Pooja Hegde Birthday Pics Viral: బాలీవుడ్ నుంచి వచ్చి మళ్ళీ బాలీవుడ్ కే వెళ్ళిపోయింది పూజా హెగ్డే. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోల పక్కనా నటించిన ఈమె తన ఖాతాలో మాత్రం పెద్దగా హిట్ లను వేసుకోలేకపోయింది. కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న పూజా మళ్ళీ బాలీవుడ్ లో బిజీ అవుతోంది. తాజాగా షాహిద్ కపూర్ పక్కన సినిమా చేస్తోంది. పూజా హెగ్డే పుట్టినరోజును ఆన్ లొకేషన్ సెలబ్రేట్ చేస్తూ షాహిద్ టీమ్ పూజకు గ్రాండ్ వెల్కం చెప్పింది. షాహిద్ కపూర్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, దర్శకుడు రోషన్ ఆండ్రూస్‌తో కలిసి తన కొత్త చిత్రం సెట్స్‌లో బర్త్ డే బేబి పూజా ఉల్లాసంగా గడిపారు. సెట్స్ పైకి పూజా హెగ్డేని స్వాగతిస్తూ, రాయ్ కపూర్ ఫిల్మ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ప్రయాణంలో బర్త్ డే బేబీ పూజా మాతో చేరడంతో థ్రిల్లింగ్ యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ మరింత ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతోంది. మా లవ్లీ లీడింగ్ లేడీకి సంతోషకరమైన రోజు శుభాకాంక్షలు! అని అందులో రాసారు. ఇందులో పూజా హెగ్డే కేక్ కట్ చేస్తున్న పిక్ ని కూడా జత చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read:ఇండియా వర్సెస్ పాక్.. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్..!
పూజా హెగ్డే తన పుట్టినరోజు వేడుకలను ఇన్‌స్టా ఫీడ్‌లో షేర్ చేసింది. ఇందులో పూజా బీచ్ లొకేషన్ ని ఆస్వాధిస్తున్న ఫోటోలు వేడి పెంచాయి. అంతకుమించి పూజా టూపీస్ లుక్ వాటిని మరింత పెంచింది. దీంతో పాటు పూజ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్‌ను షేర్ చేసింది. ఇందులో షాహిద్ కపూర్ పూజాను చిన్న కేక్ ముక్కను అడిగాడు. పూజా హెగ్డే చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో కనిపించింది.
View this post on Instagram













