Heavy rains in Vizag: రెండు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా విసురుతున్నాడు. ఇప్పటికే తెలంగాణ(telangana)లోని పలు జిల్లాలపై విరుచుకుపడిన వానదేవుడు.. ఏపీలోనూ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ(vizag)లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. దీంతో సిటీ ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. స్కూల్స్‌కి వెళ్దాం అని ఉదయాన్నే లేచి రెడీ అయ్యారు పిల్లలు. అప్పటికీ వాన దంచికొడుతూనే ఉండగా స్కూల్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తూనే తల్లిదండ్రులు లంచ్‌బాక్సులు ప్రిపేర్ చేశారు. అయితే స్కూల్ టైమ్ దగ్గర పడుతున్న కొద్ది వర్షం పెరిగిపోయింది. ఈలోపే చాలామందికి స్కూల్ లేదని మెసేజీలు వచ్చాయి. మరోవైపు ఆఫీస్‌లకు వెళ్లేవారిది కూడా సేమ్సిట్యూవేషన్.
విజయవాడలోనూ అంతే:
విజయవాడ(Vijayawada) నగరంలో దాదాపు 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.భారీ వర్షాల కారణంగా, నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు మునిగాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్(traffic jam)లకు కారణమయ్యాయి. అల్పపీడనంతో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాలో చురుకుగా, రాయలసీమలో సాధారణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళికా విభాగం గణాంకాల ప్రకారం నిన్న రాత్రి 9 గంటల వరకు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, పరవతీపురం-మన్యం, అనకాపల్లిలోని కొన్ని ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా రేగిడియమదలవలసలో 13.7 సెంటిమీటర్లు శ్రీకాకుళం జిల్లా సారాబుజ్జిలిలో 12.9, పరవతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 11.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ట్రాఫిక్ జామ్:
బెంజ్ సర్కిల్, రూట్ -5, మొగహల్రాజపురం, నక్కల రోడ్డు, బీసెంట్ రోడ్డు, లెనిన్ సెంటర్, వన్ టౌన్, కృష్ణలంక, యనమలకదురు తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బీసెంట్ రోడ్డు, లెనిన్ సెంటర్, ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు, రూట్ 5లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఐఎండీ(IMD) సూచన ప్రకారం, ఉత్తర-కోస్తా, దక్షిణ-కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత వర్షపాతం తగ్గే అవకాశం ఉందని IMD-H, శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి చెప్పారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.
ALSO READ: తెలంగాణలో ఐదు రోజులు వానలే..వానలు!
NZB STUDENT DEATH: ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక.. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని!
Nizamabad student Sneha Tiwari suicide: ప్రేమ పేరుతో వేధించడం.. అమ్మాయి వెనుక తిరగడం.. లవ్ అంగీకరించకపోతే చంపడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నా ఈ మధ్య కాలంలో ఈ తరహా దారుణాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోటా ప్రేమ వేధింపులకు యువతలు బలైపోతూనే ఉంటున్నారు. ఎవరికి చెప్పాలో అర్థం అవ్వక.. చెప్పనా అర్థం చేసుకునేవారు కరువై తనువు చాలిస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌లో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వేధింపులు తట్టుకోలేక స్నేహా తివారీ ఉరేసుకుంది. సోఫియాన్ అనే విద్యార్థి వేధింపులే కారణమని.. రోజూ ప్రేమించాలని వేధించేవాడంటున్న కుటుంబసభ్యులు.
Also Read: రోడ్డు ప్రమాదంలో మరణించి…ఏడుగురికి అవయవదానం చేసిన యువతి
పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు:
మరోవైపు వరుస పెట్టి స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్ 309 ఆత్మహత్యాయత్నాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau), 2021, దేశంలో ఆత్మహత్యల ద్వారా దాదాపు 1,64,000 మరణాలను నమోదు చేసింది. మహారాష్ట్ర అత్యధిక ఆత్మహత్యలను చూసింది, తమిళనాడు (రాథోడ్, 2023) తరువాతి స్థానంలో ఉంది. ఇండియా కంటే కాస్త జనాభా తక్కువగా ఉన్న చైనాతో పోలిస్తే, ఆత్మహత్యల సంఖ్య రెండింతలు భారత్‌లో ఉండటం కలవర పెడుతోంది. చైనాలో ప్రతి సంవత్సరం ప్రతి 1,00,000 మందికి ఆరుగురు ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇటు ఈ సంఖ్య ఈ సంఖ్య 12గా ఉంది.
విద్యార్థులను పట్టించుకోరేం?
న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 15-29 వయస్సు మధ్య వారు ఆత్మహత్యలకు ఎక్కువగా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో యువతను కలిగి ఉన్న దేశంగా భారత్‌కు పేరుంది. మన యువత, విద్యార్థులు తమ జీవితాన్ని ఎందుకు వదులుకుంటారు? ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకులపై చేసిన పరిశోధనలు చాలా వరకు చనిపోవాలని కోరుకోలేదని సూచిస్తున్నాయి. అప్పటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారు. అందుకే వారికి చనిపోవడం సులువైన మార్గంగా కనిపిస్తోంది. కానీ ఇది అసలు కరెక్ట్ కాదు.. కష్టాలతో, కష్టాలు పెట్టేవారితో పోరాడాలి.. అవి మనల్ని చూసి పారిపోవాలి కానీ సమస్యలకు దూరంగా ఉండాలని ప్రాణాలు తీసుకోకూడదు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు నిజ జీవిత సమస్యలకు సహాయం చేయడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇది ఒంటరితనానికి దారితీయవచ్చు. ఉపాధ్యాయులు విద్యార్థుల అవసరాలను పట్టించుకోరని చాలా మంది వాదిస్తున్నారు. అందుకే విద్యార్థులు కష్ట సమయాల్లో ఏం చేయాలో అర్థం అవ్వక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా స్కూల్స్ కాలేజీలు వారి సొంత ప్రతిష్టపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల వైపు దృష్టి మళ్లించడం ప్రారంభించాలి.
ALSO READ: మూసీలో లేడీ డెడ్ బాడీ..4 రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన లక్ష్మి!
Cancer: ఆ అలవాట్లు మానుకోండి.. ఆ ఏజ్ లోపు వారిలో 79శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు!
ఓపెన్ యాక్సెస్ జర్నల్ బీఎంజే ఆంకాలజీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో (1990-2019) ప్రపంచవ్యాప్తంగా 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసుల సంఖ్య 79శాతం పెరిగాయి. 2019లో ఈ వయస్సులోపు వారిలో రొమ్ము క్యాన్సర్ అత్యధిక సంఖ్యలో ‘ఎర్లీ ఆన్సెట్’ కేసులకు కారణమైంది. అయితే 1990 నుంచి విండ్‌పైప్ (నాసోఫారెక్స్), ప్రోస్టేట్ క్యాన్సర్లు అత్యంత వేగంగా పెరిగాయని పరిశోధనలు చెబుతున్నాయి. 2019లో యువకులలో అత్యధిక మరణాల సంఖ్యను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాన్సర్లు రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, ప్రేగులు, కడుపుకు సంబంధించినవి.
50లోపు వారిలోనే పెరుగుతున్నాయి:
వృద్ధులలో క్యాన్సర్ చాలా సాధారణం అయినప్పటికీ, 1990ల నుంచి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో 50 ఏళ్లలోపు వారిలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలగిస్తోంది. 204 దేశాల్లో గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2019 అధ్యయనం నుంచి డేటాను తీసుకున్నారు. 1990-2019 మధ్య మార్పును అంచనా వేశారు. కొత్త కేసులు, మరణాలు, ఆరోగ్య పరిణామాలను కన్సిడర్ చేశారు. 14-49 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా గుర్తించారు.
లైఫ్ స్టైల్ కారణంగానే:
ధూమపానం, వాపింగ్, మద్యపానం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. తక్కువ శారీరక శ్రమ మరోక కారణంగా తెలుస్తోంది. ధూమపానం తర్వాత, అధిక బరువు క్యాన్సర్‌కు రెండవ అతిపెద్ద కారణం. ఇది ప్రేగు , మూత్రపిండాలు , గర్భం, గుల్లెట్ (అన్నవాహిక) క్యాన్సర్లతో సహా అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది . అధిక బరువు మెనోపాజ్ ఉన్న స్త్రీలు కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు . ఆరోగ్యకరమైన బరువు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం లాంటి ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు, తక్కువ చక్కెరతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారనే దాన్ని బట్టి మీకు అవసరమైనంత ఆహారం మాత్రమే తినండి. శారీరకంగా మరింత చురుకుగా ఉండండి. మీరు మీ బరువు గురించి ఆందోళన చెందుతుంటే లేదా మరింత సమాచారం కావాలంటే, మీ డైటీషియన్తో మాట్లాడండి.
ఇక రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శారీరక శ్రమ మీ సాధారణ ఆరోగ్యం, శ్రేయస్సుకు కూడా మంచిది. ప్రతి వారం కనీసం 150 నిమిషాల ఎక్సర్సైజ్ చేయండి. ఈ టైమ్‌ని పెంచుతూ వెళ్లండి. బయట కొంత సమయం గడపడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్ డి తయారు చేయడానికి మన శరీరాలకు సూర్యరశ్మి అవసరం. ఇది ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది.. కొన్ని అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ALSO READ: మంచినీళ్లు అతిగా తాగితే ఏం అవుతుందో తెలుసా?
ALSO READ: విద్యార్థులు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలివే!
IBPS Results: 5,650 క్లర్క్ పోస్టులకు రిజల్ట్స్ రిలీజ్.. మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?
IBPS RRB Clerk Prelims Result Released: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) స్కోర్‌కార్డ్ 2023ని జారీ చేసింది. అభ్యర్థులు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ(IBPS RRB) ఆఫీస్ అసిస్టెంట్స్ స్కోర్‌కార్డ్ 2023ని అధికారిక వెబ్సైట్, ibps.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ(IBPS RRB) ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 16న జరగనున్న IBPS మెయిన్స్ పరీక్షకి హాజరు కావాలి. ఆశావాదులు చెల్లుబాటు అయ్యే ఐడీ(ID) కార్డ్‌తో పాటు ధృవీకరణ ప్రయోజనాల కోసం IBPS ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ స్కోర్‌కార్డ్, మెయిన్స్ కాల్ లెటర్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా చెల్లుబాటు అయ్యే ఐడీనీ ప్రూఫ్‌గా పరిగణిస్తారు. ఐబీపీఎస్ మెయిన్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ హాజరు, ఆధార్ ధృవీకరణ కూడా ఉంటుంది.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ స్కోర్ కార్డ్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా?
➊ IBPS అధికారిక వెబ్సైట్, ibps.in ని విజిట్ చేయండి.
➋ హోమ్‌పేజీలో CRP RRB ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
➌ ఇప్పుడు, ‘CRP-RRB XII ఆఫీస్ అసిస్టెంట్ల (మల్టీపర్పస్) కోసం ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష స్కోర్లు’ లింక్‌ని ఎంచుకోండి.
➍ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ సెక్యూరిటీ పిన్‌లో కీ ఎంటర్ చేయండి.
➎ నమోదు చేసిన లాగిన్ ఆధారాలను సమర్పించండి.
➏ IBPS RRB స్కోర్‌కార్డ్ 2023 మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
➐ భవిష్యత్ సూచన కోసం దీన్ని డౌన్లోడ్ చేసి, సేవ్ చేయండి, తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి
Click Here to Check IBPS RRB Clerk Prelims Result
అభ్యర్థులు సెప్టెంబర్ 15 వరకు ఐబీపీఎస్(IBPS) స్కోర్‌కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16న పరీక్ష ఉంటుంది. ఈ ఎగ్జామ్ నాలుగు విభాగాల్లో 190 ప్రశ్నలు-200 మార్కులకు జరుగుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 160 నిమిషాలు. రెండు దశల పరీక్షలకు నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కును తగ్గిస్తారు.
ALSO READ: ఇస్రో సైంటిస్ట్ శాలరీ ఎంత? ప్రస్తుతం జాబ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి?
MSMP Twitter review: ‘లవ్ యూ స్వీటి’.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విట్టర్ రివ్యూ ఇదే!
Miss Shetty Mr Polishetty Twitter review: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Miss Shetty Mr Polishetty) అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఇవాళ(సెప్టెంబర్ 7) జన్మాష్టమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. UV క్రియేషన్స్, మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క(Anushka), నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోహీరోయిన్లగా నటించడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించింది. ఆమె చివరిసారిగా మాధవన్‌తో కలిసి నిశ్శబ్దం అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం 2020లో తెరపైకి వచ్చింది. దీంతో అనుష్క అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్‌గా వెయిట్ చేశాయి. ట్రైలర్‌ని చూసిన తర్వాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేయగా.. ఆ రోజు రానే వచ్చింది. ట్విట్టర్ రివ్యూ ప్రకారం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఎలా ఉంది.? అమెరికాలో ఇప్పటికే చాలా మంది సినిమా చూసేశారు.. మరి వాళ్లు ఏం అంటున్నారు?
షెఫ్ పాత్రలో అనుష్క:
అనుష్క లండన్‌లో ఉన్న అన్విత రవళి శెట్టి అనే షెఫ్ పాత్రను పోషించింది. ఆమె ఫెమినిస్ట్, పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. అయితే ఆమె తల్లి కావాలని, తన బిడ్డను కనాలని తపన పడుతోంది. స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని కలుసుకుంటుంది. అన్విత- సిద్ధూ కలుసుకోవడం, సన్నిహితంగా మారడం ద్వారా అన్విత సిద్ధూని దాతగా ఉండమని కోరింది. తర్వాత ఏమి జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
ట్విట్టర్ రివ్యూ:
ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అనుష్క ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. హీరోలకే అభిమానులుండే చిత్రపరిశ్రమలో హీరోయిన్ అయిన అనుష్కకు మంచి ఫ్యాన్ బేస్ ఉండగా.. అభిమానులు ముద్దుగా స్వీటి అని పిలుచుకునే ఈ స్టార్ ఈ సినిమాతో సినీ లవర్స్‌ని కట్టిపడేసిందట. అటు నవీన్ పోలిశెట్టి తన మార్క్ టైమింగ్ డైలాగులతో ప్రేక్షలకులను ఫిదా చేశాడని పోస్టులు పెడుతున్నారు. అయితే రివ్యూలు ఇచ్చే కొన్ని పేజీలు మాత్రం సినిమా బాగోలేదని.. అనుష్క కామ్బ్యాక్ మంచిగా లేదని చెబుతున్నారు. మరికొందరు ఈ రివ్యూలు ఇచ్చేవారికి క్రెడిబిలిటీ లేదంటున్నారు. ఖుషీ మావీకి మంచి రేటింగ్ ఇచ్చి.. ఈ సినిమా బాగున్నా కూడా కావాలని తక్కువ రేటింగ్ ఇస్తున్నారని మండిపడుతున్నారు.
MSMP opens in USA way less than expected.
Premieres reported gross is $157K as of 7PM PST#MissShettyMrPolishetty
— Telugu360 (@Telugu360) September 7, 2023
Good 1st half .. @NaveenPolishety 👍👍
Simple story, neat execution1st half 3.25/5 #MissShettyMrPolishetty #MSMP
— AN (@anurag_i_am) September 6, 2023
#MissShettyMrPolishetty Review
Thyview Rating : 3.25/5#MSMP delivers as a clean, straightforward rom-com. Within 15 minute the plot point was set, Naveen’s entrance uplifts the mood. Most one-liners hit the mark, and Naveen-Anushka make a delightful pair. Both are as charming…
— Thyview (@Thyview) September 7, 2023
We Are So Emotional Nobody Knows How Emotional Is To Watch Her Onscreen From Tomorrow After 5Yrs Expect Her Fans. Wishing Her All The Success For #MissShettyMrPolishetty Do Watch In Theaters 🧿🩷 We Love You Sweety❤#AnushkaShetty @MsAnushkaShetty pic.twitter.com/BPwwdtAd1o
— Anushk Shetty TM (@AnushkaShettyTM) September 6, 2023
#MissShettyMrPolishetty Overall a Satisfactory Entertainer that works in parts
Naveen is the heart and soul and carries the film throughout. The comedy and emotional scenes work in parts but the rest feels dragged at times. Music is a let down. Passable!
Rating: 2.75/5 #MSMP
— Venky Reviews (@venkyreviews) September 7, 2023
తారాగణం, క్రూ
ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, నాజర్, తులసి, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, మరియు కేశవ్ దీపక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: మహేష్ బాబు పాచిగొల్ల. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నీరవ్ షా కెమెరా క్రాంక్ చేయగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. రాధన్ ఈ చిత్రానికి పాటలు సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని గోపీ సుందర్ అందించారు.
ALSO READ: అనుష్క చికెన్ కర్రీ.. ప్రభాస్ పలావ్.. అభిమానులకు పసందే..
ALSO READ: సలార్ కాదు.. రూల్స్ రంజన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది
Janmashtami 2023: విద్యార్థులు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలివే!
Lessons to Learn from Lord Krishna for Students: శ్రీకృష్ణుడి జన్మదినాన్ని (Janmashtami 2023) పురస్కరించుకుని హిందువులు జరుపుకునే పండుగ జన్మాష్టమి. ఈ ఏడాది సెప్టెంబర్ 6-7 తేదీల్లోని పలు ముహూర్తుల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణుని జీవితం అన్ని వయసుల వారికి విద్యా పాఠాలు నేర్పుతుంది. మహాభారతంలోని ఐదుగురు పాండవుల్లో ఒకరైన అర్జునుడికి యుద్ధభూమిలో ఆయన చేసిన బోధలు జీవితంలో ఏ పరిస్థితిలోనైనా మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఇటు విద్యార్థులు(Students) శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధనల గురించి తెలుసుకోవడానికి కొంత సమయం వెచ్చించవచ్చు. మంచి వ్యక్తిగా మారడానికి, జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకోవడానికి కృష్ణుడి బోధనలు, జీవితం సహాయపడుతాయి.
ఏది జరిగినా మంచికే జరుగుతుంది.
జీవితంలో చిన్న చిన్న ఎదురుదెబ్బలకు విద్యార్థులు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ప్రతి వైఫల్యం కొత్త విషయాన్ని నేర్పుతుంది. కొన్నిసార్లు కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ ముందుకు సాగాలంతే. ఏం జరిగినా, మంచి కోసం జరిగిందని తర్వాత గ్రహించవచ్చు.
Also Read: కృష్ణ జన్మాష్టమి నాడు ఇలా చేస్తే ఎలాంటి ఆర్థికసమస్యలు ఉండవు..!
మీ పని చేయండి..ఫలితం ఆశించవద్దు:
కర్మకు ప్రత్యామ్నాయం లేదని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు. ఫలితం గురించి ఆలోచించకుండా కర్మ చేయాలని కూడా చెబుతాడు. అంటే విద్యార్థులు కేవలం ఫలితం గురించి ఆందోళన చెందకుండా ప్రతిరోజూ సీరియస్‌గా చదవాలి. బాగా చదువుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.
మీ స్నేహితులకు విశ్వసనీయంగా ఉండండి:
శ్రీకృష్ణుడు, సుధాముడి స్నేహం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణ భగవానుడు రాజు అయినప్పటికీ తన మిత్రుడైన సుధామను బాల్యంలో ఎలా చూసుకునేవాడో చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. తన స్నేహానికి తన స్థాయి అడ్డు రానివ్వలేదు. విద్యార్థులు తమ స్నేహితులకు విధేయంగా ఉండాలని.. అవసరమైన సమయాల్లో వారికి అండగా నిలవాలని వీరి ఫ్రెండ్షిప్ నుంచి నేర్చుకోవచ్చు.
మైండ్ ఫుల్నెస్:
వర్తమానంలో జీవించాలని, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తాడు. వర్తమానంలో మీ పని సక్రమంగా ఉంటే.. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు వారి రోజువారీ పురోగతిని గమనించాలి. బలహీనతలపై క్రమం తప్పకుండా వర్క్ అవుట్ చేయాలి. వాటిని అధిగమించాలి. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకైనా మరింత మెరుగ్గా సన్నద్ధం కావడానికి సహాయపడుతుంది.
మీ కోపాన్ని నియంత్రించుకోండి:
స్మృతి బ్రహ్మాద్ బుద్ధినాశో బుద్ధినాషాత్పర్యతి-
కోపం మీ తీర్పు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిత్యం కోపంగా ఉంటే జ్ఞాపకశక్తి తెలివితేటలు ఉండవు. తెలివితేటలు లేకపోతే నిర్ణయం తీసుకోవడం దెబ్బతింటుంది. అందుకే ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాల వైఫల్యాలకు కోపం ప్రాథమిక కారణం. నరకం మూడు ప్రధాన ద్వారాలలో ఇది ఒకటి. మిగిలిన రెండు దురాశ, కామం. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
ALSO READ: మంచినీళ్లు అతిగా తాగితే ఏం అవుతుందో తెలుసా?











