మందుబాబుల బుద్ధి మారడం లేదు. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నమన్న కనీస విచక్షణ ఉండడంలేదు. డబ్బులు ఎక్కువై తాగడం.. కారులో పాటలు పెట్టుకొని ఓవర్‌స్పీడ్‌తో రాత్రుళ్లు డ్రైవ్ చేయడం.. గోల చేయడం.. అడ్డొచ్చిన వాళ్లని ఢీకొట్టి చంపేయడం.. ఇదే వీళ్ల నైజం. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. డ్రంక్ చేసి డ్రైవ్(drunk and drive) చేయవద్దని పోలీసులు నెత్తి నోరు బాదుకున్నా ఏం ప్రయోజనం కనపడని దుస్థితి దాపరించింది. విశాఖ(Vizag)లో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా మరోసారి అమాయకుల ప్రాణాలు పోవడం కలిచివేస్తోంది. ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాడీసన్(Radisson) హోటల్ సమీపంలో బైక్‌ని కారు ఢీ కొట్టగా అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. వీరిలో భార్యాభర్తలు (wife and husband) ఉన్నారు.
వరుస ప్రమాదాలు :
విశాఖలో వారం రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటనలు జరగడం ఇది మూడోసారి. ఈ నెల(ఆగస్టు) 2న వీఐపీ రోడ్డులో వాహనాలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ నెల 5న సిరిపురంలో మరోకారు బీభత్సం సృష్టించింది. ఇక తాజాగా నిన్న(ఆగస్టు 7) రాత్రి బీచ్‌రోడ్డులో తప్పతాగి కారు డ్రైవ్ చేయగా.. ముగ్గురి ప్రాణాలు పోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించారు సీపీ త్రివిక్రమ్ వర్మ. కారులో మద్యం బాటిళ్లు దొరికినట్టు స్పష్టం చేశారు. ఇక విశాఖలో రోజూ 200కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదువుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతుండడంతో స్పెషల్ డ్రైవ్‌లు ముమ్మరం చేస్తామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. ఇక ప్రమదానికి అతి వేగమే కారణమని ఏసీపీ మూర్తి తెలిపారు. కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు ఉంటాయని.. కారులో ఎవరెవరు ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నామన్నారు. ఇక కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం సాగర్‌నగర్‌కు చెందిన ఇంటీరియర్ డెకరేటర్ ఈగల మహేష్ సూర్యదిగా పోలీసులు గుర్తించారు.
మృతుల్లో భార్యభర్తలు :
బీచ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు విడవగా..అందులో ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు. రుషికొండ నుంచి సాగర్‌వైపు వెళ్తున్న వీరి బైక్‌ని కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. మృతులు ఒడిశా రాయగడ జిల్లా కృష్ణానగర్‌కి చెందిన సింగారపు పృథ్వీరాజు, ప్రియాంకలుగా తెలుస్తోంది. పృథ్వీరాజు బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీలో సైట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అటు కారులో ఉన్నవారిలో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కారులో ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన మణికుమార్ ప్రమాదంలో చనిపోయాడు.
గెలిస్తేనే నిలుస్తాం.. ఇవాళ విండీస్‌తో ‘మూడో’ ఫైట్!
India vs West Indies 3rd T20 Match: టీ20 క్రికెట్లో టీమిండియా(Team India) ర్యాంక్ ఏమో నంబర్ వన్.. వెస్టిండీస్(West Indies) ర్యాంక్ ఏమో ‘ఏడు’. అయినా పొట్టి ఫార్మెట్లో విండీస్ తోపే..! టీ20 క్రికెట్లో తనదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలదు. రోహిత్, కోహ్లీ (Rohit & Kohli) లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియాకు కరీబియన్ జట్టు చుక్కలు చూపిస్తోంది. మొదటి రెండు టీ20ల్లో భారత్‌ను ఝలక్ ఇచ్చిన రోవ్‌మన్ పావెల్ టీమ్.. మూడో ఫైట్‌లోనూ చిత్తుచేయాలని తహతహలాడుతోంది. ఇటు టీమిండియా మాత్రం సిరీస్ గెలుపునకు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఇవాళ(ఆగస్టు 8)న జరగనున్న మూడో టీ20లో టీమిండియా ఓడిపోతే సిరీస్ సమర్పించుకున్నట్టే. ఐదు టీ20ల సిరీస్‌లో విండీస్ ఇప్పటికే 2-0 లీడ్‌లో ఉంది.
ఇదేం బ్యాటింగ్:
ఐపీఎల్(IPL)లో రఫ్ఫాడించిన మన యువ బ్యాటర్లు.. విండీస్ స్లో పిచ్‌లపై ఘోరంగా ఆడుతున్నారు. ఇదేం బ్యాటింగ్ బాబోయ్ అనిపించేలా ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Gill) బ్యాటింగ్ కొనసాగుతోంది. అటు వన్డేల్లో రాణించిన ఇషాన్ కిషాన్(Ishan Kishan).. పొట్టి ఫార్మెట్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. మిగిలిన బ్యాటర్లది అదే తీరు. తెలుగు బిడ్డ తిలక్ వర్మ(Tilak varma) మినహా ఏ ఒక్కరూ సరిగ్గా ఆడని దుస్థితి. తిలక్ ఒక్కడే బాధ్యతగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. జట్టు మొత్తం విఫలమైన చోట తిలక్ ఆడుతున్న తీరు అద్భుతం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఎలాగైతే సేవియర్ రోల్ ప్లే చేశాడో.. ఇప్పుడు టీమిండియాలోనూ అదే పాత్ర పోషిస్తున్నాడు తిలక్.
మిడిల్ ప్చ్:
ఇక టాపార్డర్ మాత్రమే కాదు.. మిడిలార్డర్ ఆటతీరు కూడా అధ్వానంగానే ఉంది. సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. అటు సంజూ శాంసన్, హార్దిక్ కూడా ఏదో వచ్చామా.. నాలుగు బంతులు ఆడామా అన్నట్టు ఉంటున్నారు. మొదటి మ్యాచ్‌లో గెలిచే స్థితి నుంచి ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా రెండో టీ20లో అసలు పోరాటమే చేయనట్టు కనిపించింది. ఫ్లాట్ పిచ్‌లపై చెలరేగి ఆడే మన యువ బ్యాటర్లు.. విండీస్ గడ్డపై తడపడుతుండడం కలవరపెడుతోంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ని ఆడించే అవకాశం కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లో ముఖేశ్ లాస్ట్ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడి స్థానంలో అవేశ్‌ఖాన్, ఉమ్రాన్ మాలిక్లో ఎవరో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
India vs West Indies 3rd T20 Team prediction – జట్ల అంచనా
భారత్: హార్దిక్‌పాండ్యా(కెప్టెన్), గిల్, ఇషాన్‌కిషన్/జైస్వాల్, సూర్యకుమార్, తిలక్‌వర్మ, శాంసన్, అక్షర్‌పటేల్, కుల్దీప్యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌సింగ్, ముకేశ్ కుమార్.
వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, చార్లెస్, పూరన్, హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), హోల్డర్, షెఫర్డ్, హుసేన్, జోసెఫ్, మెక్కాయ్.
Also Read: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త హెడ్ కోచ్.. ఎవరంటే..?
ఢిల్లీ సర్వీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఎన్డీఏ కూటమికి 131ఓట్లు
Rajya Sabha passes Delhi services Bill : ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా బిల్లుకు మద్దతుగా 131 ఓట్లు.. వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఆటోమెటిక్ ఓటింగ్ మిషన్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలున్న కారణంగా.. స్లిప్స్ ద్వారా ఈ ఓటింగ్‌ను నిర్వహించారు. ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.
ఇక ఢిల్లీ సర్వీసు బిల్లుపై రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రసంగం అగ్గి రాజేసింది. సర్వీసు బిల్లుపై ప్రసంగిస్తూ మధ్యలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) ప్రస్తావన తీసుకొచ్చారు అమిత్‌షా. ఈ స్కామ్ గురించి మట్లాడుతూ మధ్యలో బీఆర్ఎస్ పేరు ఎత్తారు. దీంతో సభలో ఉన్న హడావుడి నెలకొంది. అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఎంపీలు స్లోగన్స్ మొదలుపెట్టారు. అటు అమిత్‌షా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. మద్యం కుంభకోణం ఫైళ్లు తమ వద్ద ఉండడంతోనే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం విజిలెన్స్ విభాగంలోని అధికారులను బదిలీ చేసిందని ఆరోపించారు అమిత్‌షా. ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడేందుకు సర్వీసు బిల్లును తీసుకొచ్చామన్నారు. మరోవైపు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi services Bill) ను సెలెక్ట్ కమిటీ ఆఫ్ హౌస్‌కి పంపడాన్ని రాజ్యసభ తిరస్కరించింది. ఢిల్లీ సర్వీసుల బిల్లును సెలెక్ట్ కమిటీ ఆఫ్ హౌస్‌కు వాయిస్ ఓటింగ్ ద్వారా పంపాలన్న విపక్షాల తీర్మానాన్ని రాజ్యసభ తిరస్కరించింది.
షా షో..!
ఢిల్లీ సర్వీసు బిల్లుపై ప్రసంగిస్తూనే విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు అమిత్‌షా. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు (Congress Party) లేదని మండిపడ్డారు. ఎమర్జెన్సీ విధించడానికి లేదా ప్రజల హక్కులను హరించడానికి ఢిల్లీ సర్వీస్ బిల్లు తీసుకురాలేదంటూ చురకలంటించారు. ఆమ్ ఆద్మీ పార్టీని (Aam Aadmi Party) ప్రసన్నం చేసుకునేందుకే ఢిల్లీ సర్వీసుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఢిల్లీకి చట్టాలను రూపొందించే అధికారాలను పార్లమెంటుకు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించిందన్న విషయం మరువద్దన్నారు అమిత్ షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదన్నారు అమిత్‌షా. 2015కి ముందు ఢిల్లీని బీజేపీ, కాంగ్రెస్‌లు పాలించాయని.. కానీ కేంద్రంతో ఎప్పుడూ గొడవలు లేవని ఆప్ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు.
ఢిల్లీ సేవల బిల్లు ఏ విధంగానూ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించదంటూ కామెంట్స్ చేశారు అమిత్‌షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన లక్ష్యంగా రూపొందించన్నారు. INDIA కూటమిలో మరిన్ని పార్టీలు చేరినా పర్వాలేదని 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు అమిత్‌షా.
Also Read: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
గద్దర్ అంత్యక్రియల సమయంలో విషాదం.. గుండెపోటుతో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ మృతి
గద్దర్ అంత్యక్రియల సమయంలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల సమయంలో జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు. హార్ట్ స్ట్రోక్‌తోనే జహీరుద్దీన్ చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్ని కడసారి చూసేందుకు వచ్చిన జన సందోహంలో జహీరుద్దీన్ కూడా ఉన్నారు. గద్దర్‌కు జహీరుద్దీన్ అత్యంత సన్నిహితుడు. ఎడిటర్‌గా జహీరుద్దీన్కి మంచి పేరుంది.
గతంలో అనేక మంది ఆయన జర్నలిజంని కొనియాడారు. గతేడాది డిసెంబర్లో ఆయన్ను సౌదీకి చెందిన వ్యాపారవేత్తలు సన్మానించారు. ఇండియాన్ జర్నలిజంలో నిజాయితీతో కూడిన కమ్యూనిటీ సర్వీసెస్‌కు ఆయన్ను సత్కరించారు. గతేడాది సెప్టెంబర్‌లో జహీరుద్దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐపీఎస్-వీఆర్ఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. గతేడాది సియాసత్ ఉర్దూ ప్రింట్ మీడియాలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలిశారు.
గద్దర్ భౌతికయానికి సీఎం కేసీఆర్ నివాళులు:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అల్వాల్‌లోని భూదేవినగర్‌లో గద్దార్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. గద్దర్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్.. గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయనతో పాటు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంతకుముందు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్ పార్థీవదేహానికి నివాళుతర్పించారు. విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, అలీ, ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తదితరులు నివాళులర్పించారు. అటు గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య విమలారావుకు లేఖ పంపించారు.
అంతకముందు 6 గంటల పాటు భాగ్యనగరంలో 17 కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కళాకారులు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. గద్దర్ కడచూపు కోసం అభిమానులు, కవులు కళాకారులు భారీగా తరలివచ్చారు. రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన గద్దర్ ఆగస్టు 6 మధ్నాహ్నం తుదిశ్వాస విడిచారు.
అలెర్ట్ అలెర్ట్.. సెంట్రల్ రైల్వేలో 1,303 జాబ్స్‌కి నోటిఫికేషన్.. డీటైల్స్ చెక్ చేసుకోండి!
Central Railway Announces 1303 Vacancies: రైల్వే రిక్రూట్మెంట్ సెల్(Railway Recruitment Cell) నుంచి కీలక్ అప్డేట్ వచ్చింది. జూనియర్ ఇంజనీర్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. GDCE కోటాలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,303 ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు సెంట్రల్ రైల్వేలో రెగ్యులర్ ఉద్యోగులై ఉండాలి. ఆగస్టు 21, 2021కి ముందే రైల్వేలో పని చేయడం స్టార్ట్ చేసి ఉండాలి. పదవీ విరమణ చేసిన వారు అప్లై చేయడానికి అనర్హులు.
పోస్టుల వివరాలు:
• అసిస్టెంట్ లోకో పైలట్ – 732 ఖాళీలు
• టెక్నీషియన్ – 255 ఖాళీలు
• జూనియర్ ఇంజనీర్ – 234 ఖాళీలు
• గార్డ్/ట్రైన్ మేనేజర్ – 82 ఖాళీలు
• అర్హత:
అసిస్టెంట్ లోకో పైలట్ – అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి మెట్రిక్యులేషన్/ SSLC ప్లస్ ITI ట్రేడ్లలో NCVT/ SCVT గుర్తింపు పొందిన సంస్థల నుంచి లేదా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి
• టెక్నీషియన్ – మెట్రిక్యులేషన్ లేదా SSLCతో పాటు NCVT లేదా SCVT ద్వారా గుర్తింపు పొందిన ట్రేడ్ స్కూల్ నుంచి ITI సర్టిఫికేట్.
• జూనియర్ ఇంజనీర్ – పేరున్న యూనివర్సిటీ నుంచి ఏదైనా బేసిక్ స్ట్రీమ్ సబ్స్ట్రీమ్లో మూడేళ్ల డిప్లొమా.
వయస్సు పరిమితి :
• అన్‌రిజర్వడ్ – 42 సంవత్సరాలు
• OBC – 45 సంవత్సరాలు
• SC/ST – 47 సంవత్సరాలు
ముఖ్య తేదీలు:
• నోటిఫికేషన్ ప్రచురణ తేదీ – 1 ఆగస్టు 2023
• ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రారంభ తేదీ – 3 ఆగస్టు 2023
• ఆన్లైన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీ – 2 సెప్టెంబర్ 2023
• RRC/CR అధికారిక వెబ్సైట్ www.rrccr.com ( click here ) ద్వారా అప్లికేషన్ని ఫిల్ చేసుకోవచ్చు.
రూ.95వేల శాలరీతో బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జాబ్స్.. పూర్తి వివరాలివే..!
Bank Note Press Recruitment 2023: సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్‌తో పాటు ఇతర పోస్టుల కోసం బ్యాంక్ నోట్ ప్రెస్(BNP), దేవాస్ (MP) దరఖాస్తులను ఆహ్వానించింది. అప్లికేషన్ని ఫిల్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ clickhere ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
బ్యాంక్ నోట్ ప్రెస్ రిక్రూట్మెంట్ వివరాలు:
మొత్తం ఖాళీలు: 111 పోస్టులు
➼ సూపర్వైజర్ (ప్రింటింగ్): 8 పోస్టులు
•సూపర్వైజర్ (కంట్రోల్): 3 పోస్టులు
➼ సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 1 పోస్ట్
• జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 4 పోస్టులు
➼ జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్): 27 పోస్టులు
• జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్): 45 పోస్టులు
➼ జూనియర్ టెక్నీషియన్ (అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) / లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)/ మెషినిస్ట్ / మెషినిస్ట్ గ్రైండర్ / ఇన్స్ట్రుమెంట్ మెకానిక్): 15 పోస్టులు
• జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ / ఎయిర్ కండిషనింగ్): 3 పోస్టులు
➼ జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 4 పోస్టులు
• జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్మెంట్): 1 పోస్ట్
అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్ :
➼ సూపర్వైజర్: రూ. 27,600 – రూ. 95,910
• జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ 21,540 – రూ 95,910
➼ జూనియర్ టెక్నీషియన్: రూ. 18,780 – రూ. 67,390
వయసు:
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
ఫీజ్:
UR/ OBC/ EWS : రూ. 600
SC / ST / Ex-SM / PWD: రూ 200
ఎలా దరఖాస్తు చేయాలి? :
• Bank Note Press Recruitment Official website bnpdewas.spmcil.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
➼ కెరీర్(career) విభాగానికి వెళ్లండి
• రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి
➼వివరాలు నమోదు చేసుకోండి
• అప్లికేషన్ ఫారమ్‌ని ఫిల్ చేయండి
➼ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయండి
• దరఖాస్తు రుసుము చెల్లించండి
➼ ఫ్యూచర్ పర్పెస్ కోసం ప్రింటవుట్ తీసుకోండి
మరిన్ని వివరాల కోసం ఇక్కడ నోటిఫికేషన్ పీడీఎఫ్‌పై క్లిక్ చేయండి
Also Read: ప్రముఖ సంస్థలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. 647 ఖాళీలకు దరఖాస్తు చేసుకోండిలా..!











