Andhra Pradesh Assembly Highlights: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు(Andhra Pradesh) ప్రారంభమయ్యాయి. సభ అలా మొదలైందో లేదో.. రచ్చ రచ్చ నడుస్తోంది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ(TDP) నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. పోడియం దగ్గరకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
విపక్ష నేతల ఆందోళనలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై చర్చకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుందామన్నారు. ప్రతిసారి అర్థంపర్థం లేని వాయిదా తీర్మానం ఇచ్చి సభను అడ్డుకోవాలనుకోవడం సరికాదంటూ టీడీపీ సభ్యులకు చురకలంటించారు మంత్రి బుగ్గన. ప్రభుత్వం వేసే ప్రశ్నలకు టీడీపీ వాళ్ల దగ్గర సమాధానం ఉంటుందా అని ప్రశ్నించారు బుగ్గన.
బాలకృష్ణకు అంబటి రాంబాబు వార్నింగ్..
అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై దాడికి యత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఓ ఎమ్మెల్యే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంబటి. జాగ్రత్త.. ఇబ్బందులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ ఇక్కడ మీసం మెలేయడం కాదు.. దమ్ముంటే రా చూసుకుందాం అంటూ బాలకృష్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.











