Chandrayaan 2 memories: అది సెప్టెంబర్ 7, 2019.. అర్థరాత్రి ఒంటిగంట దాటింది.. అందరూ గాఢ నిద్రలో ఉండాల్సిన సమయం అది.. కానీ యావత్ దేశం మెలుకునే కుర్చుంది. టీవీలకు అతుక్కుపోయింది.. జరుగుతుంది ఏ క్రికెట్ మ్యాచో కాదు.. చంద్రయాన్-2 జాబిల్లిపై కాలుమోపే క్షణాలు అవి.. అప్పటివరకు కేవలం మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై తమ ల్యాండర్‌ని విజయవంతంగా పంపించగలిగాయి.. అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త సంచలనం సృష్టించేందుకు ఇండియా రెడీ అయ్యింది.. అటు బెంగళూరులోని ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో సైంటిస్టులు, ప్రధాని మోదీ చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అక్కడున్న వారి వయసు సగటున 40ఏళ్లు పైనే ఉంటుంది. కానీ ఆ రోజు అంతా చిన్నపిల్లలే.. జాబిల్లివైపు వడివడిగా అడుగులేస్తున్న చంద్రయాన్-2ని చూసి అంతా కేరింతలు కొడుతున్నారు. వారి ముఖాల్లో ఆనందం, ఏదో సాధించాబోతున్నమన్న గర్వం..ఆ ప్రాంగణమంతా సందడే సందడి..
లాస్ట్ బంతికి బోల్తా:
జాబిల్లిపై చంద్రయాన్-2 ల్యాండర్ అడుగుపెట్టేందుకు సమయం దగ్గరపడుతున్న కొద్ది అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ.. గ్యాలరీలో తన సిటులో ఉండి జరుగుతున్నదంతా గమనిస్తున్న మోదీ సైతం టెన్షన్ పడుతూ కనిపించారు.. అతి క్లిష్టమైన అన్ని దశాలు దాటిన చంద్రయాన్-2 జాబిల్లికి చాలా దగ్గరైంది.. ఇంకా 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే ల్యాండర్ జాబిల్లిపై దిగుతుంది. అందరి కళ్లు చంద్రయాన్-2 రూట్‌పైనే ఉంది. ఇంతలోనే ల్యాండర్ తన దశను మార్చుకుంది. అప్పటివరకు అందరి కళ్లలో కనిపించిన ఆనందం.. ఆవిరైపోయింది.. ఏం జరుగుతుందో క్లియర్‌కట్‌గా తెలిసిపోయింది.. నాటి ఇస్రో ఛైర్మన్ శివన్ ల్యాండర్ దశ మార్చుకున్నట్టు ప్రకటించారు. అప్పటివరుకు చప్పట్లతో మారుమోగిన ఆ ప్రాంతాన్ని మౌనం కమ్మేసింది.. కన్నీళ్లు ధారలు కట్టాయి. శివన్ ఒక్కసారిగా ఏడ్చేశారు. అక్కడే ఉండి ఇవన్ని గమనిస్తున్న మోదీ ఆయన్ను ఓదార్చారు.. నిజానికి అప్పటి ప్రయోగాన్ని విఫలం అని అనలేం. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి ల్యాండర్ దూసుకుపోవడం చిన్న విషయం కాదు.. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటతో లాస్ట్ మినిట్‌లో సేఫ్ ల్యాండ్ కాలేకపోయిందంతే.
ఈ సారి లాస్ట్ బాల్ సిక్స్ పక్కా!
చంద్రయాన్-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. చంద్రయాన్-3కి సర్వశక్తులు ఒడ్డింది.. సైంటిస్టుల ప్రాణం పెట్టి పని చేశారు. చంద్రుడి ఉపరితలంపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది గంటల్లో (ఆగస్టు 23, సాయంత్రం 6:04గంటలకు) లూనార్ టచ్‌డౌన్ అవుతుంది. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్టు జరగడంతో ఇస్రో సైంటిస్టులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అటు ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ తర్వాత యావత్ దేశాన్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చినది ఏదైనా ఉందంటే అది చంద్రయాన్ ప్రయోగం మాత్రమేనని చెప్పవచ్చు. చంద్రయాన్-3 ప్రయోగం గురించి నెట్టింట సెర్చ్ చేస్తున్న వాళ్లని చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. చంద్రయాన్-3 సక్సెస్ అవ్వాలని అందరూ దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. ఇంతలా చంద్రయాన్ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొచ్చింది.. దటీజ్ ఇస్రో..!
BRS: ఆ ఏడుగురు ఎమ్మెల్యేలకు షాక్.. ఎందుకంటే..?
Telangana elections 2023: యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ఒకేసారి 119 స్థానాలకు 114 మంది అభ్యర్థులను ప్రకటించి విపక్షాలతో పాటు ఏడుగురు సిట్టింగ్‌లకు షాకిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ లిస్టులో వేములవాడ, ఖానాపూర్, వైరా, అసిఫాబాద్, బోథ్, ఉప్పల్, స్టేషన్ ఘన్పూర్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఐతే ఈ స్థానాల్లో సిట్టింగ్‌లకు సీటు ఎందుకు నిరాకరించారనేది హాట్ టాపిక్‌గా మారింది.

పౌరసత్వ వివాదమే కొంపముంచిందా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానాల్లో వేములవాడ ఒకటి. ఇక్కడి నుంచి చెన్నమనేని రమేష్ బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐతే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మంచి ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ…ఆయన పౌరసత్వ వివాదం కారణంగానే టికెట్ నిరాకరించినట్లు స్పష్టం చేశారు కేసీఆర్. చెన్నమనేని పౌరసత్వ వివాదం ఇంకా కోర్టుల్లోనే ఉంది. ఇదే సమయంలో ఆయన ఎక్కువ జర్మనీలోనే ఉంటారన్న విమర్శ కూడా ఉంది. చెన్నమనేని స్థానంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన చల్మెడ ఆనందరావుకు టికెట్ కన్ఫామ్ చేశారు గులాబీ అధినేత.

వ్యవహార శైలే కారణమా?
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో సిట్టింగ్‌లకు షాకిచ్చారు కేసీఆర్. ఖానాపూర్‌లో వరుసగా రెండు సార్లు రేఖానాయక్ విజయం సాధించారు. ఐతే ఈ సారి రేఖానాయక్‌కు గులాబీబాస్ మొండి చేయి చూపారు. నియోజకవర్గంలో కొంతకాలంగా యాక్టివ్‌గా ఉంటున్న కేటీఆర్ స్నేహితుడు, NRI జాన్సన్ నాయక్‌కు టికెట్ ఫైనల్ అయింది. రేఖానాయక్ వ్యవహర శైలితో స్థానిక నేతలు ఇబ్బంది పడడం, ఈ సారి టికెట్ ఇచ్చినా ఫలితం లేదని తేలడంతో టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఎంపీ టికెట్ కోసం?
ఇక ఆసిఫాబాద్‌ను ప్రస్తుత ఎమ్మెల్యే ఆత్రం సక్కును కాదని..కోవా లక్ష్మీకి ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో కోవా లక్ష్మీ ఓడిపోయారు. ఐతే ఈ సారి కూడా కోవా లక్ష్మీకే టికెట్ కేటాయించిన కేసీఆర్..ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రజా వ్యతిరేకతే కారణం
ఆదిలాబాద్‌లో సిట్టింగ్‌కు షాకిచ్చిన మరో స్థానం బోథ్. ప్రస్తుత ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు బీఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చింది. ఆయన స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు ఛాన్సిచ్చింది. బాపూరావుపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడమే టికెట్ నిరాకరణకు కారణంగా తెలుస్తోంది.

ఇద్దరిని కాదని..!
ఇక హైదరాబాద్ సిటీలోని ఉప్పల్ అభ్యర్థిని మార్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్ రెడ్డికి మొండి చేయి చూపారు. ఐతే ఉప్పల్ సీటును బొంతు రామ్మోహన్ కూడా ఆశించారు. ఐతే వీరిద్దరిని కాదని..కాంగ్రెస్ నుంచి వచ్చిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు గులాబీ అధినేత. చివర్లో బండారుకు టికెట్ రాకుండా బొంతు, భేతీ సుభాష్ రెడ్డి ఇద్దరు తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కేసీఆర్ ఆయన వైపే మొగ్గు చూపారు. అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత కారణంగా భేతి సుభాష్ రెడ్డికి నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

నవ్య వివాదంతో ఫసక్:
కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరదించారు కేసీఆర్. వివాదాలకు సెంటర్‌గా మారిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యను తప్పించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఛాన్సిచ్చారు. రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయారంగేట్రం చేశాడు. 2012లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లక్షంగా కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన రాజయ్య..2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఐతే ఇటీవల సర్పంచ్ నవ్య వివాదం ఎమ్మెల్యే రాజయ్యకు మైనస్‌గా మారింది.

మదన్లాల్వైపే మొగ్గు:
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించారు కేసీఆర్. వైరాలో ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్‌కు మొండి చేయి చూపారు. రాములు నాయక్ తీరుపై సొంత పార్టీ నేతలతో పాటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉండడమే టికెట్ నిరాకరించడానికి కారణమని తెలుస్తోంది. రాములు నాయక్‌కు స్థానంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ ఇచ్చారు కేసీఆర్. సర్వేల్లో రాములు నాయక్‌కు వ్యతిరేకంగా రావడంతో టికెట్ నిరాకరించినట్లు సమాచారం.
JR NTR, NBK: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇష్యూ ఏంటి? అసలేం జరిగింది?
Balakrishna, Jr NTR Shakehand: నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఎందుకంటే అందరూ ఏకమయ్యారు.. ఒకే చోట కనిపించారు.. సందడి చేశారు. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం సాయి గీతికతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకి వచ్చారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి మోక్షజ్ఞ, కళ్యాణ్ రామ్.. ఇలా నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో చంద్రబాబు కూడా సందడి చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు హాజరయ్యారు.
నందమూరి సుహాసిని గారి కుమారుడు హర్ష వివాహా వేడుక:
బాలయ్యకు ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా 🤝, బాలయ్య మాత్రం క్యాజువల్‌గా స్పందించారు…#NTR #Devara #Mokshagna #JrNTR #BhagavanthKesari #NBK pic.twitter.com/jY2toOKEpB
— Telugu Digi (@TeluguDz) August 21, 2023
షేక్ హ్యాండ్ ఇష్యూ:
నందమూరి కుటుంబం అంతా ఓకే చోట కనపడి ఫొటోలకు ఫోజులు ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ షేక్ హ్యాండ్ గురించి సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. వేడుకలో కుర్చిలో ఉన్న బాలకృష్ణ వద్దకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్నవారితో పాటే బాలకృష్ణకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో జూనియర్ నవ్వుతూనే కనిపించారు. అయితే సోషల్‌మీడియాలో మాత్రం కొంతమంది బాలకృష్ణ జూనియర్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో కూడా వెనక నుంచి రికార్డయింది. దీంతో అసలు నిజం ఏంటన్నది తెలియదు. కానీ జూనియర్ ఎక్స్ప్రెషన్ మాత్రం హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తోంది.
Tarak and Mokshagna 😍🔥#Devara #BhagavanthKesari pic.twitter.com/keTO2FYbAc
— NBK Cult 🦁 (@iam_NBKCult) August 20, 2023
జూనియర్ బాలయ్యను చాలా ప్రేమగానే పలకరించినట్టు క్లియర్‌గా కనిపిస్తోంది. ఇందులో ఏ డౌట్ ఎవరికి లేకున్నా.. బాలకృష్ణ రియాక్షన్ సరిగ్గా లేదంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నిజానికి గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ఇలానే ప్రవర్తించారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన జూనియర్.. బాలకృష్ణను చూసి నిలబడి నమస్కారం చేశారు. బాలయ్య మాత్రం చూసీచూడనట్లు వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది.. మరోసారి అదే జరిగిందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ ఫ్యాన్స్‌కి ఏం పనిపాటా ఉండదా అని మరికొందరు చిరాకుపడుతున్నారు. అటు సోషల్‌మీడియాలో నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Had A Amazing Chat With Devara❤️
Future Of Nandamuri ❤️ 🔥#Balayya #NBK #NTR #JrNTR #BhagavanthKesari #Devara pic.twitter.com/bX60HqDnF1— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) August 20, 2023
ASIA CUP: టీమిండియాకు గట్టి షాక్.. మరోసారి ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం!
KL Rahul in Asia Cup 2023: ఆసియా కప్(Asia Cup) స్క్వాడ్ అలా అనౌన్స్ చేశారో లేదో ఇలా బాంబు పేల్చారు సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్. దాదాపు నాలుగు నెలల తర్వాత గ్రౌండ్లో కనిపిస్తాడనుకున్న కేఎల్ రాహుల్(KL Rahul)కి మరోసారి గాయం అయ్యింది. నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో తాజాగా రాహుల్ గాయపడ్డాడని సమాచారం. దీని కారణంగా ఆసియా కప్‌లో మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని అజిత్ అగార్కర్(Ajit Agarkar) ధృవీకరించాడు. ఎన్సీఏ(NCA)లో కోలుకున్న సమయంలో కెఎల్ రాహుల్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని, ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే టోర్నమెంట్లో అతను మొదటి కొన్ని గేమ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
Latest insat story of KL Rahul❤❤
King is Ready for the Asia cup. #KLRahul pic.twitter.com/QAeqTgyyk9— SHUBHAM🚩 (@RAHUL__KL) August 20, 2023
గాయం నుంచి కోలుకున్నాడు కానీ..:
17 మందితో కూడిన భారత ఆసియా కప్ జట్టులో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు కానీ ఇంతలోనే అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ని కలవరపెడుతున్నాయి. అసలు రాహుల్ ఫిట్‌గానే ఉన్నాడా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకుండా బరిలోకి దింపితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. గతంలో బుమ్రా(Bumrah) విషయంలోనూ బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలే తీసుకుందని గుర్తు చేస్తున్నారు. నిజానికి బుమ్రాకు తొలిసారి గాయం ఐనప్పుడు పూర్తిగా కోలుకోకముందే తిరిగి జట్టులోకి తీసుకొచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే బుమ్రా గాయాలు పదేపదే తిరగబెట్టాయని ఫ్యాన్స్ చెబుతుంటారు. ప్రస్తుతం రాహుల్ విషయంలోనూ ఇదే తప్పు జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Image source/twitter
ఈ ఏడాది ఐపీఎల్లో రాహుల్ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) వర్సెస్ బెంగళూరు(Bangalore) మ్యాచ్‌లో రాహుల్‌కి ఇంజ్యురి అయ్యింది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తొడకు గాయం కావడంతో అతను ఆటకు దూరం అయ్యాడు. తర్వాత లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయానికి సంబంధించి కూడా శస్త్రచికిత్స జరిగింది. అయ్యర్ గ్రౌండ్లో కనపడి చాలా కాలం దాటింది. తాజాగా అయ్యర్(Iyer)తో పాటు రాహుల్ కూడా తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే ప్రపంచ కప్ జరగడానికి మరి కొద్ది కాలమే సమయం ఉండడంతో ఈ ఇద్దరు ఎలా ఆడతారన్నదానిపై ఓ స్పష్టత రానుంది. మరోవైపు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొలిసారిగా వన్డే జట్టులోకి ఎంపిక అయ్యాడు.
Also Read: జాక్‌పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు
రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటి.. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరణ..తొలి జాబితా ఇదే..!
BRS MLA Candidates First List: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు కేసీఆర్. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరించారు. ఇక ఈసారి తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం గజ్వెల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు.







➼ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా
ఉమ్మడి అదిలాబాద్ – /10
సిర్పూర్ – కోనేరు కొనప్ప
చెన్నూరు – బాల్క సుమన్
బెల్లంపల్లి –
మంచిర్యాల- దివాకర్ రావు
అదిలాబాద్ – జోగు రామన్న
బోథ్ – అనిల్ జాదవ్
నిర్మల్ – ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
ఖానాపూర్-జాన్సన్ నాయక్.
ఉమ్మడి నిజామాబాద్ – 8/9
ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి
బోధన్ – షకీల్ అహ్మద్
జుక్కల్ – హనుమంత్ షిండే
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్
➼ కామారెడ్డి- గంప గోవర్ధన్.
నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి
➼ కరీంనగర్ – 8/13
కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్
జగిత్యాల -ఎం సంజయ్ కుమార్
ధర్మపురి-
మంథని -పుట్ట మధు
పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్ – గంగుల కమలాకర్
సిరిసిల్ల – కేటీఆర్
చొప్పదండి-సుంకే రవిశంకర్.
వేములవాడ- లక్ష్మీ నరసింహారావు
మానకొండూరు – రసమయి బాలకిషన్
హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్
హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
రామగుండం – కొరుకంటి చందర్
➼ ఉమ్మడి మెదక్ – 6/10
సిద్దిపేట – తన్నీరు హరీష్ రావు
మెదక్-
నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి
ఆందోల్ -చంటి క్రాంతి కిరణ్
నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి/సునీత లక్ష్మారెడ్డి
జహీరాబాద్-నరోత్తం/ఢిల్లీ వసంత్.
సంగారెడ్డి- చింత ప్రభాకర్.
పఠాన్ చెరు –
దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్ – కేసీఆర్
➼ ఉమ్మడి రంగారెడ్డి – 13/14
మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద గౌడ్.
కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు
ఉప్పల్ –
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బి నగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్ర నగర్ – ప్రకాష్ గౌడ్
శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ
చేవెళ్ల – కాలె యాదయ్య
పరిగి-మహేశ్వర్ రెడ్డి
వికారాబాద్ – మెతుకు ఆనంద్
తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి
➼ ఉమ్మడి హైదరాబాద్ – 6/15
ముషీరాబాద్ – ముఠా గోపాల్
మలక్ పేట్ –
అంబర్ పేట –
ఖైరతాబాద్ – దానం నాగేందర్
జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
నాంపల్లి-
కార్వాన్-
గోషామహల్-
చార్మినార్- ఇబ్రహిం లోడి
చాంద్రాయణగుట్ట- సీతారామ రెడ్డి
యాకుత్ పురా – సామా సుందర్‌రెడ్డి
బహదుర్ పుర- అలీ బక్రీ
సికింద్రాబాద్ – టి పద్మారావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్-
➼ ఉమ్మడి మహబూబ్ నగర్ – 11/14
కొడంగల్ – పట్నం నరేందర్
నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల – సి లక్ష్మారెడ్డి
దేవరకద్ర – ఆల్ల వెంకటేశ్వర రెడ్డి
మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్
ఆలంపూర్- Dr అబ్రహం
నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేట-గువ్వల బాలరాజు
కల్వకుర్తి- జైపాల్ యాదవ్.
షాద్‌నగర్- అంజయ్య యాదవ్
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్
➼ ఉమ్మడి నల్లగొండ – 10/12
దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్
నాగార్జునసాగర్-భగత్
మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్ – శానంపుడి సైదిరెడ్డి
కోదాడ –
సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి
నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – గాదరి కిషోర్
ఆలేరు – గొంగడి సునీత
మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
➼ ఉమ్మడి వరంగల్ – 7/12
జనగామ-
స్టేషన్ ఘనపూర్-కడియం శ్రీహరి
పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్-రెడ్య నాయక్
మహబూబాబాద్-శంకర్ నాయక్
నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల – చల్లా ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ ఈస్ట్-నరేందర్
వర్ధన్నపేట – ఆరూరి రమేష్
భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి
ములుగు -నాగమణి.
➼ ఉమ్మడి ఖమ్మం – 7/10
పినపాక – రేగ కాంతారావు
ఇల్లందు – బానోత్ హరిప్రియ
ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి
మధిర -లింగాల కమల్‌రాజు
వైరా-బానోత్ మదన్‌లాల్.
కొత్తగూడెం-
సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు
భద్రాచలం-తెల్లాం వెంకట్రావు.
➼ టికెట్ దక్కని BRS ఎమ్మెల్యేలు
సుభాష్ రెడ్డి – ఉప్పల్
రాజయ్య – స్టేషన్ ఘనపూర్
రాములు నాయక్ – వైరా
రేఖా నాయక్ -ఖానాపూర్
చెన్నమనేని రమేష్ – వేములవాడ
గంప గోవర్ధన్ -కామారెడ్డి
రాథోడ్ బాపురావు -బోధ్
➼ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొత్త ముఖాలు:
ఆసిఫాబాద్ : కోవా లక్ష్మి
ఖానాపూర్ : భూఖ్య జాన్సన్ రాథోడ్ నాయక్
స్టేషన్ ఘన్పూర్ : కడియం శ్రీహరి
ఉప్పల్ : బండారి లక్ష్మారెడ్డి
వైరా : బానోతు మదన్‌లాల్
కోరుట్ల – డా. సంజయ్ కల్వకుంట్ల
Also Read: దీక్ష విరమించిన మహేశ్వర్ రెడ్డి.. అసలేంటి? నిర్మల్ మాస్టర్ ప్లాన్ రగడ
Filmymoji: కామెడీతో పొట్ట చెక్కలు చేసిన మధు, డూపేశ్.. క్లైమాక్స్‌లో మాత్రం ఏడుపొచ్చింది భయ్యా!
ఫిల్మీమోజీ(Filmymoji) ఎప్పటిలాగే కడుపుబ్బా నవ్వించింది. ‘సమ్‌థింగ్ మిస్సమ్మ’ ఫైనల్ ఎపిసోడ్ (SomeThing Missamma Final Episode) నెటిజన్లను కట్టిపడేసింది. కామెడీతో మొదలైన ఈ ఎపిసోడ్.. చివరిలో అందరిని ఎమోషనల్ అయ్యేలాగా చేసింది. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో..కని పెంచిన పిల్లలు దూరమైతే ఎంత తల్లడిల్లిపోతారో.. తమ ప్రాణ స్నేహితుడు కనపడకపోతే స్నేహితులు ఎంతలా బాధపడతారో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫిల్మీమోజీ ఎక్కడా కూడా కామెడీ టైమింగ్‌ని మాత్రం మిస్ అవ్వలేదు. ముఖ్యంగా ఈ సారి కెమెరామ్యాన్ పాత్రలో నటించిన డూపేశ్(రూపేశ్), అంటుకుల్(అంకుల్- కోమలి వాళ్ల నాన్న) పంచ్ డైలాగులు ఓ రేంజ్లో పేలాయి.
అసలేం జరిగిందంటే:
ఫొటో సెషన్ కోసం మధు, మహేశ్, బల్లి, బుడద రూపేశ్ అనే కెమెరామ్యాన్ దగ్గరకు వెళ్తారు. ఈ క్రమంలోనే బయట ఫొటో షూట్ ప్లాన్ చేసుకుంటారు. విజయనగరంలో అప్పుడే కొత్తగా కట్టిన బ్రిడ్జ్‌పై నుంచి ఫొటో దిగాలని మధు దానిపైకి ఎక్కి బ్యాలెన్స్ స్లిప్ అవుతాడు. అదే సమయంలో ఓ లారీ రోడ్డుపై నుంచి వెళ్తుండగా అందులో పడిపోతాడు..అటు తిరిగి ఇటు తిరిగి ఆ లారీ రాయలసీమలో జమ్మలమడుగుకు వెళ్తుంది. అక్కడ తన లవర్ కోమలి కనిపిస్తుంది. కోమలి వాళ్ల కజిన్ పెళ్లి అక్కడే ఉంటుంది. వాళ్ల ఇంట్లోనే మధు ఉండిపోతాడు.
ఎపిసోడ్‌కి ఒక ట్విస్ట్‌తో సాగిందీ సిరీస్. చివరగా ఫొటోషూట్ చేసిన రూపేశే పెళ్లికూతురితో జంప్ అవ్వడం ఈ సిరీస్‌కే హైలెట్. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్లో రూపేశ్ క్యారక్టర్ని ఫిల్మీమోజీ చెక్కిన విధానం నెటిజన్లను ఫిదా చేసింది. అటు కోమలి తండ్రి అంటుకుల్(అంకుల్) అయితే నెక్ట్స్ లెవల్ కామెడీ పండించాడు. ఈ సిరీస్‌లోని ఆరు ఎపిసోడ్లు పదేపదే చూడాలనిపించేలా స్టోరీ రాశారు.
ఎపిసోడ్లో నెటిజన్లు కనెక్ట్ అయిన డైలాగులు:
➼ జీయో, ఎయిర్‌టేల్ వాడు కూడా బీట్ చేయలేని ప్లాన్ వచ్చింది..ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి 😃
➼ ఇప్పుడు ఆర్టీసీ ఓపెన్ చేసి వైజాగ్‌కు ట్రైన్లు ఎప్పుడు ఉన్నాయో చూడు.. 😂
➼ ఫ్యూచర్లో మావా అని పిలవాలి కాబట్టి సరిపోయింది.. లేకపోతే కుర్చి మడత పెట్టి మింగేవాడిని.. 😃
➼ వీడి బుద్ధిలే వీడి కొడుకుకు వచ్చినట్టున్నాయి.. అతికినట్టుగా అబద్దాలు ఆడేస్తున్నారు.. 😝
➼ అదేమైన కులాయా ఏంటమ్మ అంతసేపు పోసుకోవడానికి? శులభ్ కంప్లెక్స్ అయితే సులభంగా ఉంటుంది.. 😹
➼ కుటుంబం కుటుంబం రావడానికి ఇక్కడ ఏమైనా భోజనాలు పెడుతున్నారా (బాత్ రూం వద్ద సీన్).. 🙉
➼ ఆవకాయ కోసం అవకాశం కోసం వెయిట్ చేయకూడదు బ్రో.. మనమే క్రియేట్ చేసుకోవాలి లేకపోతే బద్దే మిగులుద్ది బ్రో.. 🤣
➼ ఆవాలు మీద కాలేసి ఇవాళ సాయంత్రం జారిపడి పోయిందట 🙄
ఇక ఎపిసోడ్ లాస్ట్‌లో కోమలి భీమలి కాకుండా విజయనగరం వచ్చేసినట్టు చూపించారు. అటు ఈ సిరీస్ విలన్ పెంటారెడ్డి పగ ఇంకా చల్లారలేదంటూ ఎపిసోడ్‌ని ముగించారు. అంటే ఫ్యూచర్లో ఈ సిరీస్ పార్ట్-2 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట!











