జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలుడిపై ఆటో డ్రైవర్ హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆటోతో వచ్చిన డ్రైవర్ బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి పరారయ్యాడు. ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఘటన స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దాడికి సంబంచిన పూర్తి వివరాలు రాబడుతున్నారు. డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
పూర్తిగా చదవండి..సికింద్రాబాద్లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్
సికింద్రాబాద్లో దారుణం జరిగింది. నిర్మల్ నుంచి బతుకుతెరువు కోసం కుమార్తె, కుమారుడితో కలిసి ఓ మహిళ హైదరాబాద్కు వచ్చారు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఆమె కుమారుడిని పక్క గల్లీలో నివాసముండే ఆటో డ్రైవర్ గొంతు కోశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన గాంధీ హాస్పిటల్ తీసుకువచ్చారు.

Translate this News:











