రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తాత్కాలిక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీనిని అనుసరించి ఎన్నికలకు ఏఏ పనులు చేపట్టాలి, ఎప్పుడు చేపట్టాలి అనే దాన్ని నిర్దేశించారు. షెడ్యూల్ తాలూకా ఫ్లెక్సీని కార్యాలయంలో ప్రదర్శనకు కూడా ఉంచారు. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నవంబర్ 12 ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తారు. తర్వాత నవంబర్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసాక నవంబర్ 22న తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు. దీనినే ఫార్-7ఏ అని కూడా అంటారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయి. అక్కడి నుంచి మరో నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 11 ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుతానికి దీనిని తాత్కాలిక షెడ్యూల్ అనే చెబుతున్నా…దీనినే ఫైనల్ చేస్తారని కూడా తెలుస్తోంది. 2018లో తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ కూడా ఇదే.
పూర్తిగా చదవండి..telangana elections:డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు-తాత్కాలిక షెడ్యూల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాత్కాలిక షెడ్యూల్ వచ్చేసింది. దీని ప్రకారం డిశంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నాలుగు రోజుల తర్వాత అంటే డిశంబర్ 11న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

Translate this News:











