నుండి నరవకొండపై ఉన్న దీపం వెలుగుతో పాలనా సాగించేవాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అప్పటి నుంచి నేటి వరకు ఒక వంశానికి చెందిన వారే పూజలు నిర్వహిస్తున్నారు.
ఆనవాళ్లు ఉన్నాయి
కొత్త కోటలో నరసింహారెడ్డి నిర్మించుకున్న బురుజు గ్రామస్థుల సహకారంతో బయటకి వచ్చాయి. ఆనాడు నరసింహరెడ్డి వాడిన పిరంగి పరిశీలిస్తే నరసింహారెడ్డి వాడిన ఫిరంగి టన్నుపైగా బరువు ఉన్నట్లు తెలిసింది. నరసింహారెడ్డి బురుజుపై తన రాజ్యంలోకి శత్రువులను గమనిచుటకు సెంట్రీలను కూడా ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు కూడా కనపడుతున్నాయి. కోటలోకి ప్రవేశించాలి అంటే కోట చుట్టూ 20 అడుగుల వెడల్పుతో పెద్ద కాలువ ఉంది. సైన్యంకి ప్రజలకు తాగునీటి అవసరాల కోసం నరసింహారెడ్డి తవ్వించిన మంచినీళ్ళ బావి కూడా మనకి కనపడుతుంది.
Siddipet: కొంగర్‌కాలన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: కోమటిరెడ్డి
సభను విజయవంతం చేయాలని
ఈనెల 17న కొంగర్ కాలన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. ఇది చారితత్మక సభ అని… కర్ణాటకలో మాదిరిగా సోనియా గాంధీ ప్రకటన చేస్తారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కూడా 10 ఏళ్ల నుంచి బాధలో ఉన్నామని.. బంగారు తెలంగాణ పేరు నేడు బ్రతక లేని తెలంగాణగా మారిందన్నారు. రాష్ట్రంలో 5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని విమర్శించారు. 70 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని.. ఎన్నికలు వస్తున్నాయని, దళిత బంద్, బీసీ బందు పెట్టీ వారి కార్యకర్తలకు ఇస్తున్నారు. పేద ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ని ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేరు
సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పాడన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. జీతాలు సకాలంలో ఇవ్వక ఉద్యోగులను ఇబ్బందులు పెడ్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హోమ్ గార్డ్ రవీందర్ మరణించడం దురదష్టకరం అని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని వాపోయారు. నేడు బీఆర్ఎస్ ఇచ్చే 4వేల పెన్షన్ కాంగ్రెస్ హయాంలో నాలుగు వందలతో సమానమని అన్నారు. కేసీఆర్ డబ్బుల మీద ఆధారపడితే, మేము ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తామన్నారు. కేసీఆర్నీ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేరన్నారు.
పదవికి రాజీనామా చేస్తా
పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుందన్నారు. రెండు రోజుల నుండి 10 గంటల కరెంట్ కూడా రావడం లేదన్నారు. తనకి కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదు కానీ కేసీఆర్ ప్రభుత్వంపై ఉందన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవినీ వదులుకున్నా నాని గుర్తు చేశారు. కేసీఆర్ 70వేల పుస్తకాలు చదివినా అన్నవ్, దళిత సీఎం ఎటుపోయింది? వెలమలకు 8 మంత్రి పదవులు ఇస్తావా..?, బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చావ్..? ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే టికెట్‌ను కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్నీ ఇంటికి పంపేందుకు కొంగర కొలాన్ మీటింగ్ అని.. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో 15 గంటల కరెంట్ ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీష్‌రావుకి సవాల్ చేశారు.











