
మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి మృతికి కేసీఆర్ సంతాపం

Published on by Vijaya

Published on by Vijaya
అషురెడ్డి ఫోన్ నంబర్ మీడియాలో..
ముఖ్యంగా న్యూస్ ఛానళ్లు అషురెడ్డి ఫోన్ నంబర్ బయటపెట్టింది. దాంతో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ నంబర్ బయటపెట్టిన ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు.
రెండు రోజులగా తీవ్రమైన మానసిక వేదన
2-3 రోజులుగా ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అందులో నా పేరు బయటకు వచ్చింది. అది పట్టుకుని చాలా న్యూస్ ఛానళ్లు ఓపెన్‌గా నా నంబర్ వేశారు. నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేయడం జరిగింది. ఆ కేసుకు, నాకు ఎంత సంబంధం ఉంది? అనేది నేనూ చెప్పగలను. నా దగ్గర కూడా కాల్ లిస్ట్, ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది అయితే వందల కొద్దీ ఫోన్ కాల్స్, గంటల కొద్దీ సంభాషణలని చెబుతున్నారో? అందులో నిజం లేదు. అది తప్పు అని ప్రూవ్ చేయడానికి నాకూ హక్కు ఉంది. ఇటువంటి సమయంలో నేను మౌనంగా ఉంటే మీ ఆరోపణలు ఒప్పుకొన్నట్టు ఉంది. ఎంత మౌనంగా ఉందామని అనుకున్నా.. ఈ రెండు రోజులు నేను తీవ్రమైన మానసిక వేదన అనుభవించా. నిజనిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కొన్ని ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడాయి. తప్పకుండా వాళ్ళ మీద పరువు నష్టం దావా కేసు వేస్తని అషురెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.
కేసుకు ఎటువంటి సంబంధం లేదు
తన ఫోన్ నంబర్ బయట పెట్టడంతో ప్రతి సెకన్ ఓ కాల్ వస్తుందని అషురెడ్డి చెప్పారు. అంతే కాదు ఫోన్ తీసి మిస్ కాల్స్ చూపించారు. గత 2-3 రోజులుగా అదే జరుగుతోందని ఆమె వాయిపోయారు. ఇక నుంచి ఆ నంబర్ ఉపయోగించానని పేర్కొన్నారు. కేపీ చౌదరి కేసు జరిగినప్పుడు తాను వేరే దేశంలో ఉన్నానని, తనకు కేసుకు ఎటువంటి సంబంధం లేదని అషురెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేసుతో ఆమెకు సంబంధం ఉందంటూ వార్తలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.
Published on by Vijaya
ఆయుర్వేదానికి ఆదరణ
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్లో తెలంగాణలో ఆయుర్వేదిక్ వైద్యులకు బీఆర్ఎస్ హయాంలో ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణకు విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయూష్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగపాణి, సమన్వయ కర్త శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో సేవలు అందించే ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 1154 మందికి ఎంఎల్‌హెచ్‌పీగా అవకాశం కల్పించాం. మొత్తం 3071 మందిలో మీరు మూడో వంతు ఉన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే, ఆయుర్వేదం ఒక్కటే భరోసాను ఇచ్చింది. ప్రభుత్వ ఆయుర్వేద ఫార్మసీ ద్వారా తయారు చేసిన జీవన్ ధార అనే ఔషధాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది.
అగ్రస్థానంలో ఉన్నాం
కరోనా సెకండ్ వేవ్‌లో సోకిన బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టింది. మందులు కూడా లేని సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయుర్వేద కళాశాల వైద్య బృందం ఎంతో పరిశోధించి బ్లాక్ ఫంగస్‌కు మెడిసిన్ ఆవిష్కరించింది. బ్లాక్ ఫంగస్‌కు ఔషధం కనుగొనడం తెలంగాణలో జరగటం మనందరికి గర్వకారణం. క్వారెంటైన్ సెంటర్‌గా ఆయుష్కు సంబంధించిన 4 ఆసుపత్రులు నేచురోపతి, టిబ్బి, బీఆర్కేఆర్, హోమియో ఆస్పత్రులు విశేష సేవలందించాయి. రెండు దఫాలుగా చేసుకున్న కంటి వెలుగు కార్యక్రమంలో మీరు మంచి సేవలు అందించారు. మీ అందరికీ అభినందనలు. శుభాకాంక్షలు. వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలని సీఎం కేసీఆర్ ఆలోచన.
అన్ని రంగాల్లో హబ్
హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారు. ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేలా ఎదగాలి. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీ అందరి భాగస్వామ్యం కావాలి. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలంగాణలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సిద్ధిపేట, వికారాబాద్, భూపాలపల్లిలో 50 పడకల కొత్త ఆయుష్ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నీ జిల్లాలకు విస్తరించే ఆలోచన సీఎం చేస్తున్నారు. అనంతగిరి హిల్స్‌లో జిందాల్ ఆయుర్వేద ఆస్పత్రిని మించి సెంటర్ ప్రారంభిస్తాం. హైద్రాబాద్ ప్రతి రంగంలో హబ్‌గా మారుతున్నది. ఫార్మా, టికా, ఐటీ రంగంలో వైద్యంలో కూడా తెలంగాణ హబ్‌గా మారింది. ఇపుడు ఆయుర్వేదంలో కూడా హబ్‌గా మారుతుంది. 9 ఏండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. నీతి అయోగ్ ఇండెక్స్‌లో 2014లో తెలంగాణ 11 ఉంటే, ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
Published on by Vijaya

విచారణకు సిద్ధం
కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ మాదకద్రవ్యాల కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. కేపీ చౌదరితో తనకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప మాదకద్రవ్యాలతో సంబంధం లేదన్నారు. ఏ విచారణకు అయినా తాను సిద్ధంగానే ఉన్నానని, తన ఫోన్ పోలీసులకు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. డేటా రిట్రీవ్ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. తాను ఎప్పుడూ మాదకద్రవ్యాలు కన్ఫ్యూమ్ చేయలేదని, ఏ తప్పు చేయలేదని, భయపడేదిలేదని చెప్పారు. సిక్కిరెడ్డి వాళ్ళ ఇంట్లో పార్టీ జరిగిందంటున్నారు. అలాంటి పార్టీలకు తాను హాజరవ్వనని, తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు.
సెలబ్రెటీలకు నోటీసులు
కాగా మాదకద్రవ్యాల కేసులో పోలీసులు సెలబ్రెటీలకు నోటీసులు ఇవ్వనున్నారు. కేపీ చౌదరి వ్యవహారంలో మాదకద్రవ్యాలపై సైబరాబాద్ పోలీసులు విచారించునున్నారు. మదక దవ్వల వ్యవహారంపై సినీతారలు, సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ డ్రైవ్‌లో ఉన్న డేటాను పోలీసులు సేకరించారు. దీంతో సెలబ్రెటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే కేపీ చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్టులు సహజమని సినీ ప్రముఖులు చెబుతూ.. ఏ విచారణకైనా, టెస్ట్ కైనా సిద్ధమని సెలబ్రిటీలు అంటున్నారు.
Published on by Vijaya

వెయ్యి కోట్ల ఆస్తి ఉంది
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. చేర్యాలలోని పెద్ద చెరువు మత్తడి స్థలానికి ముత్తిరెడ్డి కబ్జా చేశారు. ఆ స్థలాన్ని కూతురు పేరుపై ముత్తిరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. స్థలం కబ్జాపై గతంలో విపక్షాలు ముత్తిరెడ్డిపై మండిపడ్డాయి. తన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ముత్తిరెడ్డి కూతురు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన పేరుపై ఉన్న 1270 గజాల స్థలాన్ని మున్సిపాటిలీకి అప్పగిస్తానని ముత్తరెడ్డి కుమార్తె తుల్జాభవాని చెప్పారు. స్థలంలో క్షమాపణ కోరుతూ తుల్జా భవాని బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మా నాన్న ఇలా చేసి ఉంటడాల్సింది కాదని తుల్జాభవాని తెలిపారు. ముత్తిరెడ్డి ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉందని, తప్పు జరిగిందని, మా నాన్న చేసిన పనికి క్షమించాలని ఆ గ్రామస్థులను కోరారు. కోర్టు ద్వారా ఆ స్థలాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తానని ముత్తిరెడ్డి కుమార్తె వివరణ ఇచ్చారు.
ఎన్ని నకిలీ పత్రాలపై ఉన్నాయో తెలియదు
చేర్యాల పట్టణంలోని సర్వే నంబర్ 1402లో తన పేరు మీద నమోదైన భూమి మత్తడి భూమి అని.. అది ప్రభుత్వ ఆస్తి అని భవానీ చెబుతున్నారు. 2020లో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగిందని.. కానీ 2022 జూలైలో అది లిటిగేషన్లో పడినప్పుడు మోసం గురించి తనకు తెలిసిందని అంటున్నారు. హైకోర్టు, లోకాయుక్తలో దాఖలు చేసిన పిటిషన్లనలో కూడా తన సంతకం ఫోర్జరీ చేయబడిందని ఆరోపించారు. తన తండ్రి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాను లేకుండానే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని అన్నారు. తన నకిలీ సంతకాలు ఎన్ని పత్రాలపై ఉన్నాయో కూడా తెలియడం లేదని ఆమె చెబుతున్నారు. చాలా పోరాటం తర్వాత నేను చేర్యాల భూమి కాగితాలను పొందగలిగానని తుల్జా భవానీరెడ్డి చెప్పారు.
అయితే తన కూతురు ఆరోపణలను ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఖండించారు. చేర్యాలలోని ఆ భూమి ప్రభుత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రతిపక్షాలు తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు.
Published on by Vijaya

క్షణంలో మాయ
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోయ్యారు. మైలవరం నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దర్జాగా బైక్‌పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు ఇద్దరు యువకులు. ఈ ఫోన్ విలువ అక్షరాల 42 వేల రూపాయలు ఉంది. మైలవరం పట్టణంలో నివాసం ఉండే ఓ రిటైర్ బ్యాంక్ మేనేజర్ శ్యామ్సన్ స్థానిక సాయి మౌనిక గ్యాస్ ఏజెన్సీకి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం వెళ్ళారు. ఇంతలో అక్కడకు ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి కింద పడినట్లు నటించి..పైకి లేపెందుకు సహాయం చేయలంటూ కేకలు వేశాడు.
అయితే.. శ్యామ్ సన్ కింద పడిన వ్యక్తిని లేపెందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడే ఉన్న మరో వ్యక్తి శ్యామ్సన్ షర్ట్ జేబులో ఉన్న సెల్ ఫోన్‌ను చాకచక్యంగా దొంగిలించాడు. గ్యాస్ కంపెనీ వద్దగల సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా పక్క ప్రణాళికతో ఫోన్ దొంగతనం చేసినట్టుగా కనపడుతోంది. చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శ్యామ్ సన్. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.


