సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో..
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎన్డీయే సమావేశంలో పాల్గొనడం, బీజేపీ పెద్దలను కలవడంపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే పవన్ ఢిల్లీలో దళారిగా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని తిట్టించిన వారి కోసం పవన్ ఇలా దళారిగా మారడం సిగ్గుచేటన్నారు. పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో అంటూ విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవి పెట్టిన భిక్షతోనే సినిమాలు, రాజకీయాల్లోకి వచ్చారన్నారు. చంద్రబాబుకు బానిసలా పవన్ పనిచేస్తున్నారని.. అందుకే ప్రజలు ఓట్లు వేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఏమో తానే సీఎం అంటారని.. ఢిల్లీ వెళ్లి అలాంటిదేమి లేదంటారని దుయ్యబట్టారు. కాపు సామాజిక వర్గం, జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్తగా పొత్తు పెట్టుకోవడానికి పార్టీలు లేక పవన్ కల్యాణ్ మళ్లీ టీడీపీ, బీజేపీలతోనే పొత్తు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.
రోజా.. వైసీపీ ప్యాకేజీ స్టార్ మహిళ..
రోజా విమర్శలపై జనసేన కార్యకర్తలు, వీరమహిళలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రోజాకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిన సిగ్గులేదని తిరుపతి జిల్లా జనసైనికుడు కిరణ్ రాయల్ విమర్శించారు. అప్పుల ఊబిలో ఉన్న రోజా.. ఇప్పుడు బెంగళూరు, చెన్నై నగరాల్లో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పవన్‌ను రోజూ తిడుతూ వైసీపీ దగ్గర ప్యాకేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బాలీవుడ్ నటి సన్నీలియోన్ రోజాను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. దమ్ముల గురించి మాట్లాడుతున్న వైసీపీ ప్యాకేజి స్టార్ రోజా.. త్వరలోనే వారాహి యాత్ర వస్తోంది రెడీగా ఉండు అని వార్నింగ్ ఇచ్చారు.
నీకు అన్ని రూ.కోట్లు ఎలా వచ్చాయి?
రోజా ఎటూ గాలి వీస్తే అటూ ఎగిరిపోయే ఆకు లాంటిదని ఘాటు విమర్శలు చేశారు జనసేన వీరమహిళలు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ఎలాంటి విమర్శలు చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. మీడియాలో హైప్ కోసమే పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. 20ఏళ్ల క్రితం పోర్న్ వీడియోల్లో నటించిన రోజా.. జనసేన వీరమహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మంత్రి అయిన తర్వాత రోజాకు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.










గాలె స్టేడియం వేదికగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ సరదా ఘటన ఆటగాళ్లతో పాటు ఆడియన్స్‌కు నవ్వులు తెప్పించింది. 120 ఓవర్లో రమేశ్ మెండిస్ వేసిన 5వ బంతి పాక్ బ్యాటర్ అబ్రార్ గ్లవ్ తాకి ప్యాడ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో లంక ప్లేయర్లంతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అయితే బంతి అబ్రార్ ప్యాడ్‌లో ఇరుక్కుపోయిన సంగతి గమనించిన వికెట్ కీపర్ సదీర సమరవిక్రమ.. బంతిని తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అబ్రార్ మాత్రం ముందుకు వస్తూ బంతి దొరక్కుండా క్రీజు నుంచి దూరం జరిగాడు. ఈలోపు బంతి కిందపడింది. స్టంప్ అవుట్ కాకుండా మళ్లీ వెంటనే క్రీజు వైపు పరిగెత్తాడు. ఈ సీన్ చూసిన ఇరు జట్ల ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అయితే నవ్వు ఆపుకోలేకపోయాడు.



