కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు.. అన్నివేళల తోడునీడగా ఉంటారు.. కష్టాల్లో సాయం చేస్తారు.. ఆపదలో ఆదుకుంటారు.. కానీ వాళ్లకి దక్కనది మనకి దక్కితే తట్టుకోలేరు.. ముఖం మాడ్చుకుంటారు.. మౌనంగా ఉండిపోతారు.. లోలోపల ఏడుస్తారు.. ఇదో వెరైటీ టైప్ ఆఫ్ మైండ్‌సెట్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని చూసి కొంతమంది ఇలానే గుసగుసలాడుకుంటున్నారు. చంద్రయాన్-3 సక్సెస్ అవ్వడం అయ్యాగారికి ఏం ఇష్టం లేనట్టుంది.. ఎందుకంటే మూడు రోజుల ముందే కదా రష్యా లూనా-25 అస్సాం అయ్యింది. ఇండియా కంటే ముందుగా జాబిల్లిపై కాలు మోపాలని భావించిన పుతిన్‌కి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.. నిజానికి అంతరిక్ష ప్రయోగాలు సక్సెస్ అయినా అవ్వకపోయినా చేసిన ప్రయత్నానికి అభినందించాల్సిందే. ఇదే స్పోరిటివ్నెస్. కానీ రష్యా మాత్రం ఈ విషయంలో కాస్త కుళ్లుబోతుతనం చూపించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అసలు కవరేజే లేదు:
ఇస్రో సాధించిన విజయాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఓవైపు అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌ని కీర్తిస్తుంటే.. మరోవైపు రష్యా మాత్రం అసలు కవరేజీ ఇవ్వలేదు. అంతర్జాతీయ వార్తా వెబ్సైట్లలో బ్యానర్ ఐటెమ్‌గా కనిపించిన మన ఇస్రో విజయం.. రష్యా బ్లాగుల్లో చాలా సేపటివరకు అసలు హోం పేజీలోనే కనపడలేదు. RT(Russia Today)లో మాత్రం ల్యాండింగ్ జరిగిన గంట తర్వాత వార్త కనిపించింది. అది కూడా మొక్కుబడిగా పబ్లిష్ చేసినట్టు ఉందని వెస్ట్రర్న్ మీడియా అంటోంది. మరోవైపు దొరికిందే ఛాన్స్ అని రష్యాకి చురకలంటిస్తూ యూకే మీడియా పలు వార్తలను ప్రచురించింది. mirror.co.uk పుతిన్ ఓడిపోయాడంటూ లీడ్ పెట్టింది.
నిజానికి ఇండియా-రష్యా చాలా మంచి స్నేహితులు. ప్రతి విషయంలోనూ కలిసి అడుగులు వేసే దేశాలు. ఇటివలి కాలంలో అమెరికాతోనూ ఇండియా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నా.. రష్యా మాత్రం ట్రెడిషనల్‌గా ఇండియాకి మంచి ఫ్రెండ్. రష్యా-ఇండియా బంధం చాలా గట్టిది. లూనా-24 తుది మెట్టుపై బోల్తా పడడంతో పాటు.. ఇటివలి కాలంలో రష్యా అంతరిక్షంలో వెనకపడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. స్పేస్ పరంగా ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడంతో ఏకంగా ఎంక్వైరీలు కూడా వేయించింది పుతిన్ సర్కార్. ఇటు చంద్రుడి దక్షిణ ధృవంపై ఇండియా కాలు మోపిన తొలి దేశంగా నిలవడం.. ఇస్రో కంటే ముందుగా జాబిల్లిపై అడుగుపెట్టాలని భావించిన రష్యా మిషన్ ఫెయిల్ అవ్వడం పుతిన్‌ని కాస్త అప్సెట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
Chandrayaan-3: చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీళ్లే.. నిజంగా గ్రేట్ భయ్యా!
People behind Chandrayaan mission success: చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయ్యింది. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు మోపిన ల్యాండర్ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మరే దేశం కూడా చంద్రుడి దక్షిన ధృవంపై కాలు మోపలేదంటే తాజాగా ఇస్రో సాధించిన గెలుపు ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ చంద్రయాన్-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో సైంటిస్టులు తాజాగా చంద్రయాన్-3తో గెలుపు రుచి చూడడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. దేశంలోని ప్రతి పౌరుడు ఇస్రో విజయాన్ని సగర్వంగా చెప్పుకుంటున్నాడు. స్వీట్లు పంచుకుంటున్నారు.. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. ఈ ఒక్క గెలుపుతో ఇండియాలో హ్యాపీనెస్ ఇండెక్స్ ర్యాంక్ పెరిగే ఉంటుంది.. దేశం మొత్తాన్ని ఇంత ఆనందపరిచిన చంద్రయాన్-3 ప్రయోగం వెనుక హీరోలు ఎవరు?
Somnath, chairman of #Isro and Team Dancing 🕺 and celebrating !! #Chandrayaan3 #IndiaOnTheMoon pic.twitter.com/iCQATRv0nd
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) August 23, 2023
ఎస్ సోమనాథ్, ఇస్రో చైర్మన్:
చంద్రయాన్ -3 మిషన్ వెనుక వారిలో అందరి కంటే టాప్ ఇస్రో చైర్మన్ సోమనాథ్. గతేడాదే ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ బాధ్యతలు స్వీకరించారు. చంద్రయాన్-3తో పాటు, గగన్‌యాన్, ఆదిత్య-ఎల్1తో సహా ఇస్రో ఇతర మిషన్ల వెనుక సోమనాథ్ పాత్ర వెలకట్టలేనిది.
ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు.. సోమనాథ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్‌గా, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో పనిచేశారు.
వీరముత్తువేల్, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్:
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వీరముత్తువేల్ 2019లో బాధ్యతలు స్వీకరించారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఆయన ఎక్స్పర్ట్. చంద్రయాన్-2 మిషన్‌లో కూడా కీలక పాత్ర పోషించారు. తమిళనాడులోని విల్లుపురంకు చెందిన వీముత్తువేల్.. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-M) పూర్వ విద్యార్థి. నాలుగు సంవత్సరాలుగా చంద్రయాన్-3 మిషన్ కోసం చాలా కష్టపడ్డారు.
ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, VSSC డైరెక్టర్:
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC)లో ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ టీమ్ చంద్రయాన్-3 విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. VSSCలోని ఆయన బృందం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) మార్క్-3ని అభివృద్ధి చేసింద. దీనికి ఇప్పుడు లాంచ్ వెహికల్ మార్క్-III అని పేరు పెట్టారు. డాక్టర్ ఉన్నికృష్ణన్ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజనీర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC) పూర్వ విద్యార్థి.
శంకరన్, U R రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్:
URSC డైరెక్టర్‌గా జూన్ 2021లో బాధ్యతలు స్వీకరించారు. దేశీయ ఉప్రగ్రహాలను డెవలప్ చేసి ఇస్రోకి ఇవ్వడంలో URSC సాయం చేస్తుంది.
శంకరన్ నాయకత్వంలో URSC టీమ్ కమ్యూనికేషన్, వాతావరణ సూచన, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్ గ్రహాల అన్వేషణతో సహా ఇస్రో అవసరాలను తీర్చగల ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తుంది.
మోహన్న కుమార్, మిషన్ డైరెక్టర్:
మోహన్న కుమార్ LVM3-M4/చంద్రయాన్-3 కోసం మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త. మోహన్న కుమార్ గతంలో LVM3-M3 మిషన్‌లో వన్ వెబ్ ఇండియా-2 ఉపగ్రహాల ప్రయోగానికి డైరెక్టర్‌గా ఉన్నారు.
MUST WATCH
We RT many speeches, but this one is special.
Speech by Mr. M Shankaran after successful Landing of #Chandrayaan3
Listen to the man who led the Mission and has been pivotal to it’s success along with his entire #ISRO team
INDIA successfully soft landed on the Moon… pic.twitter.com/U9M1Jkg6tn
— AAP Ka Mehta 🇮🇳 (@DaaruBaazMehta) August 23, 2023
రాజరాజన్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చీఫ్:
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR) డైరెక్టర్‌గా రాజరాజన్ ఉన్నారు.SHAR డైరెక్టర్‌గా, ఇస్రో లాంచ్‌లు, హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ , SSLV లాంచ్‌ల వెనుక ఉన్నది రాజరాజనే.
ఇలా చంద్రయాన్-3 ల్యాండర్‌పై కాలు మోపడం వెనుక అనేక మంది ఉండగా.. ఈ ఆరుగురి పాత్ర మాత్రం వెలకట్టలేనిది.
#Chandrayaan3 project director P Veeramuthuvel’s father turned emotional watching the successful landing of Vikram lander on the Moon’s surface. pic.twitter.com/BzylL4F9oj
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2023
Chandrayaan-3: ఇదిరా ఇండియా అంటే.. ఇస్రోని ఆకాశానికి ఎత్తేసిన అంతర్జాతీయ మీడియా!
International media applauds india’s chandrayaan-3 victory: ఇప్పటివరకు ఒక్క లెక్క ఇప్పటి నుంచి ఒక్క లెక్క.. ఇండియా లెవలే మారిపోయింది బాసూ.. చంద్రయాన్-3 సాధించిన విజయం గురించి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కీర్తిస్తున్న విధానం చూస్తే కాలర్ ఎగురేసుకోకుండా ఉండలేము. యాంటి ఇండియా స్టాండ్ తీసుకుంటుందని నిత్యం విమర్శలు ఎదుర్కొనే ‘అల్ జజీరా’ సైతం తమ వెబ్సైట్ బ్యానర్ ఐటెమ్‌గా చంద్రయాన్ సాధించిన విజయం గురించే పోస్ట్ చేసుకున్నదంటే అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇది చాలా మంచి విషయం. సైన్సు పరంగా ఏ దేశం గెలిచినా అందరూ అంగీరించడం స్వాగతించదగ్గ పరిణామం.
వివిధ అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వచ్చిన బ్యానర్ ఐటెమ్స్‌పై ఓ లుక్కేయండి:










ఇండియాతో మాములుగా ఉండదు మరి:
చంద్రయాన్-3 విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రోపై ప్రసంశల వర్షం కురుస్తోంది. అమెరికా, యూకే, అరబ్ దేశాల మీడియా సంస్థలు ఇస్రో సాధించిన విజయాన్ని కొనియాడుతున్నాయి. ఇది స్వాగతించదగ్గ విషయమని.. సైన్స్ పరంగా ఏ దేశం అభివృద్ది సాధించినా అది మొత్తం మానవాళికే మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచదేశాల నుంచి ఈ విధమైన స్పారిటివ్నెస్ని ఇండియా కూడా ఊహించలేదనే చెప్పాలి. ఎందుకంటే అంతరిక్షంలోనూ తమదేశమే ముందుండాలి అగ్రరాజ్యాలు భావిస్తుంటాయి. రేసులో తామే ఫస్ట్ ఉండాలని ప్రయత్నిస్తుంటాయి.. దక్షిణ ధృవంపై ల్యాండర్ కాలు మోపడం అంటే చిన్నాచితక విషయం కాదు.. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా.. ఇలా దాదాపు అన్ని దేశాలు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాయి. ఇండియా మాత్రం జాబిల్లి దక్షిణ ధృవంపై సగర్వంగా కాలు మోపింది. వడివడి అడుగులు వేసుకుంటూ రోవర్ జాబిల్లి నేలను తాకింది. ఇది ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంతకముందు సాధ్యం కాలేదు. అన్ని రంగాల్లోనూ.. సైన్స్‌లోనూ.. శాస్త్రసాంకేతిర రంగంలోనూ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు సైతం ఇది సాధ్యపడలేదు. ఇస్రో మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులను సృష్టిస్తూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని సక్సెస్ చేసింది.
Chandrayaan-3: దటీజ్ ఇస్రో… చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్
Chandrayaan-3 lands on moon surface: దేశమంతా సంబురాలు మొదలయ్యాయి.. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది.. పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లల మారి కేరింతలు కొడుతున్నారు.. చంద్రయాన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది.. ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపింది.. రోవర్ వడివడిగా అడుగులేసుకుంటూ చంద్రుడి నేలను తాకింది.. కోట్ల మంది కళ్లలో వెలుగులు.. కాలర్ ఎగరేసుకునే గర్వం.. ఇదేరా ఇండియా అని చెప్పుకునే ఆనందం.. మొత్తానికి దటీజ్ ఇస్రో అని ప్రపంచమంతా అనుకునేలా చేశారు సైంటిస్టులు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలమిది.
చంద్రయాన్-2 ఓటమితో కుంగిపోలేదు.. బాధపడ్డారు.. ఆ బాధలో నుంచే కసి పుట్టింది. చంద్రయాన్-3కి ఇస్రో సైంటిస్టులు శ్రీకారం చుట్టారు.. ప్రాణంపెట్టి పనిచేశారు.. ఓటమి రుచి చవి చూడని వారికి గెలుపు రుచి తెలియదంటారు కదా.. ఇస్రో శాస్త్రవేత్తల ఆనందం చూస్తే ఇప్పుడా విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. అంతా చిన్నపిల్లల మారిపోయారు.. ఈ రోజు కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటున్న వారి కంటి నుంచి కన్నీళ్లు తన్నుకొచ్చాయి..ఇవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు.. చంద్రయాన్-2 సమయంలో చివరిమెట్టుపై బోల్తా పడినప్పుడు వచ్చిన కన్నీళ్లు కావు ఇవి.. ఇది ఇస్రో సైంటిస్టుల గెలుపు.. వారి కష్టానికి దక్కిన గౌరవం. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశం మనదేనని 140 కోట్ల ప్రజలు సగర్వంగా చెప్పుకుంటారంటే అది కేవలం ఇస్రో సాధించిన విజయం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి మానవ నిర్మిత ప్రోబ్ కూడా మనదే!
దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కూడా ఇస్రోదే. దేశ ప్రధాని నుంచి సాధారణ పౌరుల వరకు.. విద్యార్థులు, ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించారు. టీవీలకు అతుక్కుపోయారు. దేశం అంతా ఏకమయ్యే క్రికెట్ మ్యాచ్‌ని మించి ఓ అంతరిక్ష ప్రయోగం గురించి ప్రతిఒక్కరూ తమ షెడ్యూల్‌లను మార్చుకున్నారంటే ఇస్రో గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతోంది. కుల, మత బేధాలు మరిచి అందరూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రోడ్లపైకి స్వీట్లు పంచుకుంటున్నారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా దేశమంతా ఏకం కావడం.. ఆనందంలో మునిగిపోవడం చూసి ఏళ్లు దాటిపోయాయి.. ఇదంతా ఇస్రో వల్లే సాధ్యమైంది.. దటీజ్ ఇస్రో..జయహో ఇండియా!
Jobs: SSC నుంచి మరో నోటిఫికేషన్ అవుట్.. డీటైల్స్ చెక్ చేసుకోండి!
SSC JHT 2023 notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్ 12తో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. అధికారిక వెబ్సైట్ (ssc.nic.in) నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 307 పోస్టులను భర్తీ చేస్తుంది. ముఖ్యమైన తేదీలు, ఖాళీ వివరాలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలను చెక్ చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 22
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 12
కరెక్షన్ విండో: సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 14, 2023 వరకు
పేపర్-1 పరీక్ష: అక్టోబర్ 2023
ఖాళీ వివరాలు:
➼ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 21 పోస్టులు
➼ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 13 పోస్టులు
➼ జూనియర్ ట్రాన్స్‌లేటర్: 263 పోస్టులు
➼ సీనియర్ ట్రాన్స్‌లేటర్: ఒక పోస్ట్
➼ సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 9 పోస్టులు
ఫీజ్:
దరఖాస్తు రుసుము రూ.100. రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), PwBD, మాజీ సైనికులకు చెందిన మహిళా అభ్యర్థులుకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. BHIM UPI, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఆన్లైన్ చెల్లింపు మోడ్ల ద్వారా మాత్రమే ఫీజు చెల్లించవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
• SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి click here
• దరఖాస్తు(Application)పై క్లిక్ చేయండి
• ఇది మిమ్మల్ని కొత్త విండోకు తీసుకెళ్తుంది, ఇక్కడ మీరు ‘SSC JHT’ని సెలక్ట్ చేసుకోవాలి.
• ఇప్పుడు, ‘SSC JHT 2023’ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి
• ముందుగా ప్రాథమిక వివరాల(basic details)తో రిజిస్టర్ చేసుకోండి
• దరఖాస్తు ప్రక్రియను కొనసాగించండి
• డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయండి.
• దరఖాస్తు రుసుము చెల్లించండి.
• భవిష్యత్ సూచన కోసం కాపీని ప్రింటవుట్ తీసుకోండి.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను కలిగి ఉంటుంది. పేపర్-2 డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుంది. పేపర్-1లో ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
ISRO: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్స్.. అప్లై చేసుకోండి!
ISRO Free Course: ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష ప్రయోగాలకు పెట్టింది పేరైన రష్యాకే సాధ్యంకాని ఘనతలను సాధిస్తోంది భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో. చంద్రయాన్-3(chandrayaan-3) ప్రయోగం సక్సెస్ అయ్యేందుకు టైమ్ దగ్గరపడింది. మరోవైపు అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన అందరికి ఉంటుంది. స్పేస్ విషయాలను నెట్లో సెర్చ్ చేసే శోధించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అసలు రాకెట్లు, శాటిలైట్లు లాంటివి కనపిస్తే చాలు ప్రజలు ఆ విషయం గురించి తెలిసినా తెలియకపోయినా వాటి లింకులపై క్లిక్ చేస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు అంతరిక్ష విషయాలపై నాలెడ్జ్ పెంచుకోవాలన్న తపన ఉంటుంది. అలాంటి వారికి ఇస్రో గుడ్‌న్యూస్ చెప్పింది.
• అక్టోబర్‌లో కోర్సు:
అంతరిక్ష పరిస్థితులపై అవగాహన కోసం మూడు రోజుల పాటు విద్యార్థుల నుంచి ఇస్రో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 12, 13, 14 తేదీలలో బెంగుళూరులోని ISRO ప్రధాన కార్యాలయంలో ఈ కోర్సు నిర్వహించనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలతో సెషన్లను ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సుకి అప్లై చేసుకోవచ్చు. ఇక సైన్స్ ఫిల్డ్లోనే పనిచేస్తున్న పరిశోధకులు, అధ్యాపకుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తోంది ఇస్రో.
అంతరిక్ష రంగంలో పనిచేయాలని ఆశించే విద్యార్థులు, కంపెనీ, ఏజెన్సీ లేదా స్టార్టప్లకి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. స్పేస్ సిట్యువేషనల్ అవేర్నెస్ అండ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కీలకమైన అంశంగా ఈ కోర్సును అందిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. మానవ నైపుణ్యం, కక్ష్య(orbit) సమాచారం కోసం రాడార్లు, టెలిస్కోప్‌లు, అంతరిక్ష-ఆధారిత ప్లాట్‌ఫామ్స్ గురించి విద్యార్థులకు సైంటిస్టులు చెబుతారు.
• ఇస్రో ఉచిత కోర్సు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
కాలేజీలు, యూనివర్శిటీలు లేదా ఇన్స్టిట్యూట్ల నుంచి కింది కోర్సులను అభ్యసిస్తున్న ఇండియన్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
‣ 4వ సంవత్సరం చదువుతున్న బీఈ లేదా బీటెక్ విద్యార్థులు.
‣ అన్ని శాఖలకు చెందిన ఎంఈ(ME), ఎంటెక్(MTech), ఎమ్మెస్సీ(MSc) విద్యార్థులు.
‣ పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ పీహెచ్డీ విద్యార్థులు లేదా రీసెర్చ్ స్కాలర్లు
‣ భారతీయ విద్యాసంస్థల ఫ్యాకల్టీ సభ్యులు.
మూడు రోజుల కోర్సులో మొత్తం 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కోసం పాల్గొనేవారిని ఎంపిక చేయడానికి ఆన్లైన్ క్విజ్ నిర్వహించవచ్చు. క్విజ్‌తో పాటు, ఎంపిక ప్రక్రియ కోసం విద్య అర్హతను కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
• ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఆగష్టు 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల ఫలితాలు సెప్టెంబర్ 12న ప్రకటిస్తారు. ఆన్లైన్ క్విజ్ సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారు. లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తారు. క్విజ్‌లో అంతరిక్ష పరిస్థితుల అవగాహనపై 20 ప్రశ్నలు ఉంటాయి, వాటిని పది నిమిషాల్లో సమర్పించాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి.











