ఆసియా కప్ 2023 టైటిల్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం భారత్-శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో శ్రీలంక పై గెలిచిన ఉత్సాహంతో టీమిండియా ఉండగా.. సొంత గడ్డపై ఫైనల్ ఫైట్ జరుగుతుండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్ టైటిల్‌ను గెలుపొందిన ఉత్సాహంతో వరల్డ్ కప్ టోర్నీలో ఆడుగుపెట్టాలని ఇరుజట్లు చూస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఉన్నట్లు అక్కడి వాతావరణ అధికారులు తెలిపారు.
మరోవైపు భారత్- శ్రీలంక టీమ్‌లను పరిశీలిస్తే టైటిల్ గెలిచే అవకాశాలు అధికంగా భారత్ ఉన్నట్లు పలువురు మాజీలు అంటున్నారు. బ్యాటర్లు, బౌలర్లతో భారత్ జట్టు పటిష్టంగా ఉందన్నారు. టీమిండియా ఆల్‌రౌండ్‌షో చేస్తే ఈ ఏడాది ఆసియా కప్ టైటిల్ గెలిచుకునే అవకాశాలు ఉన్నాయని మాజీలు స్పష్టం చేశారు.











