భారత్‌లోని అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను మంగళవారం మరింత బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఆ తుపాను ప్రభావంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వర్లీ తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశగా జుహు బీచ్‌వైపు రాకాసి అలలు దూసుకొస్తున్నాయి. దీంతో ముంబై కోస్ట్ గార్డు అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ ప్రదేశానికి వచ్చే పర్యాటకులు బీచ్ వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బీచ్‌కు వెళ్లే దారుల్లో భారీగా కోస్ట్ గార్డు సిబ్బందిని మోహరించి పర్యాటకులను తిరిగి పంపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ముంబై నగరంపై ఆకాశం మేఘావృతమై ధట్టమైన మోఘాలతో అలుముకుని ఉన్నదని, నగర శివార్లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
తుఫాను ప్రభావంతో ఇవాళ ముంబై తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు నగరంలోగానీ కొన్ని ప్రాంతాల్లోని శివారల్లో ఎండ, ఉక్కపోతతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ముంబై ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఇదిలా వుంటే బిపర్జాయ్ తుఫాను ముంబై వైపు కాకుండా ఉత్తర దిశగా కదులుతూ గుజరాత్ రాష్ట్రం వైపు తిరిగినట్లు ఐఎండీ మ్యాపుల ద్వారా వెల్లడించింది.











2022-23 సంవత్సరం అన్నీ చిత్ర పరిశ్రమలకు అంతగా కలిసి రావట్లేదనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ నుండి మాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరకు వరుసగా హఠాన్మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండు నెలల్లోనే అనేక మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్ విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ వంటి నటులు ఇటీవలే తుది శ్వాస విడిచారు. కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ మరణించారు. మాలీవుడ్ నటుడు హరీష్ పెంగన్ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు లేరన్న వార్త అటు టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను శోక సంద్రంలో ముంచేసింది.


