వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైల్లో పొగలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు రైలు అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు
Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
☛ చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై ఏసిబి కోర్ట్ లో వాదనలు
☛ మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
☛ హౌస్ అరెస్ట్, కస్టడీ పిటిషన్ పైన కాసేపట్లో విచారణ
☛ ఇప్పటికే ఏసీబీ కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ లూథ్రా
☛ కస్టడీ పిటిషన్‌పై సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
☛ ముందుగా హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై వాదనలు విననున్న న్యాయమూర్తి
☛ హౌస్ అరెస్ట్ కోరనున్న చంద్రబాబు న్యాయవాదులు
☛ కోర్టులో బెయిల్ తిరస్కరిస్తే.. హైకోర్ట్ లో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న చంద్రబాబు లాయర్స్
☛ NSG సెక్యూరిటీ కలిగి వివిఐపి గా ఉన్న చంద్రబాబును హౌజ్‌లో అరెస్ట్ చేయాలని కోరనున్న న్యాయవాదులు
☛ భద్రత కారణాల రీత్యా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరనున్న లూథ్రా
☛ పశ్చిమ బెంగాల్లో ఐదుగురు మంత్రులకు సంబంధించిన తీర్పులను ఉదహరిస్తున్న లూథ్రా
☛ 70 పేజీల తీర్పు కాపీలను ఏసీబీ కోర్టు న్యాయ మూర్తికి అందించనున్న లూథ్రా
☛ సుప్రీంకోర్టుకు సంబంధించి జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ..
☛ ఏసీబీ కోర్ట్ ముందు హౌజ్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ వేయనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు
☛ అత్యంత భద్రత కలిగిన వ్యక్తుల పట్ల హౌజ్ అరెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్న లూథ్రా టీమ్
Big Breaking: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విరిగిపడిన కొండచరియలు
Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గుడిలోని కేశఖండనశాల పక్కన ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయయంలో కొంతమంది పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మూడు బైక్స్ ధ్వంసం అయినట్లు చెబుతున్నారు.
ఆదివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షాలతో కొండచరియలు బాగా నాని కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ దుర్గగుడి కొండచరియలు విరిగిపడిన సందర్భాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోడ్డుపై విరిగి పడిన కొండచరియలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు
AP BJP: టీడీపీ బంద్‌కు మద్దతుపై సైబర్ క్రైమ్ పోలీసులకు పురందేశ్వరి ఫిర్యాదు
AP BJP: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్‌కు రాష్ట్రంలోని విపక్షాలు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా, జై భీమ్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే బీజేపీ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిందని ఆ పార్టీ చీఫ్ పురందేశ్వరి సంతకంతో కూడిన ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పురందేశ్వరి కూడా స్పందించారు. “తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతు ఇచ్చినట్లుగా బీజేపీ లెటర్ హెడ్‌పై నేను మద్దతు పలికినట్లు ఒక ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోంది .ఈ ఫేక్ లెటర్ సర్క్యులేట్కు కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాము” అని ట్వీట్ చేశారు. ఈ మేరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రేపటి బంద్ పిలుపుకు మద్దతు ఇచ్చినట్లుగా ఒక బిజెపి లెటర్ హెడ్ పై నేను మద్దతు పలికినట్లు ఒక ఫేక్ లెటర్ వాట్స్ ప్ గ్రూప్ లలో సర్క్యులేట్ అవుతోంది.
ఈ ఫేక్ లెటర్ సర్క్యులేట్ కు కారకుల పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేస్తాము.
-… pic.twitter.com/1mkWAi8v2P— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) September 10, 2023
చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్టును ఖండిస్తూ పురందేశ్వరి ట్వీట్ చేశారు. బాబు అరెస్ట్ అప్రజాస్వామికం అని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ టీడీపీ ఇచ్చిన బంద్‌కు మాత్రం బీజేపీ మద్దతు చెప్పకపోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్యవేడు నియోజకవర్గంలో రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. బంద్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.
తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు పవన్. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ సహించదని బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని కోరారు.
టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ కూడా సంఘీభావం ప్రకటించింది. బంద్ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బంద్‌లో పార్టీ శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లోక్‌సత్తా పార్టీ, జై భీమ్ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, సంబరాలు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో పెరుగు అడిగినందుకు చంపేశారు
హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం జరిగింది. బిర్యానీ లవర్స్ షాక్ అయ్యే ఘటన జరిగింది. నగరం నడిబొడ్డున పంజాగుట్ట సిగ్నల్స్ దగ్గర ఉన్న మెరిడియన్ హోటల్లో కస్టమర్‌ను సిబ్బంది కొట్టి చంపేశారు. అసలు ఏం జరిగిందంటే.. లియాకత్ అనే వ్యక్తి బిర్యానీ కోసం ఆదివారం రాత్రి మెరిడియన్ హోటల్‌కు వెళ్లాడు. బిర్యానీ తింటూ మరో కప్పు పెరుగు కావాలని సిబ్బందిని అడిగాడు. దీనిపై వెయిటర్స్, లియాకత్ మధ్య వాగ్వాదం జరిగింది. కస్టమర్ అని కూడా లేకుండా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో లియాకత్‌పై సిబ్బంది దాడి చేసి కొట్టారు. గట్టిగా దెబ్బలు కొట్టడంతో గొడవ పెద్దది అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

కుటుంబసభ్యుల ఆందోళన..
స్టేషన్లో విచారిస్తుండగా ఒక్కసారిగా లియాకత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ మద్దతు తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఎక్స్ట్రా పెరుగు అడిగనందుకు దారుణంగా కొట్టి తమ కుమారుడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు
Uddhav Thackeray: గోద్రా లాంటి ఘటనలు జరిగే అవకాశం.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
Uddhav Thackeray: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశం నలమూలాల నుంచి బస్సులు, ట్రక్కులలో రామాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉందన్నారు. ప్రజలు స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో గోద్రా లాంటి అల్లర్లు జరగవొచ్చని ఠాక్రే పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జల్గావ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ(BJP), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)లకు చెందిన ఆరాధించే వ్యక్తులు లేక సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజ నేతలను ఆరాధిస్తున్నారని విమర్శించారు.
దుమారం రేపుతున్న ఠాక్రే వ్యాఖ్యలు..
లోక్‌సభ ఎన్నికల సమయంలో సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రామమందిరాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ట్రస్టు సభ్యులు ప్రకటించారు. ఈ తరుణంలో ఠాక్రే వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్(CONGRESS), ఎన్సీపీ(NCP)లతో శివసేన జట్టు కట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీకి శత్రు పార్టీగా మారిపోయింది. ఈ క్రమంలోనే శివసేన నుంచి షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో మహా వికాస్ అఘాడ్ కూటమి అధికారం కోల్పోయింది. బీజేపీ ఎమ్మెల్యేల మద్దుతో ఏక్నాథ్ షిండే సీఎంగా ఎంపిక అయ్యారు. తామే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హిందుత్వానికి నిజమైన అనుచరులమని బీజేపీ, షిండే కూటమి పేర్కొంది.
దేశంలో సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్లు..
2002వ సంవత్సరంలో ఫిబ్రవరి 27వతేదీన గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా స్టేషన్లో అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కరసేవకుల రైలు కోచ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఎంతో మంది మరణించారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లకు దారి తీసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ ఒక విష సర్పం: ఉదయనిధి స్టాలిన్!











