బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి. బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు. కేసీఆర్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మరన్నారు. తాను పర్యటిస్తున్న గ్రామాల్లోని మహిళలు కేసీఆర్ చెప్పే మాటలను నమ్మడంలేదని తనతో స్వయం చెబుతున్నారన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామంటున్న ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆర్టీవీకి ఇచ్చి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం.
Supreme court: 26 వారాల అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!
అబార్షన్ పిటిషన్ దేశ అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. బతికే అవకాశాలున్న పిండాన్ని తాము చంపలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఓ మహిళకు 26వారాల అబార్షన్ కు అనుమతి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని న్యాయస్థానం ఈ సంచలన తీర్పును ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషన్ అనుమతి కోరుతున్నారా అంటూ సీజేఐ ప్రశ్నించారు. బతికేందుకు అవకాశాలున్న ఉన్న పిండాన్ని తాము చంపలేమని స్పష్టం చేశారు.
అసలు ఈ కేసు ఏంటంటే…
ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చేరుకుంది. మెడికల్ అబార్షన్ కేసులో జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అబార్షన్ కు అనుమతి ఇచ్చింది. అబార్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మానసికంగా, ఆర్థికంగా, మూడో బిడ్డను కనే పరిస్థితి లేదని, డిప్రెషన్‌తో బాధపడుతోందని గుర్తించిన సుప్రీంకోర్టు సోమవారం ఆమె గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు అక్టోబర్ 9న అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది.
ఇది కూడా చదవండి: సేమ్ సెక్స్ వివాహాలకు ఓకే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
తల్లిహక్కుతోపాటుగా గర్భస్థ శిశువ హక్కుల మధ్య సమతుల్యం పాటించాలని..ఆ పిండం సజీవంగా ఉందని పేర్కొంది. ఆ పిండం గుండె చప్పుడును ఆపమని ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ బిడ్డను మేము చంపలేమంటూ వ్యాఖ్యానించింది. దీంతో కోర్టు అబార్షన్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం ఈ సంచలన తీర్పును ఇచ్చింది. మహిళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
అబార్షన్‌పై దేశ చట్టం ఏం చెబుతోంది?
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం, గర్భం రద్దు చేయడానికి గరిష్ట పరిమితి 24 వారాలు కావడం గమనార్హం. వివాహిత స్త్రీలు, అత్యాచార బాధితులు, వికలాంగులు, మైనర్లు వంటి ఇతర బలహీన మహిళలతో సహా ప్రత్యేక వర్గాల మహిళలకు అబార్షన్లు చేయడానికి మెడికల్ బోర్డు, కోర్టు అనుమతి అవసరం.
AP Mega Job Mela: ఏపీలో మెగా జాబ్ మేళా.. 20కి పైగా కంపెనీల్లో వేయికి పైగా జాబ్స్.. ఎల్ఐసీ, యూనియన్ బ్యాంక్ తో పాటు..!!
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఈ కంపెనీల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను అక్టోబర్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9.00గంటల నుంచి నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సెలక్ట్ అయిన అభ్యర్థులు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. సెలక్ట్ అయినవారికి అదే రోజు నియామక పత్రాలు కూడా అందిస్తారని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. ఐడీబీఐ బ్యాంక్ లో ట్రైనింగ్ తో పాటు జాబ్స్.. వివరాలివే!
ఈ జాబ్ మేళాలో యూనియన్ బ్యాంక్, ఎల్ఐసీతోపాటు మొత్తం 20కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వహకులు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోనివారు నేరుగా వేదిక వద్దకు వచ్చి జాబ్ మేళాలో పాల్గొనవచ్చని సూచించారు.
మెగా జాబ్ మేళా వేదిక: షాదీఖానా ఫంక్షన్ హాల్, డి.నెంబర్ 3-14-48, పట్టాభిపురం, గుంటూరు.
ఇది కూడా చదవండి: మహిళా ఎంపీతో శశిథరూర్.. ఫొటోలు వైరల్..! అసలేం జరిగిందంటే?
మరిన్ని వివరాల కోసం జాబ్ నిర్వాహకులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.
పీ.వీ మణిదీప్ – 8074607278
బి. రవికుమార్ – 6304292828
డి. రాజా- 7893789361
ఈశ్వర్ రావు – 88978 49174
APSSDC హెల్ప్ లైన్ నెంబర్ – 9988853335
@AP_Skill has Conducting Job Mela at Shadi Khana Function Hall #Pattabhipuram @CollectorGuntr
Registration Linkhttps://t.co/5Ies8JJ25m
Contact
P.V. Manideep – 8074607278
B .RaviKumar – 6304292828
D. Raja – 7893789361
Eswarrao – 88978 49174
APSSDC Helpline – 9988853335 pic.twitter.com/gUSnyvvPpl— AP Skill Development (@AP_Skill) October 13, 2023
IDBI Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. ఐడీబీఐ బ్యాంక్ లో ట్రైనింగ్ తో పాటు జాబ్స్.. వివరాలివే!
IDBI Recruitment 2023: బ్యాంకులు పీవో ఉద్యోగాలు ఎక్కువగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (PGDBF)ద్వారా భర్తీ చేస్తుంటారు. అయితే బ్యాంకుల్లో కొన్ని ప్రత్యేక సేవలందించేందుకు సాధారణ గ్రాడ్యుయేట్లకు ఉండే ప్రావీణ్యం సరిపోదు. వీటికోసం ఏడాదికోర్సుతో కూడిన ఉద్యోగాలకు బ్యాంకులు విడిగా ప్రకటనలు రిలీజ్ చేస్తుంటాయి. తాజా గ్రాడ్యుయేట్లు వయస్సు తక్కువ ఉన్నవారు ఈ విధానంలో చేర్చేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలా అవకాశం వచ్చినవారు పీజీ డిప్లొమా తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో ఏడాది కోర్సు ఆన్ లైన్ ద్వారా పూర్తి చేస్తారు. అనంతరం ఎంబీఏ పట్టా అందుకే ఛాన్స్ కూడా ఉంటుంది. నియామకానికి ముందు పరీక్షను నిర్వహిస్తారు. అందులో అర్హులను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ రెండింటిలో ప్రతిభ కనబర్చిన అభ్యర్తులను కోర్సులోకి తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: మహిళా ఎంపీతో శశిథరూర్.. ఫొటోలు వైరల్..! అసలేం జరిగిందంటే?
ఆన్ లైన్ విధానం ద్వారా పరీక్ష మొత్తం 200మార్కులకు ఉంటుంది. ప్రతిప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమయం 2గంటలు. సమాధానం తప్పుగా పేర్కొంటే పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ లో 60 ప్రశ్నలు, ఇంగ్లీష్ 40 ప్రశ్నలు, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 40 ప్రశ్నలు, జనరల్, ఎకానమీ బ్యాంకింగ్ అవేర్ నెస్ విభాగంలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిని ఆబ్జెటివ్ రూపంలో అడుగుతారు.
ఇందులో కనీస మార్కులు పొందినవారిని ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు. ఇందులో మెరిట్, రిజర్వేషన్, విభాగాలవారీగా జాబితాను సిద్దం చేస్తారు. ఇంటర్వ్యూలో 100మార్కులు ఉంటాయి. ఇందులో 50 మార్కులు తప్పనిసరిగా పొందాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగులు 45 మార్కులు పొందాలి. ఇలా అర్హత సాధిస్తే…ఫైనల్ కు సెలక్ట్ అవుతారు.
కోర్సులో ప్రతినెలా రూ. 5వేల చొప్పున మొదటి ఆరు నెలలు చెల్లిస్తారు. తర్వాత నెలకు రూ. 15వేల చొప్పున ఇంటర్న్ షిప్ లో ఇస్తారు. చివరి 4 నెలలు బ్యాంకులో వ్రుత్తిగత ట్రైనింగ్ ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేస్తే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో ఏడాదికి రూ. 6.5లక్షల వేతనం చెల్లిస్తారు. అలవెన్సులు కూడా ఉంటాయి.
ఖాళీలు: 600
రిజర్వ్డ్ 243,
ఓబీసీ 163,
ఎస్సీ 90,
ఎస్టీ 45,
ఈడబ్య్లుఎస్ 60
విద్యార్హత:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు :
ఆగస్టు 31,2023నాటికి 20 నుంచి 25ఏళ్లలోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు.
ఆన్ లైన్ పరీక్ష తేదీ: అక్టోబర్ 20
తెలుగురాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, విజయవాడ.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు రూ. 200, మిగిలినవారు 1000చెల్లించాల్సి ఉంటుంది.
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికలు.. ఓటు దరఖాస్తుకు, అడ్రస్ మార్పుకు చివరి ఛాన్స్.. వివరాలివే!
Telangana Elections 2023: ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలనుకునే వారు అక్టోబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం (Election Commission) హైకోర్టుకు తెలిపింది. 2019 సార్వత్రికఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ తో కూడిన ధర్మాసనానికి ఈసీ ఈ విషయాన్ని తెలియజేసింది. నాంపల్లి అసెంబ్లీ నియోజవకర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టేలా ఈసీ అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది జుల్పాకర్ ఆలం కోర్టుకు తెలిపారు.
ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఇప్పటికే రివిజన్ చేపట్టి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించారని…అయితే నవంబర్ 10వ తేదీ నామినేషన్ చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాను సవరించవచ్చని దేశాయ్ తెలిపారు. ఈసీ మార్పులు చేయాలంటే ఈ తేదీకి కనీసం పదిరోుల ముందు దరఖాస్తు చేయాలని తెలిపాడు. ఒకవేళ పిటిషనర్ గడువుకంటే ముందే సవరణ కోసం ఈసీని ఆశ్రయించినట్లయితే…ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దరఖాస్తును చట్టానికి అనుకూలంగా వ్యవహరిస్తారని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ కోర్టు జ్యోక్యంతో కేసు నిలిపివేయలేరని…బెంచ్ పిటిషన్ ను కొట్టివేస్తూ పేర్కొంది.
ఇది కూడా చదవండి: పాస్ పోర్టు కావాలా? ఈ పని చేస్తే వారంల్లోగా మీ చేతుల్లోకి…!!
కాగా గ్రేటర్ హైదరాబాద్ నుండి 20వేల మందికిపైగా మరణించిన వ్యక్తులు కూడా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అర్హులుగా జాబితాలో పేర్లుఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ఈ పేర్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల గురించి కుటుంబ సభ్యులు ఎన్నికల అధికారులకు తెలియజేసి పేర్లను తొలగించాలని కోరినప్పటికీ సమస్య అలాగే ఉంది అనేక రాజకీయ పార్టీలు, కార్యకర్తలు ఓటర్ల జాబితాలలోని వ్యత్యాసాలను ఎత్తిచూపారు.గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుండి 20,000 మందికి పైగా మరణించిన వ్యక్తులు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సీనియర్ అధికారులు తెలిపారు. ఈ ఆవిష్కరణ ఓటింగ్ కోసం ఈ పేర్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.రాగెల్లి, బానూరు కుటుంబాలు, చనిపోయిన వారి బంధువులు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఉన్నారని నివేదించారు. తమ ఓట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు జాబితా నుంచి ఈ పేర్లను తొలగించాలని వారు అభ్యర్థించారు.
మీ ఓటర్ ఐడీని ఇలా సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోండి:
-ముందుగా మీరు http://voterportal.eci.gov.in/ లేదంటే https://www.nvsp.in/ వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి.
-మనుపు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ అవ్వండి. లేదంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
-లాగిన్ అయిన తర్వాత హోం పేజీలోకి వెళ్లి E-EPIC Download పై క్లిక్ చేయండి.
– E-EPIC నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రం పేరు ఎంచుకుని సెర్చ్ చేయాలి.
-తర్వాత ఓటీపీ పై క్లిక్ చేయాలి.
-ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
-ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై చేస్తుంది.
-తర్వాత క్యాప్చా కోడ్ ఎంట్ చేయాలి. E-EPIC పై క్లిక్ చేయండి.
-పీడీఎఫ్ ఫార్మాట్ లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు డౌన్ లోడ్ అవుతుంది.
Special Passport Drive : పాస్ పోర్టు కావాలా? ఈ పని చేస్తే వారంల్లోగా మీ చేతుల్లోకి…!!
Passport Drive : పాస్ పోర్ట్ సేవలను వేగంగా అందించేందుకు ఈనెల 14వ తేదీన ప్రత్యేక పాస్ పోర్టు డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజినల్ పాస్ట్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
పాస్ పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్ మెంట్ కోసం ఎంతోకాలం వేచి ఉండకుండా ఈ నెల 14వ తేదీని పాస్ పోర్టు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి దాసరి బాలయ్య పేర్కొన్నారు. బేగంపేట, అమీర్ పేట్, టోలిచౌకీ, నిజామాబాద్, కరీనంనగర్ లోని పాస్ పోర్టు సేవా కేంద్రాలు, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, వరంగల్ లోని పోస్టాపీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ తేదీ అపాయింట్ మెంట్స్ పాస్ పోర్టు వెబ్ సైట్లో త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
మీరు ప్రపంచయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? వీసా అనుమతుల కోసం వేచిఉండాల్సిన అవసరం లేదు. మీకు భారత్ పాస్ పోర్టు ఒక్కటి ఉంటే చాలు. ప్రపంచంలోని 59 దేశాల్లో వీసా అవసరం లేకుండా ఆన్ అరైవల్ తో పర్యటించవచ్చు. ఈ మేరకు హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ అనే సంస్థ 2023లో ప్రపంచంలోనే శక్తివంమైన పాస్ట్ పోర్టు లిస్టును రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వస్థానంలో నిలిచింది. గతేడాది ఈ ర్యాంకింగ్స్ లో భారత్ 83వ స్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి: మూడు కోర్టుల్లో చంద్రబాబు కేసుల మీద నేడు విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ











