తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరగవన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయని చాలా మంది అనుకుంటున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి ఉండవు
తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Translate this News:











