వైసీపీ బస్సు యాత్ర నేపథ్యంలో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. గాంధీ రోడ్డులోని మెడినోవా ఆస్పత్రి సర్కిల్ ప్రధాన రోడ్డుపై బెనర్జీ అనే యువకుడిపై భరత్ అనే వ్యక్తి వేటకొడవలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బెనర్జీని గాంధీ రోడ్డులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బెనర్జీ.. నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు. అలాగే అనుచరుడు భరత్ టీడీపీ ఇంఛార్జి ప్రవీణ్ అనుచరుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Crime News: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఇటీవల అమెరికాలోని మైన్ రాష్ట్రంలో లెవిస్టన్లో భీకర కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాల్పులు చేసిన నిందితుడు రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చివరికి నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత బుధవారం రాత్రి లెవిస్టన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. అతడి వద్ద ఆయుధాలు ఉండటం వల్ల.. మళ్లీ నిందితుడు కాల్పులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: అమ్మో.. నాకు విషం పెట్టి చంపేసేలా ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్
లెవిస్టన్లో ఉంటున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడని హెచ్చరించారు. దీంతో అక్కడి ప్రజలు రెండు రోజుల పాటు భయంతో నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి లెవిస్టన్లోనే ఓ రీసైక్లింగ్ సెంటర్ దగ్గర్లోని చెట్ల పొదల్లో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో నిందితుడు మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. అయితే రాబర్డ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా కాల్చేశారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మరో విషయం ఏంటంటే రాబర్డ్ కార్డ్ గతంలో ఆర్మీ రిజర్వులో ఒక శిక్షణ కేంద్రంలో ఆయుధ వినియోగ శిక్షకుడిగా పని చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అలాగే అతడు ఇంతకుముందు గృహ హింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని.. ఆ తర్వాత మానసిక సమస్యలతో రెండు వారాల పాటు చికిత్స పొందినట్లు వెల్లడించారు.
Nara Lokesh: మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: నారా లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో మరోసారి ములాఖత్ అనంతరం ఆ పార్టీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ తప్ప చేయకపోయినా కూడా 50 రోజులుగా బంధించారని అన్నారు. ఇప్పటివరకు వైసీపీ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో.. తమ పార్టీకి డబ్బు అందాయనే ఆధారాలు చూపించలేదని ఆరోపించారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేవలం వ్యక్తిగత కక్షసాధింపుతోనే చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా జైల్లో పెట్టారని మండిపడ్డారు. అలాగే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబును చంపేయడం కోసం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ మహిళా మంత్రి అంటున్నారన్నారు.
చంద్రబాబును అరెస్టు చేసిన 50 రోజుల్లో ఏం పీకారని.. కొత్త ఆధారాలు ఏమైనా ప్రజల ముందు పెట్టారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఒక్క సెంటర్ కూడా మూయలేదని స్కిల్ డెవలాప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి చెప్పారన్నారు. మాకు సంబంధించిన ఆస్తులు, అకౌంట్స్‌ను కూడా ప్రజల ముందు పెట్టామని తెలిపారు.
చంద్రబాబును అరెస్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. ఏపీలో 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. సీఎం జగన్ దీనిపై సమీక్ష చేయకుండా అసలు రైతులనే పట్టించుకోకుండా బస్సు యాత్ర పేరుతో గాలియాత్ర చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరుగుదలపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని.. బస్సును ఆపి డ్రైవర్‌పై దాడి చేశారని.. ఈ వీడియో కూడా వైరలైందని లోకేష్ అన్నారు. దాడి చేసిన డ్రైవర్‌పై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. కానీ టీడీపీ నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పెట్టి పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. సైకో జగన్‌ను వదిలిపెట్టమని.. ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అసలు వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతే బెయిల్‌పై జగన్ పదేళ్లు ఎలా బయట ఉన్నారని.. సొంత బాబాయ్‌నే చంపిన అవినాశ్ బయట ఎలా తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. వైద్యారోగ్య పరీక్షల పేరుతో ఏం చేస్తారోనని భయంగా ఉందని చంద్రబాబు ఆరోగ్యం పట్ల లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలు పరిసరాల్లో డ్రోన్లు ఎగురుతున్నాయని.. చంద్రబాబు లోపలికి వెళ్లే దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు బరువు తగ్గిన మాట వాస్తవమని తెలిపారు.
72 కిలోలు ఉన్న చంద్రబాబు 66 కిలోలకి తగ్గితే ప్రభుత్వం ఒక కిలో మాత్రమే తగ్గారని చెబుతోందని ఆరోపించారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై పాదయాత్రలో ఈడీకీ, ఐటీకి లేఖ రాస్తానని అన్నారు. ఇసుకపై సీబీఐకీ.. అలాగే మైనింగ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. న్యాయస్థానాల ద్వారా తాము పోరాటం కొనసాగిస్తున్నామన్న లోకేష్.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
Metro: దేశంలో ప్రతిరోజూ ఎంతమంది మెట్రో రైళ్లో ప్రయాణిస్తున్నారో తెలుసా..
ఒకప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే బస్సులు, రైళ్లలోనే ఎక్కువగా ప్రజలు ప్రయాణాలు చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మెట్రో రైళ్లు రావడంతో ప్రజలకు ప్రయాణం మరింత సుగమమైంది. ప్రతిరోజూ చాలామంది ఈ మెట్రో ప్రయాణాలనే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో ప్రయాణాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ మెట్రోల్లో దాదాపు కోటి మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ప్రారంభమైన 16వ అర్బన్ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు.
Also Read: దేశంలో 10 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. వచ్చేవారమే టెండర్లు
అయితే ఈ 20 నగరాల్లో దాదాపు 895 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుందని.. మరికొన్ని రోజుల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో వ్యవస్థలో భారత్ రెండో స్థానం దిశగా వెళ్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ మెట్రో వ్యవస్థల ప్రతినిధులు, రవాణాశాఖ అధికారులు, ముఖ్యనేతలు, అంతర్జాతీయ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు దేశవ్యాప్తంగా 169 నగరాల్లో దాదాపు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నామని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘పీఎం ఈ-బస్ సేవ’ పథకంలో భాగంగా ముందుగా మూడు వేల బస్సుల్ని సేకరించేందుకు వచ్చే వారంలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది. మరోవిషయం ఏంటంటే 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలకే ఈ ఎలక్ట్రిక్ బస్సుల సేవలు వర్తించనున్నాయి.
Also Read: వాటే ఐడియా గురూ.. గాడిదపై వచ్చి నామినేషన్ వేశాడు..
Telangana: సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే కారణంతోనే ఆ పార్టీలో చేరానని అన్నారు. అయితే ఈ చర్యలు లేకపోవడం వల్లే బీజేపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కూడా తాను అనుకున్న లక్ష్యం మాత్రం నెరవలేదని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారని.. బీజేపీకి ఓటు వేస్తే.. బీఆర్ఎస్కు ఓటు వేసినట్లేనని అన్నారు. ప్రజలు నేను కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నారని అందుకే వచ్చానని క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ వ్యాఖ్యానించారు.
Also Read: కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్..
ఇక మునుగోడు నియోజకవర్గంలో సర్వేలన్నీ కూడా నాకే అనుకూలంగా ఉన్నాయని కోమటిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఎన్నికల రోజులు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను కూడా ప్రకటించింది. ఇక రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. ఇప్పిటికే బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే బీజేపీ కూడా అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. శుక్రవారం కేవలం ఒక్క అభ్యర్థితోనే రెండో జాబితాను విడుదల చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ మూడు పార్టీలు తమ పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. తుమ్మల, పొంగులేటి పోటీపై క్లారిటీ..
వాటే ఐడియా గురూ.. గాడిదపై వచ్చి నామినేషన్ వేశాడు..
ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల ప్రచారాలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక నామినేషన్లు వేసే సమయంలో కారు, బైకు, లేదా ట్రాక్టర్‌పై తమ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తుంటారు. కానీ ఓ స్వతంత్ర అభ్యర్థి మాత్రం నామినేషన్ వేసేందుకు వినూత్న ప్రయాణం చేశారు. ఏకంగా ఓ గాడిదపై వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుర్హాన్పూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయిన ప్రియాంక్ థాకూర్ అనే వ్యక్తి ఇలా గాడిదపై వెళ్లి అందర్ని అవాక్కయ్యేలా చేశారు.
ఇక రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించిన తర్వాత ప్రియాంక్ సింగ్ దీనిపై స్పందించారు. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఇలా చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా కొన్ని కుటుంబాల్లోని తాతలు, తండ్రులు, మనుమలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. చాలా ప్రాంతాల్లో చూసినట్లైతే అధికారం ఎప్పటికీ ఒకే కుటుంబం చేతిలో ఉంటోందని, ఆ అధికారంతోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలను వారు గాడిదలను చేసి వాడుకుంటున్నారని ప్రియాంక్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వంశ పారంపర్య రాజకీయాలపై తనకున్న వ్యతిరేకతను చాటి చెప్పేందుకే ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేశానని స్పష్టం చేశారు. అయితే ఈయనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.











