Spain soccer chief Luis Rubiales kiss scandal: స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన అత్యుత్సాహం పదవికే ఎసరు తెచ్చింది. తమ దేశం తొలిసారిగా ఫిఫా మహిళల వరల్డ్ కప్ టైటిల్ గెలిచిందన్న ఆనందంలో మహిళా ప్లేయర్‌కు ముద్దివ్వడంపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది ఫిఫా. చివరకు తన పదవికి రాజీనామా చేశారు లూయిస్.
ఏం జరిగింది?
గత నెలలో సిడ్నీలో జరిగిన ఫైనల్లో 1-0తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించిన స్పెయిన్..తొలిసారిగా ఫిఫా మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంది. టీమ్ సభ్యులకు మెడల్స్ అందిస్తూ స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్ ప్లేయర్ జెన్నిఫర్ హెర్మోసోతో పాటు మిగిలిన క్రీడాకారులను ముద్దు పెట్టుకున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గెలుపు కన్నా ఈ ముద్దు వివాదమే ఎక్కువగా వార్తల్లో నిలవడంతో తొలిసారి చాంఫియన్‌గా నిలిచామన్న ఆనందం స్పెయిన్ మహిళా జట్టుకు లేకుండా పోయింది.
బాధ్యతల నుంచి తొలగింపు:
మరోవైపు రుబియాల్స్పై హైకోర్టులో లైంగిక వేధింపుల పిటిషన్ వేశారు హెర్మోసో. ఈ నేపథ్యంలో అటు సస్పెన్షన్ వేటు..ఇటు కేసులతో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2018లో ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు లూయిస్. ఈ పదవితో పాటు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి కూడా వైదొలిగారు. రుబియాల్స్ను ఫుట్‌బాల్ కార్యకలాపాల నుంచి మూడు నెలల పాటు FIFA సస్పెండ్ చేసింది. అతని చర్యలపై సాకర్ ప్రపంచ పాలకమండలి విచారణ జరుపుతుంది. ‘ఫిఫా చేపట్టిన వేగవంతమైన సస్పెన్షన్, దానితో పాటు మిగిలిన విచారణలు తన స్థానానికి ఇక తిరిగి రాలేనని స్పష్టమైంది’ అని రూబియాల్స్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ సాకర్ బాడీ UEFA వైస్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేశానని చెప్పాడు. ఆదివారం జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుబియల్స్ కుటుంబం, స్నేహితులతో మాట్లాడిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఆమోదించిన లైంగిక సమ్మతి చట్టం ప్రకారం, రుబియాల్స్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే జరిమానా లేదా ఏడాది నుంచి నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్షను అనుభవించవచ్చు.
ALSO READ: చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్….క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు
TDP Legal cell: చంద్రబాబు అరెస్ట్.. టీడీపీ లీగల్‌సెల్ ఐదు ఫెయిల్యూర్స్ ఇవే..!
TDP Legal cell Failures: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ ఫెయిల్యూర్స్ ఒక్కసారిగా బయటపడ్డాయి. 45ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబుకు సంబంధించిన లీగల్ సెల్ చాలా వీక్‌గా ఉందన్న వాదన వినిపిస్తోంది. పోలీసులు అర్ధరాత్రి వెళ్లి ఉదయం చంద్రబాబును అరెస్టు చేశారని.. మరి టీడీపీ లీగల్ సెల్ లంచ్ మోషన్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదో అర్థం కావడంలేదని.. రిమాండ్ విధించిన కోర్టునే సంప్రదించాల్సిన అవసరం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పై కోర్టును సంప్రదించకుండా జాప్యం వెనుక కారణాలేంటో అర్థంకావడంలేదన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్‌తో ఫైఫ్ ఫెయిల్యూర్స్‌ని చూపిస్తున్నారు.
టీడీపీ లీగల్‌సెల్ ఐదు ఫెయిల్యూర్స్ ఇవే:
➊ 2021 కేసులో ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకోలేదు?
➋ అరెస్ట్‌పై 3 రోజుల ముందే సమాచారం వచ్చినా ఎందుకు స్పందించలేదు?
➌ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అరెస్ట్ జరిగినా హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
➍ బెయిల్ పిటిషన్ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు?
➎ రిమాండ్‌పై తర్వాత పైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
చాలా లేట్ చేశారు:
2021లో కేసు ఫైల్ ఐతే ముందస్తు బెయిల్‌కు ఎందుకు అప్లై చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిందితుడిగా చంద్రబాబు పేరు వస్తుందని ఊహించలేకపోయారా అని అడుగుతున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబే స్వయంగా తనను అరెస్టు చేస్తారని చెప్పారు. పోలీసులు, వైసీపీ మంత్రులు సైతం అరెస్టు చేస్తామని లీకులు ఇచ్చారు. ఐనప్పటికీ టీడీపీ లీగల్ సెల్ ముందస్తు బెయిల్‌కు అప్లై చేయలేదు. అరెస్టు చేసిన తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు.
కేసు వాయిదా:
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హౌస్ అరెస్ట్‌కి సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు సెప్టెంబరు 12 (మంగళవారం)కి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 10 (ఆదివారం) 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు చంద్రబాబును పంపారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించగా, CID తరపున పి. సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ వైద్య సహాయం సిద్ధంగా ఉంచామని.. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయన సురక్షితంగా ఉంటారని సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఉన్న ‘Z’ కేటగిరీ రక్షణకు అదనంగా భద్రత ఉందన్నారు. ప్రాథమికంగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో హౌస్ అరెస్ట్‌కి సంబంధించి ఎలాంటి నిబంధన లేదన్నాన్నారు సుధాకర్ రెడ్డి. ఇక చంద్రబాబుకుప్రాణహాని ఉందని.. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని లూథ్రా నొక్కి చెప్పారు. కరడుగట్టిన నేరస్థులు జైలులో ఉన్నారని, ఇది ముప్పుగా కోర్టు పరిగణించాలన్నారు. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు కేసును సెప్టెంబర్ 12కి వాయిదా వేశారు.
ALSO READ: చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా
Rain alert: రెండు రోజులు కుమ్ముడే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Rains in Andhra pradesh and Telangana: వర్షం కురవడం లేదులే.. హ్యాపీగా బయట తిరుగుదాం అని అనుకుంటున్నారా..? ఆరుబయట బట్టలు ఆరేసుకుందాంలే అని థింక్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయని వాతావరణశాఖ చెప్పింది. రెండు రోజుల కుమ్ముడుతో పాటు మరో మూడు రోజులు దంచుడు ఉంటుందట. అంటే మొత్తంగా ఐదు రోజుల పాటు వరుణుడు తనకి తోచినప్పుడల్లా ఎంట్రీ ఇచ్చి బీభత్సం సృష్టించనున్నాడు. రెండు తెలుగు రోజుల్లో రానున్న ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి.
వాతావరణంలో మార్పుకు రాష్ట్రం మరోసారి సిద్ధమవుతోంది. మూడు రోజుల క్రితం వరుణుడు ప్రతాపం చూపించగా.. తర్వాత శాంతించాడు. మధ్యమధ్యలో కాసేపు మెరిపించినా నాన్‌స్టాప్‌గా మాత్రం వర్షం కురవలేదు. మరోసారి ఎడతెరిపి లేని వర్షాలకు రెడీ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. తెలంగాణ వాసులు తమ గొడుగులను అందుబాటులో ఉంచుకోవాలి. భారత వాతావరణ శాఖ (IMD) సమగ్ర వాతావరణ సూచనను జారీ చేసింది.
• సెప్టెంబర్ 12: కొన్ని చోట్ల వర్షం పడుతుంది:
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల ఛాన్స్ లేనప్పటికీ.. నివాసితులు అప్రమత్తంగా ఉండాల్సిందే.
• సెప్టెంబర్ 13: మరింత చెదురుమదురు జల్లులు
కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ వాసులు తమ నిర్దిష్ట ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండాలి. రెయిన్ కోట్ని వెంటే ఉంచుకోవడంచాలా అవసరం.
• సెప్టెంబర్ 14: జల్లులు కొనసాగుతాయి
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ ధోరణి అస్థిరమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని సూచిస్తుంది.
• సెప్టెంబర్ 15: కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో సంభవించవచ్చు. కాబట్టి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ALSO READ: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా?
BIG BREAKING: చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా
చంద్రబాబు హౌస్ అరెస్ట్‌పై వాదనలు రేపటికి వాయిదా పడింది. రేపు(సెప్టెంబర్ 12) ఏసీబీ కోర్టు మరోసారి వాదనలు విననుంది. సుదీర్ఘంగా జరిగిన వాదనలు ఇవాళ్టికి ముగిశాయి. మూడు దఫాలుగా వాదనలు సాగాయి. చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున పొన్నవోలు వాదనలు వినిపించారు. హాని ఉంది వెసులుబాటు కల్పించాలని లూథ్రా వాదించారు. NSG సెక్యూరిటీ ఉందని హౌస్ అరెస్ట్ అడుగుతున్నామని లూథ్రా చెప్పారు. అయితే రాజమండ్రి జైలే చంద్రబాబుకు సేఫ్టీ అని పొన్నవోలు వాదించారు. హౌస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ నొక్కి చెప్పింది. ఇంటికంటే జైలే సేఫ్టీ అని సీఐడీ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. చంద్రబాబు బయటకు వెళ్తే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని సీఐడీ వాదించింది.
తీర్పు వస్తుందనుకున్న దశలో మరోసారి వాదనలు జరిగాయి.
రేపటికి వాయిదా:
సుప్రీంకోర్టు తీర్పులను లూథ్రా ఉదహరించారు. అయితే కేసుల వివరాలు కోరిన న్యాయమూర్తి. కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగారు చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. కొన్ని అంశాలపై మరిన్ని వివరాలు అడగగా..వాటికి వివరణ ఇచ్చారు చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా. వివరణ తర్వాత పది నిమిషాలు జడ్జి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత తిరిగి వచ్చి రేపటికి తీర్పు వాయిదా వేసినట్టు న్యాయమూర్తి చెప్పారు. అటు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచిచోటు వేరే ఎక్కడా లేదన్నారు. ఈ స్కామ్‌పై చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని.. చంద్రబాబును ఐదు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని చెప్పారు. ఇక చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వైద్యులు వహిస్తారు అని సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, శ్రీరామ్, వివేకానంద కోర్టులో వాదించారు.
చంద్రబాబు అరెస్టుపై దీదీ ఏం అన్నారంటే?
చంద్రబాబు అరెస్టును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రశ్నించాలని.. విచారణ తర్వాతే చర్యలు తీసుకోవాలి కానీ చంద్రబాబు విషయంలో అలా జరగలేదన్నారు. మరోవైపు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ఇవాళ ఆయన కుటుంబసభ్యులు కలవలేదు. ములాఖత్ కోసం చంద్రబాబు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోలేదు. సమయం ముగియడంతో అధికారులు ములాఖత్‌ను రద్దు చేశారు. రేపు(సెప్టెంబర్ 12) చంద్రబాబును కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది. మొత్తం ముగ్గురికి అవకాశం ఉంది.
Telangana Elections 2023: ఎన్నికల్లో పోటికి దరఖాస్తు చేసుకోని బీజేపీ సీనియర్లు.. కారణం ఏంటంటే?
More Than 6,000 Applied For MLA Tickets In Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో పోటి కోసం బీజేపీ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియకు అప్లికేషన్లు పోటెత్తాయి. సెప్టెంబరు 4 నుంచి 10 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియకు 6,003 మంది అప్లై చేసుకున్నారు. చివరి రోజైన ఆదివారం 2,727 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించారు. అటు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం 1,006 దరఖాస్తులు వచ్చాయి. బీజేపీ ఎలాంటి దరఖాస్తు రుసుము వసూలు చేయనప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ కేటగిరీ అభ్యర్థుల నుంచి ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి రూ.25 వేలు వసూలు చేసింది. సాధారణ పార్టీ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు సహా అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు దరఖాస్తు ప్రక్రియలో తేలింది.
అప్లై చేసుకున్న వారిలో ప్రముఖులు ఎవరంటే?
భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో సూర్యాపేట జిల్లాకు చెందిన బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రమీల కూడా ఉన్నారు. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న సామాజిక కార్యకర్త ప్రమీల తన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీని ఒప్పించి టిక్కెట్టు ఇప్పిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన మైనారిటీ మోర్చా సభ్యులు, నాయకులు కూడా టికెట్ ఆశించేవారిలో ఉన్నారు. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బక్రీ ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం దృష్ట్యా బీజేపీ టికెట్ కోసం సీనియర్ నేత ఐ గోపాల్ శర్మ దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్‌గా పనిచేశారు. బీజేపీ ఓబీసీ విభాగం అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం ఆమోదం కోరుతూ ఇప్పటికే దరఖాస్తు సమర్పించారు.
ALSO READ: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా?
సీనియర్లు ఎందుకు అప్లై చేసుకోలేదు:
6 వేల మందికి పైగా అప్లై చేసుకున్నా అందులో దరఖాస్తు చేసుకున్న సీనియర్ల సంఖ్య సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి మినహా… మిగిలిన ఎంపిలు, ఎమ్మెల్యేలు అప్లై చేసుకోలేదు. కిషన్ రెడ్డి, డికే.అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపూ రావు, వివేక్ వెంకటస్వామి, రాం చందర్ రావు, ఎన్వీఎస్ఏస్. ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి ఇతర ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకోలేదు. ఎంపీగా పోటి చేసేందుకు అప్లై చేసుకోలేదా లేదా దరఖాస్తుల స్వీకరణ నామమాత్రంగానే జరిగిందానన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 25 నుంచి 30 మందీ సీనియర్లు కచ్చితంగా పోటిచేయాలని గతంలో పార్టీ అధిష్టానం ఆదేశించిందన్న ప్రచారం జరిగింది. సీనియర్లు కచ్చితంగా పోటి చేయాలని.. ఎంపీగా ఉన్నవాళ్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయాలని హైకమాండ్ గతంలోనే చెప్పినట్టు సమాచారం. అయినా కూడా సీనియర్లు అసలు అప్లై చేసుకోలేదు.
ALSO READ: ఏ పేరైనా పర్వాలేదు…ఇండియా పేరు మార్పు మీద రాహుల్ గాంధీ కామెంట్స్
Lokesh: మా నాన్ననే టచ్ చేస్తావా? జగన్‌పై లోకేశ్ ఫైర్!
తన తండ్రి చంద్రబాబు అరెస్టు విషయంలో సీఎం జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. దొంగ కేసులు పెట్టి జైలుకు తరలించారన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రజలంతా ఖండించారని.. బంద్‌ని జయప్రదం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు లోకేశ్. ఇలాంటి సమయంలో తమకు సపోర్ట్ ఇచ్చినందకు పవన్‌కు, సీపీఐ, ఎంఆర్‌పిఎస్‌కు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
లోకేశ్ ఇంకేం అన్నారంటే:
➼చంద్రబాబు అంటే ఒక బ్రాండ్
➼చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి, జైలుకు పంపారు
➼బంద్‌ని జయప్రదం చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలకు…
➼ నేను అన్నగా భావించే పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు
➼ చంద్రబాబు జోలికొచ్చి జగన్ పెద్ద తప్పు చేశాడు
➼ జగన్ రాజకీయంగా పెద్ద మూల్యం చెల్లించుకోబోతున్నాడు
➼ జగన్ ఒళ్లంతా విషమే ఉంది
➼ మమత బెనర్జీ కూడా మద్దతు పలికారు
➼ అసలు డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దాన్ని రుజువు చేయలేకపోయారు
➼ రిమాండ్ రిపోర్టులో ఆధారాలు చూపించలేదు
➼ గుజరాత్లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు కూడా…సీమన్స్ కంపెనీనే ఈ ప్రాజెక్ట్ చేసింది
➼ చంద్రబాబుకు డబ్బులు వచ్చినట్లు నిరూపించగలరా ?
➼ చంద్రబాబును జైలుకు పంపించామని… మంత్రులు సంబరాలు చేసుకోవడమా?
➼ సీఐడీ అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా మారిపోయింది
➼ మీరు ఎన్నిసార్లు జైలుకు పంపినా మేం భయపడేది లేదు
➼ నేను ఎవరినీ వదిలిపెట్టను
➼ ప్రభుత్వాన్ని వెంటాడతా, వదిలేది లేదు
➼ నేను రాజమండ్రిలోనే ఏం చేస్తారో చేయండి
➼ నన్ను కూడా జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు
➼ 2021లో కేసు పెట్టి ఇప్పుడు చంద్రబాబు పేరు చేర్చారు
➼ రెండేళ్లుగా మీరెందుకు విచారించలేదు
➼ ఇదొక స్పీడ్ బ్రేకర్ మాత్రమే
➼ ఈ కేసులో ఏ పేపర్‌పైనా చంద్రబాబు సంతకం లేదు
➼ ఎవడొచ్చినా తొక్కుకుంటూ వెళతాం
➼ పాదయాత్రను తాత్కాలికంగా ఆపాం
➼ ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై త్వరలో నిర్ణయం.
ఉద్యోగాలు, సంక్షేమానికి, అభివృద్ధి పాలనకు కేరాఫ్ చంద్రబాబు అని కొనియాడారు ఆయన తనయుడు లోకేశ్. దేశరాజకీయాల్లోనే కాదు ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపింది సైకో ప్రభుత్వమంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు జోలికొచ్చి సైకో జగన్ పెద్ద తప్పు చేశాడని.. అధికారం అంటే తెలీదు, అధికారం అంటే కక్ష సాధింపు, వేధింపులు అనుకుంటున్నాడని ఫైర్ అయ్యారు లోకేశ్. సీఐడీ అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు లోకేశ్. జగన్‌కు ఒళ్ళంతా విషం ఉందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు వచ్చిందని ఎలాంటి రుజువు లేదని.. నిరాధార ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అనేది ఫేక్ కేస్ అని.. జగన్‌పై 70 కేసులు పైనే ఉన్నా, వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు లోకేశ్
ALSO REAd: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా?











