జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల పరిధిలోని దుదేకులపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి చనిపోవడంతో కొడుకు ధనుంజయ్ తండ్రి తిరుపతి వద్దే పెరిగాడు. గత మూడు రోజుల క్రితం తండ్రీ కొడకుల మధ్య చిన్న గొడవ జరిగింది. అది చిలికి చిలికి గాలివానగా మారడంతో క్షణికావేశంతో ధనుంజయ్ కర్రతో తిరుపతి తలపై బలంగా మోదాడు. దీంతో తిరుపతి అక్కడి కక్కడే మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
మానవత్వం మంటగలుస్తోంది. చిన్న తనం నుంచి పెంచిన తండ్రిని కొడుకు చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అంతే కాకుండా తండ్రి ఊరు వెళ్లాడని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Translate this News:











