హైదరాబాద్‌లోని చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతుర్ని హత్య చేశాడు. బీహెచ్ఈఎల్లోని జ్యోతి స్కూల్ల్లో మోక్షగ్న (9) నాలుగో తరగతి చదువుతుంది. పాప ఎప్పటిలాగే శనివారం సైతం స్కూల్‌కు వెళ్లింది. ప్లాన్ ప్రకారమే బాలిక తండ్రి చంద్రశేఖర్ స్కూల్‌కు వెళ్లాడు. పాపకు మాయ మాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. చందానగర్ సమీపంలోకి తీసుకెళ్లి బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. అదే సమయంలో పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో నిందితుడు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రమాద సమీపంలో చిన్నారి రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతర్ని చంపిన తండ్రి
కన్న తండ్రే కూతర్ని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో చోటు చేసుకుంది. కూతురు చదువుకుంటున్న స్కూల్‌కు వెళ్లిన తండ్రి పాపను పెద్ద అంబర్‌పేట ఓ ఆర్ఆర్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు.

Translate this News:











