జైల్లో చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Pawan Kalyan) స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health) విషయంలో వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆయన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. చంద్రబాబు వయస్సును దృష్టిలో ఉంచుకుని.. ఆయన ఆరోగ్య స్థితిగతులపై మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Chandrababu Case: చంద్రబాబుకు జైలులో ఏసీ.. ఏసీబీ జడ్జి సంచలన ఆదేశాలు
ఈ విషయంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి అవలంభించడం సరికాదన్నారు జనసేనాని. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేస్తే.. ప్రభుత్వ సలహాదారులు, అధికారులు చేసిన వాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రకటన విడుదల చేశారు.
శ్రీ @ncbn గారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Nlq3u9U35K
— JanaSena Party (@JanaSenaParty) October 15, 2023
వైద్యుల నివేదికను ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్ తన లేఖలో కోరారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.













