భారత్ విధించిన భారీ టార్గెట్ ఛేచించేందుకు పాక్ రంగంలోకి దిగింది. పాకిస్థాన్ ఓపెనక్లు జమాన్, ఇమామ్‌లు ఆచి తూచి ఆడుతున్నారు. బుమ్రా, సిరాజ్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడంలో పాక్ ఓపెనర్లు ఇబ్బంది పడుతుననారు. ప్రస్తుతం 3 ఓవర్లలో పాక్ 16 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్ 8 పరుగులు చేయడగా.. జమాన్ ఇంకా ఖాతా తెరవలేదు.
India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ!
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అసలు బ్యాటింగ్ చేయడమే మరిచిపోయినట్టు ఆడారు. ఆడుతున్నది వన్డేనా, టెస్టా అన్న రీతిలో సాగిందీ పాక్ బ్యాటింగ్. ఏకంగా 228 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
Botsa Satyanarayana: నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలి
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అవినీతిని అధికారులు బయటపెట్టారన్న ఆయన.. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. ఎవరు తప్పు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఆయన అవినీతిని న్యాయ వ్యవస్ధలు కూడా ధృవీకరిస్తున్నాయని, ప్రజా ధనాన్ని అడ్డంగ దోచుకన్న వ్యక్తి ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
ఎన్టీఆర్‌కు వెన్నూపోటు పోడిచిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉండటంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించి ఉంటుందన్నారు. మరోవైపు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ.. చంద్రబాబును అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా హింస సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు బంద్‌కు సహకరించడంలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు అర్దమైంది కాబట్టే వారు బంద్‌కు సహకరించడంలేదన్నారు. టీడీపీ నేతలే రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారన్నారు. బస్ డిపోల వద్దకు వెళ్లి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అరెస్ట్ అయి జేల్లో ఉన్నా టీడీపీ నేతలు ఇప్పటికీ పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులని భావిస్తున్నారన్న ఆయన.. మాజీ మంత్రులు మాత్రం చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, సీఎం జగన్ లండన్‌లో కూర్చొని కట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించడం ఏంటని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి మాత్రమే విదేశాలకు వెళ్లారని, ఇక్కడి విషయాలు ఆయనకు ఎలా తెలుస్తాయని మంత్రి ప్రశ్నించారు.
Asia Cup 2023: ఇండియా-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా చిరకాల ప్రత్యర్థులు దైపాక్షిక సిరీస్ ఆడక సుమారు 20 సంవత్సరాలైంది. దీంతో ఈ రెండు జట్లు ఐసీసీ టోర్ని, ఆసియాకప్ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో దాయాదీల మధ్య పోరు అంటేనే క్రికెట్ అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆధివారం ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు గట్టి పునాధులు వేశారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఓపెనర్లు 121 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం రోహిత్ శర్మ ఔట్ కావడంతో ఓపెనింగ్ పాట్నర్‌షిప్‌కు బ్రేక్ పడింది.18వ ఓవర్లో శుభ్‌మన్ గిల్ సైతం ఫెవీలియన్కు చేరాడు. దీంతో భారత్ 123 పరుగులకు ఇద్దరు ఓపెనర్లను కోల్పొయింది. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే 24.1 ఓవర్ల వద్ద భారత్ 147 పరుగులతో ఉన్న సమయంలో కొలంబోలో వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అనంతరం వాన తగ్గగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ మరో 5 నిమిషాల్లో ప్రారంభం అవుతుందనుకునే సమయంలో మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేస్లున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ వన్డే కేరీర్లో కేఎల్ రాహుల్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పాక్‌పై భారత ఓపెనర్లు మరోసారి వందకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా ఇవాళ మ్యాచ్ కొనసాగితే క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. పాక్‌తో మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీకి ఎక్కడ లేని పూనకం వస్తుంది. వీరితో పాటు ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌లో హార్డిక్ పాక్‌పై భారత్‌ను గెలిపించాడు.
Pawan Kalyan: భారత్‌లో జీ20 సదస్సు నిర్వహించడం గర్వకారణం
Pawan Kalyan About G20 Summit: భారత్‌లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. భారతదేశం పురోగమిస్తోందని, దానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. జీ20 సమ్మిట్ (G20 Summit)లో భారత్ అగ్ర రాజ్యాలతో బలమైన బంధాన్ని ఏర్పడుచుకుందన్న ఆయన.. అందుకు నిరంతరం కృషి చేసిన ప్రధాని మోడీకి (PM Modi) ధన్యవాదాలు తెలిపారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో (Joe Biden) పాటు పలు దేశాలకు చెందిన ప్రధానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ జీ20 సమావేశంలో భాగంగా వివిధ దేశాధినేతలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ మొదటి సారి జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ అనందం వ్యక్తం చేశారు.
భారత్‌లో జరిగిన జీ20 సదస్సు ముగింపు వేడుకల్లో బ్రెజిల్ జీ20 కూటమి సారధ్యతలను స్వీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ (Brazil) అధ్యక్షుడు లూయీ ఇనాసియో లులా డసిల్వాకు (Luiz Inacio Lula da Silva) ఈ దండాన్ని అప్పగించారు. మరోవైపు భారత్ నేతృత్వంలో జీ20 సమావేశాలు జరుగడం ఇదే మొదటి సారి. దీంతో ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, మిత్ర దేశాలకు చెందిన ప్రతినిధులు రానుండటంతో మొదట కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అతిథులు వచ్చి వెళ్లేంత వరకు వారు ఉండే హోటల్స్, పర్యటించే ప్రాంతాల్లో పకడ్భందీ ఏర్పాట్లు చేసింది.
ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రపంచ శాంతికి సంస్కృత శ్లోకాన్ని పఠించారు. ప్రపంచ శాంతి కోసం ప్రతీ దేశం సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోందని, మరికొన్ని దేశాల్లో ఉద్రిక్త వాతావరణాలు ఉన్నట్లు జీ20 శిఖరాగ్ర సదస్సులో చర్చించారు. ఈ సమస్యలను పరిష్కరించి ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడేలా వివిధ దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. కాగా 2024లో జీ20 సదస్సు రియో డీ జనీరో (Rio de Janeiro)లో జరుగనుంది.
Also Read: ప్రపంచమంతా భారత్‌కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..!
Revanth Reddy: ఈ నెల 17న కాంగ్రెస్ విజయభేరీ సభ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ నెల 17న జరిగే విజయ భేరీ సభపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు వివరించారు. అందులో భాగంగా ఈ నెల 11 నుంచి అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. 119 నియోజకవర్గాల్లోని మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆయన.. సభకు రాష్ట్రంలోని 35 వేల బూత్‌ల నుంచి జనం తరలి వచ్చేలా చూడాలన్నారు.
సోమవారం రేవంత్ రెడ్డి 17 పార్లమెంట్ అభ్యర్థులు, వైస్ ప్రెసిడెంట్లతో సమావేశం కానున్నారు. వారు 12, 13, 14వ తేదీల్లో మూడురోజుల పాటు తమ తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించే విధంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 17న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరీ సభ ఉంటుందని, ఈ సభకు సోనియా గాంధీ రానున్నట్లు తెలిపిన ఆయన.. ఆ సభలో సోనియా గాంధీ 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను వివరిస్తారన్నారు. అనంతరం సోనియా గాంధీ సెప్టెంబర్ 18న ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు చెందిన జాతీయ నాయకులతో భేటీ అవుతారని తెలిపారు.
అదే రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్యారెంటీ కార్డులకు సంబంధించిన పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా అంటించాలన్నారు. దీంతోపాటు ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు అందజేయాని పీసీసీ చీఫ్ ఆదేశించారు. ప్రతీ ఒక్కరు సమన్వయంతో పార్టీ కోసం పనిచేయాలన్న ఆయన.. ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా చూసి సభను విజయవంతం చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని, వారికి గౌరవంతో ఉన్న పదవిని కేటాయిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.











