RGV Vyuham Release Date: సంచలనాలకు, వివాదాలకు మారు పేరైన దర్శకుడు RGV ‘వ్యూహం’ సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. Y.S రాజశేఖర్ రెడ్డి (Rajasekhara Reddy) మరణం తర్వాత జగన్ (CM Jagan) పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా RGV ఈ సినిమాను తెరెకెక్కించారు. RGV ‘వ్యూహం’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు విడుదలకు సంబందించిన తేదీలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. నవంబర్ 10 న వ్యూహం రిలీజ్ ఫిక్స్ చేసారు. దీనికి సీక్వెల్ గా వస్తున్న శపథం(వ్యూహం 2) జనవరి 25న విడుదల కానున్నట్లు ప్రకటించారు.
2009 నుంచి 2014 వరకు జగన్ కుటుంబంలో, ఏపీ రాజకీయాల్లో (AP Politics) చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించినట్లు ఈ సినిమా ఉందని స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు RGV ఈ సినిమా తేదీని విడుదల చేయడంతో రాజకీయ నాయకులలో, ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. జగన్ కు అనుకూలంగా తీస్తున్న ఈ సినిమా జగన్ రాజకీయ భవిష్యత్, ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని చాలా ఆసక్తిగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=FRCPl_iVkY4
‘వ్యూహం’ సినిమాలోని పాత్రలను RGV తన ట్విట్టర్ వేదిక పై పరిచయం చేశారు. తమిళ నటుడు అజ్మల్ అమీర్ Y.S జగన్ పాత్ర పోషించనున్నట్లు, నటి మానస రాధాకృష్ణన్ జగన్ భార్య భారతి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో RGV రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను చూపబోతున్నట్లు తెలుస్తుంది.
‘వ్యూహం’ టీజర్ 2 లో రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ బ్లాస్ట్, జగన్, భారతి పై జరుగుతున్న కుట్రలను చూపించినట్లు తెలుస్తుంది. పార్ట్ 2 లో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేవరకు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనేది చూపించారు.
Also Read: Abhishek Agarwal: ‘టైగర్ నాగేశ్వర్ రావు’ నిర్మాతకు షాక్..! టెన్షన్ లో రవితేజ..!











